వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆరోగ్య పరిస్థితిపై నివేదికను తెలంగాణ హైకోర్టు సుప్రీంకోర్టుకు పంపినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆయన సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రికి వచ్చాక గత సోమవారం రాత్రి నుంచి మంగళవారం సాయంత్రం వరకు నిర్వహించిన పరీక్షలు, అందించిన వైద్యంపై ఆస్పత్రి మెడికల్ బోర్డు అధికారులు అందించిన నివేదిక, వీడియో రికార్డింగ్‌ను సీల్డ్ కవర్‌లో బుధవారం సమర్పించినట్లు సమాచారం. ఇంకోవైపు రఘురామరాజు ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆర్మీ ఆస్పత్రిలో ఆయనకు వైద్యం కొనసాగుతోంది. వీఐపీ స్పెషల్ రూములో ఆర్మీ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. రఘురామకు అయిన గాయాలపై నిర్వహించిన వైద్య పరీక్షల నివేదికను తెలంగాణ హైకోర్టు సీల్డు కవర్‌లో సుప్రీం కోర్టుకు పంపించింది. రక్తం, చర్మ పరీక్షలు నిర్వహించినట్లు ఆర్మీ వైద్యులు నివేదికలో పేర్కొన్నారు. సీల్డ్ కవర్‌లోని నివేదిక, వీడియోను ఈరోజు సుప్రీం కోర్టు పరిశీలించనున్నట్లు సమాచారం.
మళ్లీ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చే వరకు రఘురామ ఆర్మీ ఆస్పత్రిలో జ్యడిషియల్ కస్టడీలో ఉంటారు. కొవిడ్ నిబంధనల ప్రకారమే ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించామని ఆర్మీ వైద్యులు తెలిపారు. ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు సికింద్రబాద్‌లోని తిరుమల గిరి ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. ఆర్మీ వైద్యులు బీపీ, షుగర్, బ్లడ్ టెస్ట్‌లు పూర్తి చేశారు. ఆర్మీ ఆస్పత్రిలో ప్రత్యేక గదిలో రాఘురామ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆర్మీ పోలీసులు వాహనాలు తనిఖీలు చేసి, అనుమతి ఉన్నవారికి మాత్రమే లోపలకు పంపిస్తున్నారు. రఘురామకు ఆర్మీ ఆస్పత్రిలో హైకోర్టు నియమించిన జ్యుడీషియల్ అధికారి పర్యవేక్షణలో వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి. ఆర్మీ హాస్పిటల్‌కు చెందిన ముగ్గురు వైద్య అధికారుల బృందంతో వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. అధికారులు మొత్తం వీడియో గ్రఫీ చేసినట్లు సమాచారం.