కేంద్ర ప్రభుత్వ టెలికాం సంస్థ భారతీయ సంచార్ నిగమ్ లిమిటెడ్ వినియోగదారులకు మరో సంచలనమైన ఆఫర్స్ అందిస్తోంది. జియో, ఎయిర్‌టెల్ వంటి టెలికమ్యూనికేషన్స్‌కు ధీటుగా సరికొత్త ప్లాన్స్ అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఒకప్పుడు ఫోన్ రీఛార్జ్ నెలంతా వచ్చేది. ఇప్పుడు తెలివితేటలు చూపిస్తూ 28 రోజులకే పెడుతున్నారు. దీని వల్ల 13 నెలలు రీఛార్జ్ చేయించుకోవాల్సి వస్తుంది. అయితే నెల రీఛార్జ్ లు చేసే సరికి సామాన్యులకు భారంగా మారుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ ప్లాన్ ని ఎంచుకుంటే కొంత డబ్బు ఆదా అవుతుంది. ప్రతి రూపాయి విలువైనదే అని ఆలోచించేవారు, ఆచి తూచి ఖర్చు పెట్టేవారికి ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది.
ప్రముఖ ఓటీటీ యాప్స్ కి సంబంధించిన కంటెంట్ ని బీఎస్ఎన్ఎల్ ఒకే వేదికపై సింగిల్ ప్లాన్ తో పొందేలా వెసులుబాటు కల్పించింది. సినిమా ప్లస్ పేరుతో జీ5, డిస్నీ+హాట్ స్టార్ వంటి ఓటీటీ కంటెంట్ ను అందజేస్తుంది.
బీఎస్ఎన్ఎల్ సంస్థలో పని చేయాలని భావిస్తున్న వారికి గుడ్ న్యూస్. బీఎస్ఎన్ఎల్ రిక్రూట్మెంట్ 2023లో భాగంగా కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చింది. పోస్టుల భర్తీ కోరుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. మరి పోస్టులు ఏంటి? అర్హతలు ఏంటి? జీతం ఎంత ఇస్తారు? వంటి వివరాలు మీ కోసం.
దేశంలో 5జీ సేవలు అధికారికంగా అందుబాటులోకి వచ్చాయి. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ సంస్థలు ఇప్పటికే ప్రధాన నగరాల్లో 5జీ సేవలను మొదలుపెట్టాయి. ఈ క్రమంలో.. ఇప్పటివరకు ఈ రేసులో వెనకబడ్డ ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత సంచార నిగమ్ లిమిడెట్(బీఎస్‌ఎన్‌ఎల్) తమ వినియోగదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. త్వరలోనే 5జీ సేవలు ప్రారంభించనుంది. రాబోయే 5 నుంచి 7 నెలల్లో బీఎస్‌ఎన్‌ఎల్ 4జీ టెక్నాలజీ.. 5జీకి అప్‌గ్రేడ్ అవుతుందని కేంద్ర టెలికాం, రైల్వే శాఖల మంత్రి అశ్వినీ […]
బీఎస్ఎన్ఎల్ సంస్థ గత కొంతకాలంగా పెరుగుతున్న పోటీని అధిగమించేందుకు ఎంతో కృషి చేస్తోంది. ఇప్పటికే ఎన్నో ఆఫర్లను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్.. ప్రైవేటు కంపెనీలకు పోటీగా వివిధ ఆఫర్లను తీసుకొస్తోంది. డేటా, టారిఫ్‌ల విషయంలో చాలా కంపెనీలతో పోలిస్తే బీఎస్‌ఎన్‌ఎల్ అతి తక్కువ ధరలకే ప్లాన్‌లో అందుబాటులో ఉంచింది. ఇప్పుడు బ్రాడ్‌బాండ్‌పై కూడా కన్నేసింది. ఇప్పటికే వైఫై విషయంలో ప్రైవేటు కంపెనీల నుంచి ఎంతో పోటీ ఉంది. దానిని అధిగమించేందుకు బీఎస్‌ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్ వేసింది. కనెక్షన్ తీసుకున్న […]
