దేశీయ అతి పెద్ద టెలికాం కంపెనీల మధ్య సమరం వినియోగదారుల పాలిట వరంగా మారింది. అతి తక్కువ ధరకే బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. వేలకు వేలకు వెచ్చించి ప్రవేట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు తీసుకోవటం కంటే రూ. 200లోపు ఉన్న ఈ సేవలు వినియోగించుకోవటం ఉత్తమం.
మొబైల్ వినియోగదారులకు టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే కనీస రీఛార్జి మొత్తాన్ని గతంతో పోలిస్తే దాదాపు రెట్టింపు చేసిన ఎయిర్‌టెల్ మరోసారి రీఛార్జ్ ధరల పెంపు దిశగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు భారతీ ఎయిర్‌టెల్ సీఈవో సునీల్ మిత్తల్ సంకేతాలు పంపారు.
నేటికాలంలో దాదాపు ప్రతి ఒక్కరు మొబైల్ ను వినియోగిస్తున్నారు. వీటి వాడకంతో పాటు నెట్ వినియోగం బాగా పెరిగిపోయింది. అయితే దాదాపు చాలా మంది రీఛార్జ్ చేయించుకుని ఫోన్ వినియోగించడమే తప్ప.. వాటి రేట్ల విషయాలను పరిశీలీంచడం చాలా తక్కువగా చేస్తుంటారు. ఈ మధ్యకాలంలో రీఛార్జ్ ప్లాన్ల రేట్లు బాగా పెరిగిపోయాయి. టెలికాం కంపెనీలు చిన్న చిన్నగా డేటా, వాయిస్ రేట్లు పెంచడం మెుదలుపెట్టాయి. ఇప్పుడు మరింత ధరల వడ్డనకు సిద్ధమయ్యాయి. ఇటీవల ఎయిర్‌టెల్ రీఛార్జ్ ధరలు […]
టెలికాం కంపెనీలు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ పోటాపోటీగా కొత్త ప్లాన్లను తీసుకొస్తున్నాయి. మా ప్లాన్‌ల వల్ల అధిక ప్రయోజనాలు పొందచ్చంటూ ఒకటి.. మా ప్లాన్‌లలోనే ఎక్కువ లాభాలు అంటూ మరొకటి యూజర్లను ఆకట్టుకునే పనిలో పడ్డాయి. ఈ నేపథ్యంలో భారతీ ఎయిర్‌టెల్, ప్రీపెయిడ్.. పోస్ట్ పెయిడ్ ప్లాన్‌ల మధ్య వ్యత్యాసాన్ని తగ్గించేలా రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను తీసుకొచ్చింది. 489,509 రూపాయల విలువైన ఈ ప్లాన్లలో అపరిమిత డేటా లభిస్తుంది. ఇతర అద్భుతమైన ప్రయోజనాలు కూడా […]
టెలికాం రంగంలో దిగ్గజ సంస్థగా ఎయిర్‌టెల్ గుర్తింపు పొందింది. వేగవంతమైన నెట్‌వర్క్ సామార్థ్యం కలిగి ఉండి.. కస్టమర్లకు సేవలు అందిస్తోంది. దేశంలో ఎయిర్‌టెల్, జియోల మధ్యనే గట్టి పోటీ నడుస్తుంటుంది. ఈ రెండు టెలికాం ఆపరేటర్లు కూడా.. వినియోగదారుల అభిరుచి.. అవసరాలను దృష్టిలో పెట్టుకుని.. రకరకాల ప్లాన్స్, ఇతర సౌకర్యాలు అందుబాటులోకి తీసుకువస్తాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఎయిర్‌టెల్.. తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎయిర్‌టెల్ సిమ్ వాడేవారు.. సులభంగా 8 లక్షల రూపాయల వరకు […]
