జబర్దస్త్ షోలో అప్పుడప్పుడు గొడవలు జరుగుతుంటాయి. మనం గతంలో కంటెస్టెంట్స్ మధ్య, జడ్జిల మధ్య గొడవలు జరిగిన అనేక సంఘటనలు చూసే ఉన్నాం. తాజాగా మరోసారి జబర్దస్త్ లో గొవడ జరిగింది. ఈ గొడవ కారణంగా ఇంద్రజ జబర్దస్త్ స్టేజ్ వదిలి కోపంగా షో నుంచి వెళ్లిపోయింది.
బుల్లితెరపై జబర్దస్త్ షో చేసే సందడి అంతా ఇంతా కాదు. ప్రేక్షకులని పొట్ట చెక్కలైయ్యేలా నవ్విస్తూ.. టీఆర్ఫీ రేటింగ్స్ లో దూసుకెళ్తుంది ఈ షో. దాదాపు 10 సంవత్సరాలుగా ప్రసారమవుతున్న ఈ కార్యక్రమం ఇప్పటికీ జనాలకి వినోదం గ్యారంటీ అనేలా ఉంది. జడ్జీలు, కంటెస్టెంట్ లు,యాంకర్ లు మారినా ఈ షో క్రేజ్ ఏ మాత్రం తగ్గట్లేదు. ఇంతలా నవ్వించే ఈ ప్రోగ్రామ్ లో కాస్త సీరియస్ నెస్ కూడా ఉంటుంది. అదేంటి? జబర్దస్త్ లో కామెడీనే ఉంటుంది కదా అనుకుంటే పొరపాటే అవుతుంది. అప్పుడప్పుడు ఈ స్టేజ్ మీద కంటెస్టెంట్ లకి, జడ్జిలకి మధ్య చిన్నపాటి గొడవలు జరుగుతాయి. గతంలో రోజా, నాగబాబు సైతం కంటెస్టెంట్ ల మీద ఫైర్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. తాజాగా అలాంటి సంఘటన ఒకటి జరిగింది. కంటెస్టెంట్ మీద కోపంతో ఇంద్రజ స్టేజ్ వదిలి వెళ్ళిపోయింది.
ఇక ఎప్పటిలాగే ఈ సారి కూడా జబర్ధస్త్ ప్రోమో వచ్చింది. ఏప్రిల్ 13 కి సంబంధించిన ఎపిసోడ్ కాస్త ఆసక్తి కలిగించేలా ఉంది. ప్రారంభంలో నవ్విస్తూ సాగిన ఈ షో చివర్లో ట్విస్ట్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ పాపులర్ షోలో కృష్ణ భగవాన్, ఇంద్రజ జడ్జ్ లుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇంద్రజ.. తాగుబోతు రమేష్, వెంకీ టీమ్ కి మీద కాస్త అసంతృప్తి వ్యక్తం చేసింది. మార్కుల విషయంలో వీరి టీమ్ కి 10 కి 9 ఇచ్చారు. దీంతో కంటెస్టెంట్ వెంకీ మేము 100 శాతం మంచి ప్రదర్శనతో నవ్వించినా మాకెందుకు 10 మార్కులు ఇవ్వలేదు అని ప్రశ్నించాడు.
ఈ క్రమంలోనే వెంకీ అలా ప్రశ్నించడంతో.. ఇంద్రజ అసహనంతో కృష్ణ భగవాన్ కూడా 9 మార్కులిచ్చారు కదా. మరి ఆయనను అడగకుండా నన్నే ఎందుకు అడుగుతున్నారు అని బదులిచ్చింది. మీ కన్నా వారు బాగా చేశారు అందుకే మీకు తక్కువ మార్కులిచ్చాను అని చెప్పుకొచ్చింది. దీంతో అదే పనిగా వెంకీ వాదించడంతో ఇంద్రజ సీట్ లో నుంచి లేచి వెళ్లిపోయింది. మరి ఇది కూడా టీఆర్పీ స్టంట్ హా లేక నిజంగానే ఇంద్రజకు కోపం వచ్చిందా? ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వచ్చే గురువారం వరకు ఆగాల్సిందే. మరి ఇంద్రజ నిజంగానే షో నుంచి వెళ్లిపోయారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.