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తైన నేపథ్యంలో దేశమంతటా పండగ వాతావరణం నెలకొంది. కేంద్ర ప్రభుత్వం.. ‘ఆజాదీకా అమృత్ మహోత్సవాల’ పేరిట నిర్వహిస్తున్న ఈ వేడుకలో ప్రతి పౌరుడు ఇంటిపై జాతీయ జెండాలు ఎగురవేస్తూ తమ దేశభక్తిని చాటుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్.. ఈ వేడుకలను తమ వినియోగదారులు మరింత ఆనందంగా జరుపుకోవాలని ఉద్దేశ్యంతో.. ఫైబర్ ప్లాన్స్ పై స్పెషల్ ఆఫర్స్ ప్రకటించింది. ఆ వివరేలేంటో ఇప్పుడు […]
టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు కేంద్ర మంత్రి అశ్వని వైష్ణవ్ గట్టి హెచ్చరిక పంపారు. పనిలో నిర్లక్ష్యం.. నిబద్దత లోపిస్తే.. పరిణామాలు తీవ్రంగానే ఉంటాయని కేంద్ర టెలికాం మంత్రి అశ్వినీ వైష్ణవ్.. 62 వేల మంది బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇటీవలే బీఎస్ఎన్ఎల్ పునరుద్ధరణకు రూ.1.64 లక్షల కోట్లతో కేంద్ర ప్రభుత్వం భారీ ప్యాకేజీని ప్రకటించడం తెలిసిందే. గత కొంత కొంత కాలంగా టెలీకాం రంగంలో ప్రైవేట్ సంస్థలు దూసుకు వెళ్తున్న కారణంగా బీఎస్ఎన్ఎల్ బలోపేతానికి […]
బీఎస్ఎన్ఎల్ సేవలు మరింత విస్తరించాలని కేంద్రం నిర్ణయించింది. అందులో భాగంగా బీఎస్ఎన్ఎల్ కు భారీ ప్యాకేజ్ ప్రకటించింది. ఈ ప్యాకేజ్ విలువ సుమారు లక్షా 64వేల కోట్లు. బీఎస్ఎన్ఎల్ ఫైబర్ సేవలు పటిష్టం చేయడానికి ఈ నిధులు ఉపయోగించాలని కేంద్రం భావిస్తోంది. మరోవైపు.. ప్రవేట్ టెలికాం కంపెనీలు 4జీ టెక్నాలజీతో వినియోగదారులను ఆకట్టుకుని.. 5జీవైపు పరుగులు పెడుతున్నాయి. అయినప్పటికీ.. బీఎస్ఎన్ఎల్ మాత్రం 4జీ వైపు కూడా ద్రుష్టి పెట్టడం లేదు. ఇప్పటికే ఎంతోమంది కస్టమర్లు 4జీ బీఎస్ఎన్ఎల్ […]
7 రోజులు, 14 రోజులు, 28 రోజులు వ్యాలిడిటీ అంటూ టెలికాం కంపెనీలు వినియోగదారులను ఇన్నాళ్లు అందినకాడికి దోచుకున్నాయి. అలా రోజురోజుకి టెలికాం కంపెనీల ఆగడాలు మితిమీరిపోవడంతో.. టెలికాం నియంత్రణా సంస్థ ట్రాయ్ రంగంలోకి దిగింది. ఇష్టమొచ్చిన ప్లాన్స్ తో వినియోగదారులను ఇన్నాళ్లు దోచుకుంది చాలు.. ఇకపై తప్పనిసరిగా నెల రోజుల కాలవ్యవధితో కొత్త ప్లాన్స్ ను అందుబాటులోకి తేవాలని టెలికాం నెట్వర్క్ సంస్థలను ట్రాయ్ ఇటీవల ఆదేశించింది. దీంతో అన్ని కంపెనీలు 30 లేదా 31 […]