కేంద్ర ప్రభుత్వ టెలికాం సంస్థ భారతీయ సంచార్ నిగమ్ లిమిటెడ్ వినియోగదారులకు మరో సంచలనమైన ఆఫర్స్ అందిస్తోంది. జియో, ఎయిర్టెల్ వంటి టెలికమ్యూనికేషన్స్‌కు ధీటుగా సరికొత్త ప్లాన్స్ అందుబాటులోకి తీసుకువచ్చింది.
కేంద్ర ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL సరికొత్త ప్లాన్స్ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. తక్కువ ధరలోనే డేటా, కాల్స్, ఎస్ఎంఎస్లను ఈ ప్రత్యేక ఆఫర్ల ద్వారా అందించనుంది. ప్రస్తుతం ఉన్న జియో, ఎయిర్టెల్ వంటి టెలికమ్యూనికేషన్స్‌కు పోటీతో కేవలం రూ. 200 కంటే తక్కువ ధరలో BSNL రీచార్జ్ ప్లాన్ అందించనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం.
BSNL రూ.184 ప్లాన్ వినియోగదారులకు అపరిమిత కాల్స్, 100 SMSలు, 1GB రోజువారీ డేటా అందిస్తుంది. దీని వ్యాలిడిటీ 28 రోజులు ఉంటుంది. తక్కువ సంఖ్యలో నెట్ వినియోగించేవారికి ఈ ప్లాన్ చాలా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. BSNL రూ. 185 ప్లాన్‌తో యూజర్ 1GB డేటా, 100 రోజువారీ SMSలు, ఫ్రీ కాలింగ్ అవకాశాన్ని పొందవచ్చు. రోజువారీ డేటా యూజ్ చేసిన తర్వాత వినియోగదారులకు 40Kbps స్పీడ్‌తో ఇంటర్నెట్‌ని యాక్సెస్ చేయవచ్చు. రోజు ఎక్కువ డేటాను ఉపయోగించేవారికి BSNL రూ. 185 ప్లాన్‌ను అందించింది. ఇందులో 1GB రోజువారీ డేటా, ప్రతీ రోజు 100 SMSలు, అన్ లిమిటెడ్ కాల్స్, 28 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ ఇది. ఈ విధంగా రూ.200 లోపు ఈ ప్లాన్స్ BSNL అందుబాటులోకి తెచ్చింది.