ఇంటిదొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడు అంటారు కదా… తమనీ అలాగే పట్టుకోలేరని ఇంట్లో పిల్లలే తల్లి బంగారాన్నీ, వెండినీ కాజేసారు. తిరిగి చోరీ కేసు పెట్టారు ఇంటి దొంగలే కన్నతల్లి చికిత్సకు డబ్బులు లేక ఆమె నగలనే ఆమెకు తెలియకుండా ఇంటి దొంగలే చోరీ చేశారు. ఇంట్లో ఎవరో దొంగలు పడి బంగారం, వెండి, నగదు ఎత్తుకెళ్లినట్లు వారు నటించారు. అందరినీ నమ్మించ డానికి పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేసి పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. నేరేడ్‌మెట్ పోలీసులు తెలిపిన […]
ఆఫీసులో, ఇంట్లో, పాఠశాలల్లో, మందిరాల్లో, వివిధ ప్రదేశాల్లో లైంగిక వేధింపుల కేసులు వెలుగుచూస్తున్నాయి. మాటలు, ప్రవర్తన, చేష్టలు, సైగల ద్వారా సైతం లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. ఇలాంటి చర్యలకు చట్టం కఠినమైన శిక్షలు విధిస్తోంది. దురుద్దేశంతో తాకడం, శారీరక వేధింపులు, లైంగిక కోరికలను వ్యక్తపరచడం, లైంగికపరమైన మాటలు, వ్యక్తుల లైంగిక ధోరణి, లైంగిక జీవితం గురించి వ్యాఖ్యలు చేయడం, పోర్న్ వీడియోలు చూపించడం , వీటి ద్వారా మహిళలకు ఇబ్బందికరమైన పని వాతావరణాన్ని సృష్టించడం.. వంటివన్నీ లైంగిక […]
నర్సాపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు, తెలుగు లో ప్రముఖ ఛానల్ చైర్మన్ మధ్య పెద్ద ఎత్తున హవాలా లావాదేవీలు జరిగాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు సంచలనం రేపారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి 15 మంది ఎంపీల బృందం ఫిర్యాదు చేసింది. ఎంపీ కె.రఘురామకృష్ణరాజు, సదరు చానల్ చైర్మన్ మధ్య ఒక మిలియన్ యూరో హవాలా లావాదేవీలపై సీబీఐతో విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత […]
కరోనా టీకా కోసం వెళ్తే ఓచోట మొదటి డోసు కొవాగ్జిన్ మరో డోసు కొవిషీల్డ్ వేశారు. మరోచోట ఒకేసారి రెండు డోసులు ఇచ్చారు. ఇంకోచోట ఏకంగా ఎంపీకే నకిలీ టీకా అందించారు. నల్గొండ జిల్లాలో కొవిడ్ టీకా కోసం వెళ్లిన ఓ మహిళకు కుక్క కాటుకు ఇచ్చే రేబిస్ టీకా ఇవ్వడం కలకలం రేగింది. ప్రభుత్వ పాఠశాలలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న పుట్ట ప్రమీల – పాఠశాల హెచ్ఎం ఇచ్చిన లేఖ తీసుకుని కరోనా టీకా వేయించుకునేందుకు […]
కరోనాలో రకరకాల కధనాలు వింటూ ఉన్నాం. ఒక్కోక్కటీ ఒక్కోతరహా… ఇందులో విషాదాలే ఎక్కువ. వాక్సిన్ విషయంలోనూ ఎన్నో వార్తలు వింటున్నాం. ఇప్పుడు మరో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతికి వైద్య సిబ్బంది ఒకే సారి డబుల్ డోస్ వ్యాక్సిన్ ఇచ్చింది. గుట్టుచప్పుడు కాకుండా యువతిని ఆసుపత్రిలో అబ్జర్వేషన్‌లో ఉంచారు. వ్యాక్సిన్ కోసం అబ్దుల్లాపూర్ మెట్ జెడ్పీహెచ్‌కు 21 ఏళ్ళ లక్ష్మీ ప్రసన్న వెళ్లారు. ఫోన్ మాట్లాడుతూ ఆమెకు నర్సు పద్మ వెంట వెంటనే రెండు డోసుల […]
