ప్రముఖ ఓటీటీ యాప్స్ కి సంబంధించిన కంటెంట్ ని బీఎస్ఎన్ఎల్ ఒకే వేదికపై సింగిల్ ప్లాన్ తో పొందేలా వెసులుబాటు కల్పించింది. సినిమా ప్లస్ పేరుతో జీ5, డిస్నీ+హాట్ స్టార్ వంటి ఓటీటీ కంటెంట్ ను అందజేస్తుంది.
సినిమాలు, వెబ్ సిరీస్ లు, టీవీ షోలను ఓటీటీల్లోనే ఎక్కువగా చూస్తున్నారు. వీటిని పలు ఓటీటీ సంస్థలు అందిస్తున్నాయి. అయితే అన్నిటినీ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే బిల్లు ఎక్కువవుతుంది. అలానే ప్రతీది సబ్ స్క్రైబ్ చేసుకోవాలంటే కష్టం. కొన్ని సంస్థలు వీటన్నిటినీ ఒకే వేదిక మీదకు తీసుకొచ్చి సింగిల్ ప్యాక్ తో అన్ని ఓటీటీ యాప్స్ ని సబ్స్క్రైబ్ చేసుకునేలా వీలు కల్పిస్తున్నాయి. తాజాగా బీఎస్ఎన్ఎల్ కూడా సింగిల్ ప్లాన్ తో పలు ఓటీటీ యాప్స్ ని అందిస్తుంది. జీ5, డిస్నీ+హాట్ స్టార్, సోనీ లివ్ వంటి ప్రముఖ ఓటీటీ యాప్స్ ని ఒకే ఒక వేదిక మీదకు తీసుకొచ్చింది బీఎస్ఎన్ఎల్. బీఎస్ఎన్ఎల్ సినిమా ప్లస్ పేరుతో జీ5, సోనీ లివ్, యప్ టీవీ, డిస్నీ+హాట్ స్టార్, హంగామా, లయన్స్ గేట్, ఎపిక్ ఆన్ ఓటీటీ యాప్స్ ని సింగిల్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ మీద అందుబాటులోకి తీసుకొచ్చింది.
వివిధ ఓటీటీ కంటెంట్ల కాంబినేషన్ తో మూడు రకాల ప్యాక్స్ ను ఆఫర్ చేస్తోంది. ఫైబర్ కనెక్షన్ తో రిజిస్టర్ అయి ఉన్న మొబైల్ నంబర్ మీద ఈ ఓటీటీ ప్యాక్ అనేది యాక్టివేట్ చేసుకోవచ్చు. ఈ సబ్స్క్రిప్షన్ ఫీజు ఫైబర్ నెట్ బిల్లులో ఛార్జ్ చేయబడుతుంది. ఇందులో స్టార్టర్ ప్యాక్, ఫుల్ ప్యాక్, ప్రీమియం ప్యాక్ అని మూడు రకాల ప్యాక్స్ ఉన్నాయి. స్టార్టర్ ప్యాక్ రూ. 49కే అందిస్తుంది. ఈ ప్యాక్ లో ప్రీమియం ఇండియన్ ఒరిజినల్స్, బ్లాక్ బస్టర్ హాలీవుడ్ సినిమాలు, టీవీ షోలు కలిగిన లయన్స్ గేట్, హంగామా, షెమారూ, ఎపికాన్ ఓటీటీ యాప్స్ వస్తాయి. రూ. 199 ప్యాక్ లో జీ5 ప్రీమియం, సోనీ లివ్ ప్రీమియం, డిస్నీ+హాట్ స్టార్, యప్ టీవీ యాప్స్ ని పొందవచ్చు.
రూ. 249 ప్రీమియం ప్యాక్ కింద జీ5 ప్రీమియం, సోనీ లివ్ ప్రీమియం, యప్ టీవీ, షెమారూ, హంగామా, లయన్స్ గేట్, హాట్ స్టార్ ఓటీటీలను పొందవచ్చు. తెలుగు వారి ఆహా ఓటీటీని కూడా యప్ టీవీ స్కోప్ సౌత్ ప్యాక్ లో చేర్చింది. సినిమా ప్లస్ ద్వారా 300+ లైవ్ టీవీ ఛానల్స్, 500+ టీవీ షోస్, 8000+ సినిమాలు చూడవచ్చు. స్కోప్ వీడియో యాప్ ద్వారా కంప్యూటర్, ల్యాప్ టాప్, మొబైల్, ఐపాడ్, ట్యాబ్లెట్, స్మార్ట్ టీవీ, సెట్ టాప్ బాక్స్ వంటి వివిధ పరికరాల్లో ఓటీటీ కంటెంట్ ని వీక్షించవచ్చు. ఇందులో సూపర్ స్టార్ ప్రీమియం ప్లస్ ప్లాన్ ఉంది. రూ. 999 ప్లాన్ తో 150 ఎంబీపీఎస్ హైస్పీడ్ ఇంటర్నెట్ తో పాటు 300+ లైవ్ టీవీ ఛానల్స్ ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్, మ్యూజిక్, కిడ్స్ ఛానల్స్ చూడవచ్చు.
అలానే 500+ టీవీ సిరీస్, 100+ ఒరిజినల్ టీవీ షోస్, 8000+ సినిమాలను చూడవచ్చు. వీటిలో డిస్నీ+హాట్ స్టార్, సోనీ లివ్ ప్రీమియం, జీ5 ప్రీమియం, యప్ టీవీ, లయన్స్ గేట్, హంగామా ప్లే, షెమారూ వంటి ఓటీటీ యాప్స్ వస్తాయి. 100 ఎంబీపీఎస్ స్పీడ్ ఉన్న ప్లాన్ లో జీ5 ప్రీమియం, సోనీ లివ్ ప్రీమియం, యప్ టీవీ యాప్స్ వస్తాయి. 300+ లైవ్ టీవీ ఛానల్స్ ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్, మ్యూజిక్, కిడ్స్ ఛానల్స్ వస్తాయి. అలానే 500+ టీవీ సిరీస్, 100+ ఒరిజినల్ టీవీ షోస్, 8000+ సినిమాలను చూడవచ్చు. యాడ్ ఆన్ ప్యాక్స్ కింద యప్ టీవీ స్కోప్ ఎంటర్టైన్మెంట్ ప్యాక్, యప్ టీవీ స్కోప్ సౌత్ ప్యాక్ లను కూడా సబ్స్క్రైబ్ చేసుకుని అపరిమిత వినోదాన్ని పొందవచ్చు. ఇందులో ఆహా కూడా ఉంటుంది.