హలో’ఈ పదాన్ని రోజుకొకసారి అంటాం లేదా వింటాం. అంతలా మనతో కారణం ఫోన్ సంభాషణలే. ఎవరికైనా ఫోన్ చేసినా, ఫోన్ లిఫ్ట్ చేసినా ముందు వచ్చే మాట హలో అనే. అంతలా మనకు టెలిఫోన్ వ్యవస్థ నుండి సెల్ ఫోన్ నెట్ వర్క్ వరకు అభివృద్ది చెందాం.
‘హలో’ఈ పదాన్ని రోజుకొకసారి అంటాం లేదా వింటాం. అంతలా మనతో ముడిపడిపోవడానికి కారణం ఫోన్ సంభాషణలే. ఎవరికైనా ఫోన్ చేసినా, ఫోన్ లిఫ్ట్ చేసినా ముందు వచ్చే మాట హలో అనే. టెలిఫోన్ వ్యవస్థ నుండి సెల్ ఫోన్ నెట్ వర్క్ వరకు అభివృద్ది చెందాం. చేతిలో సెల్ ఫోన్ లేనిదో రోజు కాదు కదా పూట కూడా గడవదు. పుట్టగొడుగుల్లా సెల్ ఫోన్ సంస్థలు పుట్టుకురావడంతో టెలిఫోన్ సంస్థలన్నీ అప్ డేట్ అవుతూ.. సిమ్ విధానాన్ని తీసుకువచ్చాయి. ఎయిర్ టెల్, రిలయన్స్, వొడాఫోన్, ఐడియా, యునినార్, ఎయిర్ సెల్ వంటి నెట్ వర్క్ సంస్థలు.. టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు చేస్తూ.. సిమ్ విధానంలో రూపాంతరం చెంది.. ఇంటర్నెట్ వంటి సదుపాయాలను అందిస్తున్నాయి.
ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్, అందులో అన్ లిమిటెడ్ బ్యాలెన్స్ వేసుకుని.. పొద్దున్న నుండి సాయంత్రం వరకు ముచ్చట్లు చెబుతూనే ఉంటారు. ఇంటర్నెట్ సదుపాయం వచ్చాక ఊసులకు హద్దే లేదు. ఇక సోషల్ మీడియాల్లో తల దూర్చితే.. చాలు.. పక్కనోడు ప్రాణం పోతున్న పట్టించుకోము. ఇదంతా నెట్ వర్క్ పై ఆధారపడి ఉంటుంది. కాసేపు నెట్ వర్క్ రాకపోతే పరిస్థితి ఏంటీ. అదే జరిగింది తెలుగు రాష్ట్రాల్లో. ఎయిర్ టెల్, జియో నెట్ వర్కర్లలో సమస్య తలెత్తింది. దీంతో మధ్యలోనే కాల్ కట్ అయిందని వినియోగదారులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. కాల్స్ కూడా చాలా సేపు కనెక్ట్ కాలేదని వాపోతున్నారు. ఇంటర్నెట్ సమస్యలు కూడా తలెత్తినట్లు చెబుతున్నారు. సాంకేతిక లోపం కారణంగా ఇలా జరిగినట్లు తెలుస్తోంది. అయితే వీటిపై స్పందించిన సంస్థలు.. త్వరలో సమస్యను పరిష్కరిస్తామని ప్రకటించాయి.