ప్రభుత్వ కేంద్రాల్లో కొవిడ్ టెస్టులను తగ్గించడంతో ప్రజలు ప్రైవేటును ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా జిల్లాల్లోని ప్రైవేటు డయాగ్నస్టిక్ కేంద్రాలు దోచుకుంటున్నాయి. వైద్య ఆరోగ్యశాఖ అనుమతి లేకుండా యథేచ్ఛగా ఆర్టీపీసీఆర్, యాంటీజెన్ టెస్టులు చేసేస్తున్నాయి. రోగికి రిపోర్టు ఇవ్వకుండా ‘పాజిటివ్/ నెగెటివ్’ అని మౌఖికంగా చెప్పేస్తున్నాయి. నమూనాలు తీసుకోకుండానే కోరుకున్న మేరకు కొవిడ్ పాజిటివ్, నెగెటివ్ రిపోర్టులు జారీ చేస్తున్న ఓ డయాగ్నస్టిక్ సెంటర్ ఉదంతం పాతబస్తీ చాంద్రాయణగుట్టలో బయటపడింది. విశ్వసనీయ సమాచారం మేరకు చాంద్రాయణగుట్ట పోలీసులు శుక్రవారం […]
సినిమాల నిర్మాణంలో శతాబ్ద కాలం అనుభవం ఉన్న కంపెనీని సొంతం చేసుకుంది. ఆ కంపెనీ లైబ్రెరీలో ప్రసిద్దిగాంచిన పెద్ద చిత్రాలు వారి వద్ద ఉన్నాయి. అంతే కాదు ఆ కంపెనీలో ఇప్పటికే నాలుగు అంకెల సంఖ్యలో నమోదు చేసుకున్న సినిమా టైటిళ్లు ఉన్నాయి. మెట్రో గోల్డ్‌విన్ మేయర్ (ఎమ్‌జీఎమ్) ను 8.45 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.63,300 కోట్లు)తో అమెజాన్ కొనుగోలు చేయనుంది. ఆ మేరకు రెండు కంపెనీలు ఒక విలీన ఒప్పందం(MoU)పై సంతకాలు చేశాయి. అందులో […]
మే 2020లో కొవిడ్-19 మృతదేహాలకు సంబంధించి పోస్ట్‌మార్టం చేయడంపై ఐసీఎంఆర్ మార్గదర్శకాలను విడుదల చేసింది. కరోనా మృతదేహాలకు పోస్ట్‌మార్టం చేయకపోవడమే మంచిదని అభిప్రాయపడింది. పోస్ట్‌మార్టం చేయడం ద్వారా మార్చురీ ఉద్యోగులు, వైద్యులు, పోలీసుల జీవితాలను ప్రమాదంలోకి నెట్టినట్లు అవుతుందని పేర్కొంది. తప్పనిసరి పరిస్థితుల్లో పోస్ట్‌మార్టం చేయాల్సి వస్తే, సరైన రక్షణతో వీలైనంత తక్కువ పనితో ఆ తంతు ముగించాలని తెలిపింది. ప్రస్తుతం చాలామందిని తొలిచేస్తున్న ప్రశ్న ఇది. కరోనా భయంతో సొంత కుటుంబ సభ్యుడే చనిపోయినా అంత్యక్రియలు […]
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆరోగ్య పరిస్థితిపై నివేదికను తెలంగాణ హైకోర్టు సుప్రీంకోర్టుకు పంపినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆయన సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రికి వచ్చాక గత సోమవారం రాత్రి నుంచి మంగళవారం సాయంత్రం వరకు నిర్వహించిన పరీక్షలు, అందించిన వైద్యంపై ఆస్పత్రి మెడికల్ బోర్డు అధికారులు అందించిన నివేదిక, వీడియో రికార్డింగ్‌ను సీల్డ్ కవర్‌లో బుధవారం సమర్పించినట్లు సమాచారం. ఇంకోవైపు రఘురామరాజు ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆర్మీ ఆస్పత్రిలో ఆయనకు వైద్యం కొనసాగుతోంది. వీఐపీ స్పెషల్ రూములో ఆర్మీ […]
ఇప్పుడు ఏ సినిమాలు రిలీజులు లేవు. ఫ్యాన్స్ హడావుడి అంతకన్నా లేదు.. ఎవరూ గడపదాటి బయటకు రావడంలేదు. అలాంటప్పుడు మహేష్‌బాబు ఇంటి ముందు భారీ సెక్యూరిటీ ఎందుకు పెట్టుకున్నారు? మరి ఇలాంటి టైమ్ లో టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు ఇంటి ముందు భారీగా సెక్యూరిటీ పెంచడం హాట్ టాపిక్ గా మారింది. కరోనా సెకండ్ వేవ్ ఉప్పెనలా విరుచుకుపడుతోంది. ఎంతటివాళ్లనైనా బలి తీసుకొంటోంది. దానికి సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేదు. గొప్ప, పేద, […]