భారతీయుడు, సోగ్గాడి పెళ్లాం, అన్నమయ్య వంటి సినిమాలతో మెప్పించారు నటి కస్తూరి. తెలుగు, తమిళం, మలయాళ సినిమాల్లో నటించిన ఆమె.. 2000 పెళ్లి చేసుకుని అమెరికాలో స్థిర పడ్డారు. ఇద్దరు పిల్లలు పుట్టి, ఓ వయసు వచ్చే దాకా ఇల్లాలుగా ఉండిపోయిన ఆమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ చేశారు. ఓ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరిస్తున్న ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, ఏలే ఏలే మరదలా అంటూ మోహన్ బాబు, నాగార్జునల పక్కన ఆడిపాడిన నటి కస్తూరి ప్రముఖ ఛానల్లో ప్రసారమౌతున్న‘ఇంటింటి గృహ లక్ష్మి’ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాయి. ఓ రకంగా చెప్పాలంటే తెలుగు సినిమాలతో రాని గుర్తింపు ఆమెకు ఈ సీరియల్ తో వచ్చిందనే చెప్పాలి. తులసీ అనే క్యారెక్టర్లతో ఆమె బుల్లితెరపై మెప్పిస్తున్నారు. పలు తెలుగు, తమిళం, మలయాళంలో పలు సినిమాలు చేసిన ఆమె పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోయారు. రెండవ ఇన్నింగ్స్‌లో మాత్రం బుల్లితెరపై మెరిశారు. అయితే ఇటీవల కాలంలో ఆమె యాక్టివిస్ట్‌గా కూడా మారారు. ఆమె ఏ విషయంపైనైనా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడుతున్నారు. తనకు ఏమీ అనిపిస్తే అది చెబుతూ వార్తల్లో నిలుస్తున్నారు. కొన్ని సార్లు కాంట్రవర్సీకి దారి తీస్తున్నాయి.
ఇటీవల కస్తూరి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. పలు విషయాలపై స్పందించారు. ఆర్ఆర్ఆర్ గ్లోబల్ అవార్డుకు వెళ్లినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడిన ఇంగ్లీషు భాష నుండి నటి, యాంకర్ అనసూయను ఆంటీ అంటూ పిలవడంపై నెట్టింట్లో జరుగుతున్న ట్రోల్స్‌పై స్పందించారు. ‘ఒక చిన్న పాప వచ్చి ఆంటీ అని పిలవడానికి, దున్నపోతులా ఉన్న వ్యక్తి వచ్చి అలా పిలవడానికి చాలా తేడా ఉందని అన్నారు. చిన్నపిల్లలు కాకుండా పెద్దవారు ఎవరైనా ఒక మహిళను ఆంటీ అని పిలిచేందుకు హక్కులేదన్నారు. ‘వయసుతో సంబంధం లేకుండా ఏ మహిళనైనా ఆంటీ అని పిలవడం చిన్న పిల్లల వరకు సబబే కానీ పెద్ద వాళ్లు ఎవరైనా అలా పిలిచారంటే అది ఖచ్చితంగా అగౌరవపరచడమే. ఒక హీరో లేదా నటుడి దగ్గరికెళ్లి అంకుల్ అని పిలుస్తారా? నిజానికి ‘ఆంటీ’ అనే పదానికి ప్రస్తుతం డర్టీ మీనింగ్ కూడా వచ్చేసింది. కానీ అంకుల్ అనే పదంలో అదేం లేదు. అనసూయ కన్నా రెట్టింపు వయసున్న హీరోలున్నారు. వాళ్లను అంకుల్ అని పిలిచి చూడండి. ముమ్మాటికి ఈ విషయంలో నేను అనసూయకు సపోర్ట్ చేస్తా’ అని చెప్పారు.
‘ఎలా పిలవాలో తెలియకపోతే మేడమ్ అనండి.. సిస్టర్ లేదా అమ్మా అని పిలవండి. అదీ కాదంటే గారు అని సంబోధించండి’ అని తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు వెల్లడించారు. అయితే నెటిజన్లు రెచ్చగొట్టాలని చూస్తున్నప్పుడు ఇష్యూకు ఫుల్స్టాప్ పెట్టకుండా, మొండిగా వాదిస్తూ పెద్దదిగా చేయడంపై చాలా మంది అనసూయను విమర్శిస్తున్నారన్న ప్రశ్నకు కస్తూరి స్పందించారు. అనసూయ ఉన్నప్రాబ్లమ్ తన చూసే సమస్య వేరన్న ఆమె.. తన వెర్షన్ చెప్పుకొచ్చింది. ‘ఇన్‌స్టా చాటింగ్‌లో అభిమానులు తమతో కాస్త లైన్ క్రాస్ చేసే కామెంట్లకు చాలాసార్లు హ్యూమరస్‌గా ఆన్సర్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తాను. మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా, నాకు గర్ల్ ఫ్రెండ్ అవుతారా అంటూ పిచ్చి ప్రశ్నలతో వేధిస్తారు. అదీ ఆర్టిస్టులే కాదు. మహిళలకు ఇలాంటివే ఎదుర్కొంటారు. చాలా వరకు హ్యుమరస్ గా సమాధానం ఇచ్చాను. కాని కొన్ని సార్లు అవి హద్దు దాటుతుంటాయి. అప్పుడు యూజర్లను బ్లాక్ చేస్తాను. ఇంతకన్నా వేరే మార్గం లేదు’ అని సూచించారు.
అదేవిధంగా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఈవెంట్ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడిన అమెరికన్ యాక్సెంట్‌పై జరిగిన ట్రోల్స్‌పైనా రియాక్ట్ అయ్యారు. అలా ట్రోల్స్ చేయడం తప్పని అన్నారు. తను అలా మాట్లాడటం తప్పేకాదని, చాలా గొప్ప విషయమని, చాలా బాగా మాట్లాడారని అన్నారు. అలాగని అమెరికన్ యాక్సెంట్‌ను హైదరాబాద్‌లో ట్రై చేయకూడదని చెప్పింది. పైగా మంచు లక్ష్మి వంటి వారు తెలుగును కూడా అమెరికన్ యాక్సెంట్లో మాట్లాడటమంటే ఓవర్ చేయడమేనంటూ తన అభిప్రాయాలను పంచుకుంది. మోడన్ డ్రస్ పై స్పందిస్తూ.. తను కంఫర్ట్ బుల్ అనిపిస్తే ధరిస్తానని అన్నారు. ఒక్కలైఫ్ లో ఎవరెవరు ఏమీ అనుకుంటున్నారనీ భయపడితే.. మీ కోసం మీరెప్పుడు బతుకుతారండీ అంటూ వ్యాఖ్యానించారు.