ఇకపై తెలంగాణలో సెల్ ఫోన్ దొంగలకు కాలం చెల్లినట్లే అంటున్నారు పోలీసులు. దానికి కారణం సీఐడీ రంగంలోకి దిగడమే. ఇందుకు సంబంధించి కేంద్ర టెలీకమ్యూనికేషన్స్ శాఖ ఆధ్వర్యంలో 'సెంట్రల్ ఎక్విప్ మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రార్(CIER)'తో త్వరలోనే ఒప్పందం కుదుర్చుకోబోతోంది తెలంగాణ ప్రభుత్వం.
‘సార్.. అర్జెంటుగా ఒక కాల్ చేసుకోవాలి.. నా సెల్ లో బ్యాలన్సు అయిపోయింది.. ఒకసారి ఫోన్ ఇస్తారా!’ ఇలాంటి ఘటనలు అందరూ పేజ్ చేసే ఉంటారు. ఏదేని సందర్భాల్లో అపరిచిత వ్యక్తులు ఫోన్ అడగడం.. పాపమని మనం ఇవ్వడం.. లేదయ్యా అని మనం అన్నామనుకో.. అవతలి వ్యక్తి, ‘సార్ ప్లీజ్.. ఒక్క కాల్.. మా ఇంట్లో వాళ్లకు బాగోలేదు లేదంటే నా పర్స్ పోయింది’ ఇలాంటి మాటలు చెప్తూ ఉంటారు. ఇలాంటి వారి మాటలు అస్సలు నమ్మకండి. […]
సాధారణంగా మనం ప్రయాణించేటప్పుడు బస్సుల్లో, రైళ్లలో, విమానాల్లో కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అదీకాక కొన్ని నిషేధిత వస్తువులను వెంట తీసుకురావద్దని సదరు సంస్థలు ముందుగానే హెచ్చరిస్తుంటాయి. అయితే చాలా మందికి అంతుచిక్కని విషయం ఏంటంటే? విమానాల్లో ప్రయాణించేటప్పుడు మీ సెల్ ఫోన్స్ ను స్విచ్ ఆఫ్ చేయమని మీకు పదేపదే.. అనౌన్స్ మెంట్స్ వస్తుంటాయి. దానితో పాటుగా ఎయిర్ హోస్టెస్ కూడా మీకు చెబుతుంటారు. ముఖ్యంగా విమానం గాల్లోకి ఎగురుతున్నప్పుడు, నేలపైకి దిగుతున్నప్పుడు మీ ఫోన్ […]
నేటికాలంలో సెల్ ఫోన్ల వాడకం బాగా పెరిగిపోయింది. రోజులో ఎక్కువ సమయం మొబైల్ తోనే గడుపుతుంటారు. ఇంకా దారుణం ఏమిటంటే కొందరు ఆలయాల్లో కూడా వాటిని ఉపయోగిస్తుంటారు. దైవ భక్తి కంటే వాటి మీద ఎక్కువ ఏకాగ్రత పెడుతుంటారు. అంతేకాక ఆలయ పరిసరాల్లో సెల్ఫీలు దిగుతూ ఇతర భక్తులకు ఇబ్బందులు కలిస్తుంటారు. ఈ నేపథ్యంలో తమిళనాడు హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. తమిళనాడు వ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లోకి సెల్ ఫోన్ తీసుకువెళ్లడంపై నిషేధం విధిస్తున్నట్లు మద్రాస్ హైకోర్టు […]
వైరస్ జాడను పసిగట్టేందుకూ స్మార్ట్‌ఫోన్‌లు ఉపయోగపడతాయని బ్రిటన్ శాస్త్రవేత్తలు తేల్చారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కట్టడికి పరిశోధకులు ఎన్నో పరిశోధనలు నిర్వహిస్తున్నారు. వ్యక్తిలో కోవిడ్ వైరస్‌ను గుర్తించేందుకు స్మార్ట్‌ఫోన్‌లు ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. మొబైల్ ఫోన్ స్క్రీన్ల నుంచి సేకరించిన నమూనాల సాయంతో కోవిడ్‌ను వేగవంతంగా గుర్తించే చౌకైన ఒక విధానాన్ని పరిశోధకులు అభివృద్ధి చేశారు. అయితే ఈ పరీక్షల నిర్ధారణ కోసం ముక్కులో, గొంతులో పొడవైన స్వాబ్ పెట్టకుండా పరీక్షలు నిర్వహించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. […]