భాఎప్పడో ఇంటి నుంచి అదృశ్యం అయిన వాళ్లు.. ఇక రారు అని బాధపడుతున్న సమయంలో.. కొన్ని సంవత్సరాల తర్వాత అకస్మాత్తుగా ప్రత్యక్షం అవుతుంటారు. దాంతో కుటుంబ సభ్యుల ఆనందం మాటల్లో వర్ణించలేనిదిగా విధంగా ఉంటుంది.
వేదమంత్రాల సాక్షిగా.. పెద్దల ఆశీర్వాదంతో మూడుముళ్ల బంధంతో దాంపత్య జీవితంలోకి అడుగుపెడారు కొత్తజంట. భార్యాభర్తల అనుబంధం ఒక ప్రత్యేకమైన పవిత్ర బంధం అంటారు. అటువంటి సంబంధానికి పునాది ప్రేమ-నమ్మకం. కానీ ఈ మద్య కాలంలో చాలా మంది చిన్న చిన్న విషయాలకే గొడవలు పడటం.. భాగస్వామితో విడాకులు తీసుకోవడానికి కోర్టులను ఆశ్రయిస్తుంటారు. కొంతమంది కుటుంబంపై విరక్తి చెంది కనిపించకుండా ఎక్కడో బతికేస్తుంటారు. మరికొంతమంది మతిస్థిమితం కోల్పోయి ఇంటికి దూరమవుతుంటారు. అలా పదేళ్ల క్రితం దూరమైన తన భర్త బిచ్చగాడిగా కనిపించడంతో ఆ భార్య కన్నీరు పెట్టుకున్న తీరు చూసిన స్థానికులు సైతం బాధపడ్డారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఉత్తర్‌ప్రదేశ్ లోని బలియాలో హృదయాలను కదిలించే సంఘటన చోటు చేసుకుంది. బలియాలోని దౌరాన్ ఆసుపత్రికి వైద్యం కోసం ఓ మహిళ వెళ్తుంది. ఆ సమయంలో ఆసుపత్రి ఆవరణలో నేలపై ఓ వ్యక్తి అత్యంత దీన స్థితిలో ఉన్న వ్యక్తి కనిపించాడు. బిచ్చగాడిలా కనిపిస్తున్న వ్యక్తిని గమనించిన ఆ మహిళ అతడి దగ్గరికి వెళ్లి చూసి షాక్ కి గురైంది. అతను ఎవరో కాదు.. పదేళ్ల క్రితం అదృశ్యమైన తన భర్త. మాసిపోయిన బట్టలు, చాలా రోజులుగా స్నానం చేయకుండా దుమ్ముపట్టి ఉండటం చూసి ఆమె కన్నీరు ఆగలేదు. అతన్ని పట్టుకొని బోరున విలపించింది. ఇంటి నుంచి కనిపించకుండా పోయిన పదేళ్ల తర్వాత ఇంత దారుణమైన స్థితిలో చూస్తానని అనుకోలేదని కన్నీరు పెట్టుకుంది.
భర్తను ఆ పరిస్థితిలో చూసి అతనికి సపర్యలు చేసింది. తల దువ్వడంతో పాటు శరీరాన్ని శుభ్రపరుస్తూ స్నానం చేయించింది. స్థానికులు అక్కడికి రావడంతో ఏడుస్తూ.. పదేళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన తన భర్త ఇతనే అని వారికి తెలియజేసింది. ఇన్నాళ్లు ఎక్కడికి వెళ్లిపోయావు? ఏం చేశావు? అని ప్రశ్నించినప్పటికీ అతని నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. మౌనంగా ఆమె వంక చూస్తూ అలాగే ఉండిపోయాడు. ఆమె కన్నీరు చూసిన స్థానికులు సైతం కంటతడి పెట్టారు. ఆ మహిళ తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి దుస్తులు తీసుకురావాలని కోరింది. కొద్దిసేపటి తర్వా బైక్ పై వచ్చిన యువకుడు అతనితో పాటు మహిళను తీసుకొని వెళ్లిపోయాడు. గతంలో మధ్యప్రదేశ్ గ్వాలియర్ లో ఇలాంటి ఘటననే ఒకటి చోటు చేసుకుంది. డీఎస్‌పీ స్థాయిలో ఉన్న ఓ వ్యక్తి బిచ్చం ఎత్తుకోవడం అతని బ్యాచ్ మెట్ చూసి గుర్తించాడు. ఇలాంటి సంఘటనలు తరుచూ సోషల్ మీడియాలో వెలుగు చూస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.