సినిమాల్లో ప్రభాస్, అనుష్క జంట ఎంత పెద్ద హిట్ అయ్యిందో.. బుల్లితెర మీద సుధీర్, రష్మీ జంట కూడా అంతే బాగా పాపులర్ అయ్యింది. నిజ జీవితంలో ప్రభాస్, అనుష్క ఒకటైతే చూడాలనుకునే ప్రనుష్క ఫ్యాన్స్ ఎలా అయితే ఉన్నారో.. రష్మీ, సుధీర్ లు కూడా ఒకటవ్వాలని కోరుకునే ఫ్యాన్స్ కూడా ఉన్నారు. వీరిద్దరూ కలిసి ఒక షో చేస్తున్నారంటే చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. అయితే చాలా రోజుల పాటు దూరమైన వీరిద్దరూ కలిసి ఇప్పుడు మరోసారి షో చేస్తున్నారు. దీంతో మరోసారి వీరి కెమిస్ట్రీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
జబర్దస్త్ షోలో అప్పుడప్పుడు గొడవలు జరుగుతుంటాయి. మనం గతంలో కంటెస్టెంట్స్ మధ్య, జడ్జిల మధ్య గొడవలు జరిగిన అనేక సంఘటనలు చూసే ఉన్నాం. తాజాగా మరోసారి జబర్దస్త్ లో గొవడ జరిగింది. ఈ గొడవ కారణంగా ఇంద్రజ జబర్దస్త్ స్టేజ్ వదిలి కోపంగా షో నుంచి వెళ్లిపోయింది.