టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో విలక్షణమైన పాత్రలు చేసిన జేడీ చక్రవరి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. కొన్ని సంవత్సరాలు సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ సీనియర్ హీరో తాజాగా "దయా" అనే ఒక వెబ్ సిరీస్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు.
ఓటీటీ లో సినిమాలకి ప్రేక్షకులు బాగానే కనెక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా వెబ్ సిరీస్ లకు ఆడియన్స్ నుండి మంచి స్పందన లభిస్తుంది. దీంతో ఓటీటీలకున్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని స్టార్ హీరోలు, హీరోయిన్లు కూడా డిజిటల్ బాట పట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఓటీటీలో ఎంట్రీ ఇవ్వని ఒక సీనియర్ టాలీవుడ్ హీరో తొలిసారి అడుగుపెట్టబోతున్నాడు. అతడెవరో కాదు విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న జేడీ చక్రవరి. ఈయన నటించిన “దయా” అనే ఒక క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ త్వరలోనే ఓటీటీలో రిలీజయ్యేందుకు సిద్ధమైంది.
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో విలక్షణమైన పాత్రలు చేసిన జేడీ చక్రవరి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. కొన్ని సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ సీనియర్ హీరో తాజాగా “దయా” అనే ఒక వెబ్ సిరీస్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. తెలుగమ్మాయిలు ఇషా రెబ్బ, బుల్లి తెర యాంకర్ యాంకర్ విష్ణుప్రియ, రమ్యనంబీసన్, జోష్ రవి, కమల్ కామరాజు కీలక పాత్రలు పోషించారు. ఈ క్రైమ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఆగస్టు 4 నుంచి “దయా” సిరీస్ ఓటీటీలోకి అందుబాటులోకి రానుంది. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ రిలీజయింది. రేప్ సీన్లతో ఈ సినిమా స్టార్ట్ కావడం, లేడీ రిపోర్టర్ మిస్సింగ్, వ్యాన్ డ్రైవర్‌గా జేడీ ఎంట్రీ, చూస్తుంటే పక్క క్రైమ్ థ్రిల్లర్ నేపధ్యములో సాగే సినిమా అని అర్ధం అవుతుంది. ఇలాంటి జోనర్లు ఓటీటీలో సూపర్ హిట్ ఇటీవలే సూపర్ హిట్ గా నిలుస్తున్నాయి. మరి ఈ వెబ్ సిరీస్ ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి.
A blazing trail of murder, clues and a mystery. #WhoisDayaa?#HotstarSpecials #Dayaa coming soon #DayaaOnHotstar #JDChakravarthy @YoursEesha @nambessan_ramya @kamalkamaraju @pavansadineni @mayankparakh19 @paruchuri6969 @editorviplav @vivek_kalepu @NambuShalini… pic.twitter.com/UnSZgEgBhO
— Disney+ Hotstar (@DisneyPlusHS) July 8, 2023