ప్రస్తుతం టెలికాం ఇండస్ట్రీలో మూడు కంపెనీలదే పెత్తనం. ఇందులో ఒకటి రిలయన్స్ ఇండస్ట్రీస్, ఆసియా కుబేరుడు ముఖేష్ అంబానీ సొంత కంపెనీ జియో.. టెలికాం ఇండస్ట్రీలో దీని వాటా ఎక్కువ. భారతి ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా నుంచి అప్పుడప్పుడు పోటీ ఎదురవుతున్నా.. జియో తీసుకొస్తున్న కొత్త కొత్త ప్లాన్స్ తో పోటీలో నిలవలేకపోతున్నారు. ఇక ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ రూటే వేరు. అన్నిటెలికాం కంపెనీలు 4జీ టెక్నాలజీని అందిస్తూ.. 5జీ వైపు పరుగులు తీస్తుంటే.. బీఎస్ఎన్ఎల్ మాత్రం 4జీ గురుంచి కూడా ఆలోచించట్లేదు. ఇలాంటి తరుణంలో పోటీలో ఎల్లప్పుడూ ముందుండాలనుకునే జియో.. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారి కోసం సరికొత్త ప్లాన్ లను తీసుకొచ్చింది.
ఇంటర్ నెట్ ఎక్కువగా వినియోగించేవారికి ఒక్కోసారి డేటా సరిపోదు. దీంతో వారు మళ్లీ రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే అలాంటి వారి కోసం జియో.. రూ.2878, రూ.2998 ధరలతో సరికొత్త ప్లాన్‌లని ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌లను ‘వర్క్ ఫ్రమ్ హోమ్ డేటా ప్యాక్’ల విభాగంలో ప్రవేశపెట్టింది. ‘ఇవి కేవలం డేటా ప్యాక్‌లు మాత్రమే కాబట్టి ఇవి వినియోగదారులకు వాయిస్ కాలింగ్ మరియు ఎస్ఎమ్ఎస్ ప్రయోజనాలను లభించవని గుర్తుంచుకోండి’.
రూ.2878 ప్లాన్
ఈ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులు. రోజుకు 2GB డేటాను అందిస్తుంది. అంటే ఈ ప్లాన్ మొత్తం వాలిడిటీ కాలంలో అందించే మొత్తం డేటా 730GB. వినియోగదారులు తమ రోజువారీ డేటాను వినియోగించిన తర్వాత.. డేటా స్పీడ్ 64 కేబిపిఎస్ కి తగ్గుతుంది.
రూ.2998 ప్లాన్
ఈ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులు. రోజుకు 2.5GB డేటాను అందిస్తుంది. అంటే ఈ ప్లాన్ మొత్తం వాలిడిటీ కాలంలో అందించే మొత్తం డేటా 912.5GB. వినియోగదారులు తమ రోజువారీ డేటాను వినియోగించిన తర్వాత.. డేటా స్పీడ్ 64 కేబిపిఎస్ కి తగ్గుతుంది.
ఇందులో ఏ ప్లాన్ తీసుకున్నా.. నెలకు సగటున 240 చెల్లిచాల్సి వస్తోంది. అంటే.. సాధారణ నెలవారీ అన్‌లిమిటెడ్ ప్లాన్ లతో పోలిస్తే.. పెద్దగా తేడా కనిపించట్లేదు. నెలవారీ 2GB అన్‌లిమిటెడ్ ప్లాన్ 299 రూపాయలకు లభిస్తోంది. ఇందులో డేటాతో పాటుగా అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్ లు ఉచితంగా లభిస్తాయి.
30 రోజుల వ్యాలిడిటీతో మరిన్ని డేటా ప్లాన్స్
రూ. 181 30 రోజులు వ్యాలిడిటీ 30 జీబీ డేటా
రూ. 241 30 రోజులు వ్యాలిడిటీ 40 జీబీ డేటా
రూ. 301 30 రోజులు వ్యాలిడిటీ 50 జీబీ డేటా
Welcoming India’s next decade of growth. Envisioned by Mrs. Nita Ambani, Jio World Centre opens with ‘Fountain of Joy’ and ‘India’s Largest Convention Centre’.
You are invited. #WithLoveFromJio#JioWorldCentre #FountainofJoy pic.twitter.com/QLyWEizrJb— Reliance Jio (@reliancejio) March 4, 2022