5జీ.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ పేరు, ఈ సేవల గురించి బాగా వినిపిస్తోంది. అయితే ఇప్పటికే దేశంలో 5జీ సేవలు ప్రారంభం అయ్యాయని చాలా మందికి తెలియకపోవచ్చు. ఒక్కసారిగా వారి ఫోన్లో 5జీ సేవలు చూసి అవాక్కవుతున్నారు. అయితే భారతీ ఎయిర్‌టెల్ ఇప్పటికే 5 సేవలు ప్రారంభించింది. దేశవ్యాప్తంగా మొదటి ఫేజ్‌లో 8 నగరాల్లో తమ 5జీ సేవలు ప్రారంభించింది. అవి.. ఢిల్లీ, ముంబయి, చెన్నై, హైదరాబాద్, సిలిగురి, నాగ్‌పూర్, వారణాసిలో ఎయిర్‌టెల్ 5జీ సేవలు ఇప్పటికే […]
టెలికాం కంపెనీలైన ఎయిర్ టెల్, రిలయన్స్ జియో మధ్య పోరు రోజురోజుకూ పెరుగుతోంది. ఒకరిని మించి మరొకరు అన్నట్లుగా ప్లాన్లను విడుదల చేస్తూ.. యూజర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ పోటీతత్వంతో రెండు సంస్థలు వినియోగదారుల కోసం ఉత్తమమైన, చౌకైన ప్లాన్‌లను అందిస్తున్నాయి. తద్వారా వినియోగదారులు ఎక్కువ కాలం తమ నెట్‌వర్క్‌లో కొనసాగింపు చేసుకునే వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి. మరి.. ఈ రెండింటిలో ఏది బెస్టు అన్నది ఇప్పుడు చూద్దాం.. 14 రోజులు, 20, 24, 28, […]
దేశంలో 5జీ సేవలకు సంబంధించి మరో ముందడుగు పడింది. స్పెక్ట్రం వేలం ముగియడంతో దేశీయ టెలికాం కంపెనీలు 5జీ సేవల్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. ఇప్పటికే భారతీ ఎయిర్‌టెల్ 5జీ సేవలకు సంబంధించి ఎరిక్సన్, నోకియా, శాంసంగ్‌లతో ఒప్పందం కుదుర్చుకోగా, జియో సైతం.. కీలక అప్ డేట్ ఇచ్చింది. 5G రోల్‌అవుట్‌తో ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ జరుపుకుంటామంటూ ప్రకటించింది. దీంతో ఆగస్టు 15 నుంచే జియో 5G సేవలు మొదలుకానున్నట్లు తెలుస్తోంది. 5జీ […]
ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ దేశంలో 5జీ సేవలు మొదలుకానున్నాయి. స్పెక్ట్రం వేలం ముగియడంతో ఈ నెల 10 వరకు ఆయా సంస్థలకు టెలికాం సంస్థ ఆయా సంస్థలకు స్పెక్ట్రంను కేటాయించనుంది. ఈ క్రమంలో ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ 5జీ సేవలకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. ఆగస్టు నెలలోనే 5జీ సేవలను తీసుకొస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఎరిక్సన్, నోకియా, శాంసంగ్‌తో ఒప్పందం చేసుకున్నట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా సేవలు అందించేందుకు ఎరిక్సన్, నోకియాతో ఎయిర్‌టెల్ […]
కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 5జీ స్పెక్ట్రం వేలం.. తీవ్ర నిరాశను మిగిల్చింది. గత రెండేళ్లతో పోల్చితే మెరుగైన ఫలితాలు కనిపించినప్పటికీ.. 70 శాతం స్పెక్ట్రమ్ మాత్రమే అమ్ముడైంది. రూ.4.3 లక్షల కోట్ల విలువైన స్పెక్ట్రంను అమ్మకానికి పెడితే.. రూ.1.5 లక్షల కోట్లకే బిడ్లు పరిమితమయ్యాయి. కాగా, నిరుడు 4జీ స్పెక్ట్రం వేలంలో రూ.77,815 కోట్ల బిడ్డింగ్ జరగగా, 2010లో చేపట్టిన 3జీ స్పెక్ట్రం వేలంలో రూ.50,968.37 కోట్ల బిడ్లు వచ్చాయి. ఈ రకంగా చూస్తే మాత్రం […]