ఎయిర్ టెల్ వినియోగ దారులకు దేశవ్యాప్తంగా టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా రకరకాల రీచార్జ్ ప్లాన్ లను అందిస్తోంది. అపరిమిత కాలింగ్, 5జీ డేటా, ఓటీటీ ప్రయోజనాలను అందించే ఎయిర్ టెల్ ప్లాన్ ల వివరాలేంటో తెలుసుకుందాం..
ఎయిర్ టెల్ వినియోగ దారులకు దేశవ్యాప్తంగా టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా రకరకాల రీచార్జ్ ప్లాన్ లను అందిస్తోంది. ఆన్ లిమిటెడ్ ఇంటర్నెట్ నుంచి 5G డేటా యాక్సెస్ మరియు ఉచిత OTT సబ్ స్క్రప్షిన్ ల వరకు అందరికి ప్రీపెయిడ్ ప్లాన్ లు అందుబాటులోకి వచ్చాయి. ఎయిర్ టెల్ ప్రస్తుతం డిస్నీ+హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్ వంటి OTT ప్లాట్ ఫామ్ లకు ఫ్రీగా చూసే అవకాశం కల్పించే విధంగా కొత్త రీచార్జ్ ప్లాన్ లను విడుదల చేసింది. అలాగే.. మీ ప్రెయిడ్ మెుబైల్ రీచార్జ్ ప్లాన్ లోనే మీకు కావాల్సినట్లుగా.. ఎయిర్ టెల్ డిస్నీ+ హాట్ స్టార్ తో పాటు 15 రకాల ఇతర ఓటీటీ ఛానెల్స్ ను ఉచితంగా యాక్సెస్ ను పొందవచ్చు. అపరిమిత కాలింగ్, 5జీ డేటా, ఓటీటీ ప్రయోజనాలను అందించే ఎయిర్ టెల్ ప్లాన్ ల వివరాలేంటో తెలుసుకుందాం..
రూ.359 ప్లాన్:
ఈ రూ. 359 ప్లాన్ తో ఎయిర్ టెల్ అన్లిమిటెడ్ కాలింగ్ మరియు రోజుకు 100 ఎస్ఎంఎస్ లను పంపించే విధంగా.. అలాగే నెలరోజుల పాటు ప్రతిరోజు 2జీబీ డేటాను వినియోగించుకోవచ్చు. ఇంకా దానితో పాటు వినియోగదారులు అపోలో 24/7, హలో ట్యూన్స్, ఎయిర్ టెల్ ఎక్స్ ట్రీమ్ ప్లే వంటి అనేక అదనపు ప్రయోజనాలను పొందవచ్చు. ఇంకా ఎయిర్ టెల్ ఎక్స్ ట్రీమ్ ప్లే సోనీ లీవ్, ఏరోస్ నౌ, లైన్స్ గేట్ ప్లే తో పాటు 15 కంటే ఎక్కువ ఓటీటీ ప్లాట్ ఫామ్ లను వీక్షించే అవకాశం కల్పిస్తుంది. అలాగే అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో వినియోగదారులు 5జీ ఇంటర్నెట్ డేటాను ఉపయోగించవచ్చు.
రూ.499 ప్లాన్:
రూ. 499 ప్లాన్ తో 5జీ ప్రయోజనాలు ఉంటాయి. రూ.399 ప్లాన్ తో పోలిస్తే ఎయిర్ టెల్ ఈ ప్లాన్ కు సమానమైన లాభాలను అందజేస్తుంది. అయితే ఎయిర్ టెల్ ఎక్స్ స్ట్రీమ్ ప్లే యోక్సెస్ తో పాటు రీచార్జ్ ప్లాన్ 3 నెలల పాటు డీస్నీ+ హాట్ స్టార్ మెుబైల్ ఫ్రీ సబ్ స్క్రిప్షన్ ను కూడా అందజేస్తేంది.
రూ.699 ప్లాన్:
ఓకవేళ మీరు ఒక నెల కంటే ఎక్కువ వ్యాలీడిటీ ఉన్న ప్లాన్ కోసం ఎదురుచూసినట్లయితే ఇది మీ కోసమే. ఇప్పుడు ఇది 56 రోజుల వ్యాలీడిటీ తో పాటు రోజువారీ డేటా 3జీబీ, అన్ లిమిటెడ్ కాలింగ్స్, రోజుకు 100 ఎస్ ఎంఎస్ లను పంపించుకోవచ్చు.
రూ. 839 ప్లాన్:
ఈ ప్లాన్ మాత్రం కేవలం 84 రోజుల వ్యాలిడిటీ తో పాటు ఎయిర్ టెల్ ప్లాన్ 2GB డేటా ప్రతిరోజు, అలాగే రోజుకు SMS, 5G బెనిఫిట్స్ ను కల్పిస్తుంది. Airtel Xtream Play, Disney+Hotstarమెుబైల్ అదనపు బెనిఫిట్స్ తో పాటు సహా 3 నెలల పాటు పొందవచ్చు.
రూ. 3359 ప్లాన్:
ఈ సంవత్సరం ప్లాన్ వచ్చేసరికి 365 రోజుల వ్యాలిడిటీ తో అందిస్తుంది. 2.5 GB రోజువారి డేటా గా వస్తుంది. అలాగే అన్ లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS,అర్హత కల్గి ఉన్న యూజర్లతో 5G యాక్సెస్ ను అందిస్తుంది. దీంతో పాటుగా ఎయిర్ టెల్ డిస్నీ+హాట్ స్టార్ మెుబైల్ వార్షిక సబ్ స్క్రిప్షన్, మరియు Apollo 24/7 మెంబర్ షిప్ తో పాటు మరెన్నో అదనపు లాభాలను కూడా అందజేస్తుంది.