ఆమెను 52 సార్లు కిడ్నాప్ చేసిందెవరూ…ఎందుకు?

సువిశాల విశ్వంలో కేవలం భూమ్మీద మాత్రమే జీవం మనుగడ సాగించగల్గుతుందా.. మిగతా గ్రహాల్లో ఏవైనా జీవులు ఉంటాయా.. ఉంటే ఎలాంటివి ఉంటాయి అనే అనుమానం జనాల్లో ఎప్పటి నుంచో ఉంది. దీని గురించి తెలుసుకునేందుకు అనేక పరిశోధనలు జరిగాయి, జరుగుతున్నాయి. ఇక అమెరికాలోని ఏరియా 51లో గ్రహాంతర జీవులున్నాయిని అక్కడ రహస్య పరిశోధనలు జరుగుతున్నాయని నమ్ముతారు చాలా మంది. ఇక వాస్తవం ఏంటో ప్రభుత్వాలకే తెలియాలి. కాకపోతే అప్పుడప్పుడు జనాలకు వింత వింత అనుభవాలు ఎదురువుతాయి. ఇప్పటికే చాలా మంది తాము చూశామని ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా అమెరికాకు చెందిన ఓ మహిళ చెప్పిన విషయం యావత్ ప్రపంచాన్నే ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఏలియన్స్‌ తనను కిడ్నాప్‌ చేసినప్పుడు అయిన గాయాలను కూడా చూపించారు. కొందరు ఆమె మాటలను కొట్టి పారేస్తుండగా మరికొందరేమో ఆమె మాటలు నిజమే అయిండొచ్చని వ్యా్ఖ్యానిస్తున్నారు.

WildThingCollage

బ్రాడ్‌ఫోర్డ్‌కు చెందిన 50 ఏళ్ల పౌలా స్మిత్ అనే మ‌హిళ ఈ షాకింగ్ కామెంట్స్ చేసిన‌ట్లు డైలీస్టార్ వెల్ల‌డించింది. త‌న చిన్న‌త‌నంలో తొలిసారి ఏలియ‌న్ల‌ను చూశాన‌ని, అప్ప‌టి నుంచీ ఇప్ప‌టి వ‌ర‌కూ చూస్తూనే ఉన్నాన‌ని ఆమె చెప్ప‌డం విశేషం. వాళ్లు త‌న‌ను కిడ్నాప్ చేశార‌ని, ఈ సంద‌ర్భంగా త‌న ఒంటిపై అయిన గాయాల‌ను కూడా పౌలా చూపిస్తోంది. ఏలియ‌న్లు సిల్వ‌ర్ క‌ల‌ర్‌లో ఉన్న‌ట్లు కూడా ఆమె చెప్పింది. ఏవో వింత వింత ఫొటోల‌ను కూడా ఆమె చూపిస్తున్న‌ట్లు డైలీస్టార్ రిపోర్ట్ వెల్ల‌డించింది. తనను ఏలియన్స్‌ ఇప్పటివరకు 52సార్లు కిడ్నాప్ చేసి తీసుకెళ్లాయని, వాటి టెక్నాలజీని తనకు చూపించాయని పౌలా అనే మహిళ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె చెబుతోంది నిజామో కాదో తెలియదు గానీ గ్రహాంతర జీవుల ఉనికిపై మళ్లీ చర్చకు దారితీసింది. జీవితంలో మొదటిసారి 1982 తొలిసారి స్పేస్‌షిప్‌ను చూశాను. కొన్ని క్షణాల తర్వాత నేను దాని లోపల ఉన్నాను. అప్పుడు నేను చాలా చిన్నపిల్లను. స్పేస్‌షిప్‌ లోపలంతా సైలెంట్‌గా ఉంది. నా హార్ట్‌బీట్‌ నాకే వినిపించేంత నిశ్శబ్దంగా ఉందక్కడ. కళ్లునులుముకుని చూసినా ఏం కనిపించడం లేదక్కడ. ఇంతలో ఓ వింత ఆకారం నా కళ్ల ముందుకు వచ్చింది’’ అని గుర్తు చేసుకున్నారు పౌలా.