SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » business » 696 Plan For Family Of 4 Members

Jio Family Plans: కుటుంబం మొత్తానికి ఒక్కటే జియో ప్లాన్.. కేవలం రూ.696కే!

ఈరోజుల్లో రీఛార్జ్ చేయాలంటే కనీసం రూ. 300 అవుతుంది. డైలీ 1 జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్ కావాలంటే మనిషికి రూ. 300 అవుతుంది. అదే ఒక కుటుంబంలో నలుగురికి రీఛార్జ్ చేయాలంటే రూ. 1200 అవుతుంది. ఒకే ఒక్క ప్లాన్ ఉంటే బాగుంటుంది కదా. అది కూడా తక్కువ ధరకే. అయితే మీ కోసమే ఈ రీఛార్జ్ ప్లాన్స్.

  • Written By: Nagarjuna
  • Published Date - Fri - 4 August 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Jio Family Plans: కుటుంబం మొత్తానికి ఒక్కటే జియో ప్లాన్.. కేవలం రూ.696కే!

ఈరోజుల్లో ఒక కుటుంబంలో అందరికీ ఫోన్లు ఉంటున్నాయి. ఎవరికి వారు నెల నెలా కనీసం రూ. 250 నుంచి రూ. 300 వరకూ పెట్టి రీఛార్జ్ చేయించుకుంటున్నారు. దీని వల్ల బడ్జెట్ పెరిగిపోతుంది. అయితే కుటుంబం మొత్తానికి ఒకటే ప్లాన్ ఉండి తక్కువ ధర ఉంటే బాగుంటుంది కదా అని అనుకునేవారికి జియో అదిరిపోయే ప్లాన్ ని తీసుకొచ్చింది. జియో ఫ్యామిలీ ప్లాన్స్ పేరుతో రెండు రీఛార్జ్ ప్లాన్స్ ని అందిస్తుంది. ఒకటి రూ. 399 నుంచి ప్రారంభమవుతుండగా.. మరొకటి రూ. 699 నుంచి ప్రారంభమవుతుంది. ఈ రెండు ప్లాన్స్ లో నాలుగు చొప్పున మొత్తం 8 సబ్ ప్లాన్స్ ఉన్నాయి. రూ. 399 ఫ్యామిలీ ప్లాన్ తీసుకుంటే ఒక ప్రైమరీ సిమ్ కార్డు వస్తుంది. నెలకు రూ. 399 అవుతుంది. 75 జీబీ డేటా వస్తుంది. ఈ ప్లాన్ లో ఫ్యామిలీ మెంబర్స్ ని చేర్చుకోవడానికి అవ్వదు.

ఫ్యామిలీ మెంబర్స్ ని యాడ్ చేయాలంటే రూ. 498 ప్లాన్ ఉంది. ఒక కుటుంబ సభ్యుల నంబర్ యాడ్ చేయడానికి అదనంగా రూ. 99 అవుతుంది. అప్పుడు ఇద్దరికి నెల బిల్లు రూ. 249 చొప్పున అవుతుంది. 75 జీబీ డేటాతో పాటు అదనంగా 5 జీబీ డేటా వస్తుంది. మొత్తం 80 జీబీ డేటా వస్తుంది. ఒక ప్రైమరీ నంబర్ కి, ఒక యాడ్ ఆన్ నంబర్ వస్తుంది. అదే ఒక ప్రైమరీ నంబర్ కి ఇద్దరి ఫ్యామిలీ మెంబర్స్ యొక్క నంబర్స్ యాడ్ చేయాలంటే.. రూ. 399 ప్లాన్ కి రూ. 99 ప్లాన్స్ ని రెండు ఎంచుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మీ ప్లాన్ విలువ రూ. 597 అవుతుంది. అప్పుడు ముగ్గురు వ్యక్తులకు ఒక్కొక్కరికీ రూ. 199 చొప్పున బిల్లు అవుతుంది. ఈ ప్లాన్ లో 75 జీబీ డేటాకి అదనంగా 10 జీబీ డేటా వస్తుంది. మొత్తం మీద 85 జీబీ డేటా వస్తుంది.

