ఓ వ్యక్తి కారులో వెళ్తుండగా కొంతమంది దుండగులు మాటు వేసి కిడ్నాప్ చేశారు. అనంతరం అతన్ని రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి చచ్చేలా కొట్టారు. ఏమీ ఎరగనట్టు యాక్సిడెంట్ అని కవరింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. చివరికి?
ఇంట్లో పిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు ఎలాంటి ఆపద వస్తుందో చెప్పలేం. ఒక్కోసారి ఊహించని ఆపద తలుపు తట్టచ్చు. అలా ఓ కుటుంబానికి పెద్ద కష్టమే వచ్చేది. కానీ, స్థానికుల అప్రమత్తం అవ్వడంతో ముప్పు తప్పింది.
మత్తులో జోగితే ప్రపంచంలో ఏం జరుగుతుందో కాదూ.. మన చుట్టూ ఏం జరుగుతుందో అన్న విషయాన్ని కూడా గుర్తించలేం. మందు తాగకండిరా బాబూ అని పోలీసులు.. సినిమా థియేటర్లలో, పెద్ద పెద్ద పోస్టర్లు వేసినా బుద్ధి రాదూ. మద్యం మత్తులో తమ కుమారుడ్నిని పొగొట్టుకున్నారు ఓ తల్లిదండ్రులు
ధనమేరా అన్నింటికీ మూలం అని ఓ సినీ కవి రాసినట్లు, ప్రపంచం మొత్తం డబ్బు చుట్టూనే తిరుగుతుంది. డబ్బు కోసం ఎంతటి అఘాయిత్యానికైనా తెగిస్తున్నారు. అక్రమ మార్గాలు, అడ్డదారులు తొక్కుతున్నారు. ఈ దుడ్డు కోసమే అయిన వారు సైతం మానవ బాంధవ్యాలు మర్చిపోతున్నారు. బావమరిది బావ బతుకు కోరతారంటారు. కానీ ఈ బావమరిది కాసుల కోసం కక్కుర్తి పడి బావనే కిడ్నాప్ చేశాడు. అయితే ఈ కిడ్నాప్ కేసును పోలీసులు చేధించడంతో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. […]
వారిద్దరూ చిన్న నాటి నుండి స్నేహితులు, ఆ త్వరాత స్నేహం ప్రేమగా మారింది. ఆ ఇద్దరిదీ ఒకే ఊరు అయినప్పటికీ కులాలు వేరు. ఇదే వారి పెళ్లికి అడ్డుగోడగా మారింది. కానీ ఆరేళ్ల ప్రేమను చంపుకోలేక.. ఇద్దరు ఇంట్లో నుండి పారిపోయి రిజిస్టర్ పెళ్లి చేసుకున్నారు. అమ్మాయిని అతడి ఇంటికి తీసుకెళ్లాడు. తమ అమ్మాయి కనిపించడం లేదని భావించిన ఆమె తల్లిదండ్రులు, విషయం తెలిసి పెళ్లి కుమార్తె తల్లిదండ్రులతో మాట్లాడాలంటూ వచ్చి.. కూతుర్ని కిడ్నాప్ చేశారు. ఈ […]
గౌతమ్ అదానీ.. గత కొంత కాలంగా ఈ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతుంది. మన దేశంలోనే కాక.. ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా గుర్తింపు పొందాడు అదానీ. గత కొన్ని రోజులుగా ఆయన సంపద రాకేట్ వేగంతో పెరుగుతోంది. అయితే అదానీ నేడు పొందిన ఈ గుర్తింపు ఆయనకు ఊరికే రాలేదు. ఎంతో కష్టపడి.. ఒక్కో మెట్టు పైకెక్కుతూ ఈ స్థాయికి చేరుకున్నారు. చిన్నతనంలో కుటుంబ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉపాధి కోసం ముంబై వచ్చాడు. చదువు మధ్యలోనే ఆపేసి.. […]
రంగారెడ్డి జిల్లా, ఆదిభట్లలో డెంటిస్ట్ కిడ్నాప్ వ్యవహారం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. మిస్టర్ టీ ఫౌండర్.. నవీన్ రెడ్డి.. శుక్రవారం మధ్యాహ్నం.. అందరూ చూస్తుండగానే.. సుమారు 100 మందితో కలిసి.. యువతి ఇంట్లోకి చొరబడి.. దాడి చేసి.. ఆమెను కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు. అడ్డుకోబోయిన వారిపై దాడి చేశాడు. ఈ కేసును ఛాలెంజింగ్‌గా తీసుకున్న పోలీసులు.. 6 గంటల్లోనే కేసు చేధించి.. వైశాలిని కాపాడారు. ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆమెని గుర్తించిన పోలీసులు.. ఏపీ తెలంగాణ […]
రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో మహిళా డాక్టర్ కిడ్నాప్ కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రేమ వ్యవహారం వల్లనే ఈ కిడ్నాప్ చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. కిడ్నాప్ చేసిన వ్యక్తిని మిస్టర్ టీ వ్యవస్థాపకుడు నవీన్ రెడ్డిగా గుర్తించారు పోలీసులు. దాంతో ఈ కిడ్నాప్ వ్యవహారంపై ఆసక్తి నెలకొంది. అసలు నవీన్ రెడ్డి, వైశాలిల మధ్య పరిచయం ఎలా ఏర్పడింది.. ఎందుకు విడిపోవాలనుకున్నారు.. మరి నవీన్ రెడ్డి ఎందుకు ప్రేమించిన యువతినే కిడ్నాప్ చేయాలని భావించాడు.. పోలీసులు […]
రంగా రెడ్డి జిల్లాలోని తుర్కయాంజాల్ మున్సిపాలిటీ, మన్నేగూడెకు చెందిన ఓ యువతి కిడ్నాప్‌కు గురైన సంగతి తెలిసిందే. సిరి టౌన్ షిప్‌లో 100 మంది యువకులు కలకలం సృష్టించారు. శుక్రవారం సిరిటౌన్ షిప్‌కు చెందిన ముచ్చెర్ల దామోదర్ రెడ్డి, నిర్మల దంపుతుల కుమార్తె వైశాలిని ఎత్తుకెళ్లిపోయారు. మిస్టర్ టీ ఓనర్ నవీన్ రెడ్డి తమ కుమార్తెను కిడ్నాప్ చేశాడని బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం […]
రంగారెడ్డి జిల్లాలో కిడ్నాప్ కలకలం చెలరేగింది. ఓ యువతిని దాదాపు 100 మంది యువకులు కిడ్నాప్ చేశారు. యువతి ఇంటి వద్దకు వెళ్లిన యువకులు.. ఇంట్లో వారిపై దాడి చేసి మరీ యువతిని ఎత్తుకెళ్లారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. తుర్కయాంచల్ మున్సిపాలిటీ, మన్నేగూడెలోని సిరిటౌన్ షిప్‌లో ముచ్చెర్ల దామోదర్ రెడ్డి, నిర్మల దంపుతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఓ కూతురు వైశాలి ఉంది. ఆమె డెంటల్ డాక్టర్‌గా విధులు నిర్వర్తిస్తోంది. తాజాగా, మిస్టర్ టీ ఓనర్ నవీన్ […]