బీఎస్ఎన్ఎల్ సంస్థలో పని చేయాలని భావిస్తున్న వారికి గుడ్ న్యూస్. బీఎస్ఎన్ఎల్ రిక్రూట్మెంట్ 2023లో భాగంగా కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చింది. పోస్టుల భర్తీ కోరుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. మరి పోస్టులు ఏంటి? అర్హతలు ఏంటి? జీతం ఎంత ఇస్తారు? వంటి వివరాలు మీ కోసం.
ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా? అయితే ఈ అవకాశం మీ కోసమే. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. 40 గ్రాడ్యుయేట్, డిప్లోమా అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను స్వీకరిస్తోంది. అప్రెంటిస్ యాక్ట్ 1961 కింద ఏడాది పాటు ట్రైనింగ్ ఇస్తారు. హర్యానా టెలికాం సర్కిల్ లోని ఫరీదాబాద్, కర్నల్, అంబాలా సహా పలు జిల్లాలలో జాబ్ ఇస్తారు. ఎవరైనా ఈ జాబ్ కి దరఖాస్తు చేసుకోవచ్చు. అప్రెంటిస్ పోస్టులని తీసిపడేయకండి. ఖాళీగా ఉండే కంటే ఏడాది పాటు టెలికామ్ రంగంలో శిక్షణ తీసుకుంటే అనుభవం వస్తుంది. ఆ అనుభవంతో బయట వేరే కంపెనీల్లో ఉద్యోగం చేయచ్చు. లేదు మీ పనితనం నచ్చితే అందులోనే కొనసాగే అవకాశం ఉంటుంది.
మొత్తం ఖాళీలు: 40