jio

ఒక ప్రైమరీ నంబర్ కి మూడు యాడ్ ఆన్ నంబర్స్ యాడ్ చేయాలంటే రూ. 696 ప్లాన్ ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ప్రైమరీ నంబర్ కి రూ. 399, మిగతా మూడు నంబర్స్ కి రూ. 99 చొప్పున అవుతుంది. మొత్తం మీద ఈ ప్లాన్ తీసుకుంటే మనిషికి రూ. 174 పడుతుంది. డేటా ప్రైమరీ నంబర్ కి 75 జీబీతో పాటు మిగతా మూడు నంబర్స్ కి 5 జీబీ చొప్పున 15 జీబీ వస్తుంది. టోటల్ గా 90 జీబీ వస్తుంది. అన్ని ప్లాన్స్ లోనూ అన్ లిమిటెడ్ కాల్స్, అన్ లిమిటెడ్ 5జీ డేటా ఉచితంగా వస్తుంది. కాకపోతే ఇవి పోస్ట్ పెయిడ్ ప్లాన్స్. మరొక ప్లాన్ లో రూ. 699 నుంచి మొదలవుతుంది. ఇందులో ఒకటే ప్రైమరీ నంబర్ ఉండి 100 జీబీ డేటా వస్తుంది.

మరొక ప్లాన్ రూ. 798 ఉంది. ఈ ప్లాన్ లో ఒక ఫ్యామిలీ మెంబర్ ని యాడ్ చేసుకోవచ్చు. 105 జీబీ డేటా వస్తుంది. మనిషికి రూ. 399 పడుతుంది. అంటే ఒక మనిషి నెలకు 50 జీబీ పైనే వాడుకోవచ్చు. అంటే రోజుకు 1.5 జీబీ పడింది. కొంతమంది తక్కువ వాడతారు. కొంతమంది ఎక్కువ వాడతారు. అడ్జస్ట్ చేసుకోవడం బట్టి ఉంటుంది. మరొక ప్లాన్ రూ. 897.. ఇందులో రెండు యాడ్ ఆన్ నంబర్స్ ని చేర్చుకోవచ్చు. అప్పుడు మనిషికి రూ. 299 పడుతుంది. 110 జీబీ డేటా అంటే మనిషికి 36 జీబీ వస్తుంది. రోజుకు 1 జీబీ పైనే పడినట్టు. ఇదే ప్లాన్ ని ఇండివిడ్యువల్ గా తీసుకుంటే రూ. 299 ప్లాన్ కి 30 జీబీ మాత్రమే వస్తుంది. మరొక ప్లాన్ ఒక ప్రైమరీ నంబర్, మూడు యాడ్ నంబర్స్ తో రూ. 996కే వస్తుంది. ఈ ప్లాన్ తీసుకుంటే మనిషికి రూ. 249 పడుతుంది.

jio

ఈ ప్లాన్ లో ఒక్కొక్కరికీ 28.75 జీబీ చొప్పున నలుగురికీ 115 జీబీ వస్తుంది. ఎలా చూసినా గానీ ఈ ప్లాన్స్ వల్ల చాలా వరకూ ప్రయోజనం పొందుతారు. విడివిడిగా రీఛార్జ్ చేయించుకోవాలంటే మనిషికి రూ. 300 చొప్పున నలుగురు వ్యక్తులకు టోటల్ గా రూ. 1200 అవుతుంది. అదే ఫ్యామిలీ ప్లాన్ తీసుకుంటే 90 జీబీ డేటాతో రూ. 696 అయితే, 115 జీబీ డేటాతో రూ. 996 అవుతుంది. రూ. 500 నుంచి రూ. 200 వరకూ ఆదా అవుతుంది. జియో వెల్కమ్ ఆఫర్ కింద ఒక నెల ట్రయల్ గా రూ. 399 ప్లాన్ తో అన్ లిమిటెడ్ కాల్స్, 75 జీబీ డేటా, అన్ లిమిటెడ్ 5జీ డేటా వాస్తుంది. రూ. 699 ప్లాన్ లో ఒక నెల ట్రయల్ గా అన్ లిమిటెడ్ కాల్స్, 100 జీబీ డేటా, అన్ లిమిటెడ్ 5జీ డేటా, నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ కూడా వస్తున్నాయి.

  • ప్లాన్స్ గురించి తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

Tags :

  • business news
  • jio
  • Recharge plans
Read Today's Latest businessNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

TVS X Smart Electric Scooter: TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

TVS X Smart Electric Scooter: TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

  • బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

    బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

  • ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

    ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

  • ఈ యాప్స్ మీ ఫోనులో ఉంటే.. వెంటనే తొలగించండి

    ఈ యాప్స్ మీ ఫోనులో ఉంటే.. వెంటనే తొలగించండి

  • ఎక్స్‌తో బాగా ఆదాయం రావాలా! ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్..

    ఎక్స్‌తో బాగా ఆదాయం రావాలా! ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam