ప్రాంతీయ పార్టీల్లో టీఆర్ ఎస్ పార్టీ దేశంలోనే నెంబర్ వన్

trs kcr telangana

న్యూ ఢిల్లీ- భారత దేశంలో ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతోంది. ప్రధానంగా విరాళల విషయంలో ప్రాంతీయ పార్టీలు ముందంజలో దుసుకుపోతున్నాయి. ఈమేరకు ప్రాంతీయ పార్టీల రాబడి, ఖర్చుల విషయంలో ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం ఏడీఆర్ అధ్యయణంలో పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా 2019-20లో 42 ప్రాంతీయ పార్టీలకు వచ్చిన రాబడిలో తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్‌ అగ్రస్థానం దక్కించుకోవడం విశేషం.

ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం 2019-20 సంవత్సరానికి విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలు భహిర్గం అయ్యాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 42 ప్రాంతీయ పార్టీలు భారత ఎన్నికల సంఘానికి సమర్పించిన ఆదాయ, వ్యయాలను ఏడీఆర్ విశ్లేషించి ఈ నివేదిక రిలీజ్ చేసింది. దేశంలోని 42 ప్రాంతీయ పార్టీలకు వచ్చిన మొత్తం ఆదాయం 877.95 కోట్లు కాగా, అందులో ఐదు పార్టీలకే 516.47 కోట్లు దక్కడం గమనార్హం. ఇందులో తెలంగాణకు చెందిన టీఆర్ఎస్‌ పార్టీకి 130.46 కోట్లు అంటే 14.86 శాతం రాబటి వచ్చింది.

tdp ycp 1

ఇక మహారాష్ట్రకు చెందిన శివసేన పార్టీకి 111.40 కోట్లతో 12.69 శాతం, ఆంధ్రప్రదేశ్ కు చెందిన వైసీపీకి 92.73 కోట్ల అంటే 10.56 శాతం, టీడీపీకి 91.53 కోట్లు అంటే 10.43 శాతం రాబడి వచ్చింది. ఒరిస్సా కు చెందిన బిజూ జనతాదళ్‌‌కు 90.35 కోట్లు అంటే 10.29 శాతం విరాళాలు వచ్చాయి. అయితే రాబడి 130.46 కోట్లలో టీఆర్ఎస్ కేవలం 21.18కోట్లు మాత్రమే ఖర్చుచేసింది. దీంతో అత్యధికంగా 109.28 కోట్ల మిగులుతో ప్రాంతీయ పార్టీల్లో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ ఎస్ పార్టీ.

ఇక వైసీపీ కి వచ్చిన 92.73 కోట్ల రాబడిలో 37.83 కోట్లు వ్యయం చేసింది. టీడీపీ పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. ఆ పార్టీకి 91.53 కోట్ల రాబడి రాగా 108.84 కోట్లు ఖర్చు చేయడం ద్వారా లోటు బడ్జెట్‌కు చేరుకుంది. డీఎంకే, బీజేడీ, సమాద్‌ వాదీ, జేడీఎస్‌ తదితర పార్టీలు కూడా ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు చేసినట్టు కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన నివేధికల్లో పేర్కొన్నాయి. మొత్తానికి రాబడిలో, ఖర్చులో టీఆర్ ఎస్ పార్ట రికార్డు సృష్టించిందనే చెప్పాలి.