టాలీవుడ్ హీరో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నటుడిగా ఉంటూ ప్రేక్షకులను అలరిస్తూ తిరుగులేని హీరోగా ఎదిగారు. సినిమాలు చేస్తూనే ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం, సమాజ సేవలో భాగమవ్వడం అలవర్చుకున్నారు. పేదల కష్టాలను పోగొట్టి వారి జీవితాల్లో ఆనందం నింపాలనే ఉద్దేశ్యంతో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు.
రానున్న జనరల్ ఎన్నికల్లో.. జాతీయ స్థాయిలో సత్తా చాటాలని భావిస్తోంది బీఆర్‌ఎస్ పార్టీ. దక్షిణాది రాష్ట్రాల్లో దూకుడుగా ముందుకు వెళ్తోంది బీఆర్‌ఎస్. అయితే తాజాగా ఎన్నికల సంఘం.. బీఆర్‌ఎస్‌కు భారీ షాక్ ఇచ్చింది. ఆ వివరాలు..
ఏపీలో రాజకీయాలు వెేడెక్కాయి. తాజాగా రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద రావు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. టీడీపీ తనకు రూ.10 కోట్లు ఇచ్చేందుకు ప్రయత్నించిందనడమే కాకుండా.. తాను దొంగ ఓట్లు వేస్తే గెలిచానంటూ వ్యాఖ్యానించారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. ఎన్నికల సంఘం.. నవంబర్ 3న మునుగోడు ఉప ఎన్నిక నిర్వహించనుంది. ప్రస్తుతం నామినేషన్ల పర్వం నడుస్తోంది. ఈ క్రమంలో వివిధ పార్టీల నుంచి బరిలో నిలబడే అభ్యర్థులు నామినేషన్ సందర్భంగా తమ ఆస్తులు, అప్పుల వివరాలు వెల్లడిస్తున్నారు. దానిలో భాగంగా బీజేపీ తరఫున బరిలో దిగుతున్న రాజగోపాల్ రెడ్డి కూడా తన ఆస్తులు, అప్పుల వివరాలు వెల్లడించాడు. బీజేపీ అభ్యర్థిగా సోమవారం నామినేషన్ దాఖలు […]
మన దేశంలో 18 ఏళ్లు నిండితేనే మేజర్‌గా గుర్తింపు లభిస్తుంది.. ఓటు హక్కు కూడా అప్పుడే వస్తుంది. తొలుత ఓటు హక్కు రావాలంటే 21 ఏళ్లుగా ఉండేది. కానీ రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు దాన్ని 18 ఏళ్లకు తగ్గిస్తూ రాజ్యాంగ సవరణ చేశారు. దాని ప్రకారం జనవరి 1 నాటికి 18 ఏళ్ల వయసులోకి అడుగు పెట్టిన వారు మాత్రమే ఓటర్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఈ క్రమంలో తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం […]
భారతదేశ రాజ్యాంగం.. రాష్ట్రపతిని దేశ ప్రథమపౌరుడిగా గుర్తించింది. త్రివిధ దళాలకు కూడా ఆయనే అధిపతి. కేంద్ర కేబినెట్ తీసుకునే నిర్ణయాలు, మన దేశం ఇతర దేశాలతో కుదుర్చుకునే ఒప్పందాలు అన్ని రాష్ట్రపతి పేరుమీదుగానే జరుగుతాయి. మన రాజ్యాంగం రాష్ట్రపతికి అంతటి అత్యున్నత స్థానం కల్పించింది. ఇక మన దేశంలో ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ప్రస్తుతం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవి కాలం జూలై 24న ముగియనుంది. ఇక నూతన రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు భారత […]
యూపీ ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్ కి ఎలక్షన్ కమీషన్ నోటీసులు జారీ చేసింది. యూపి ప్రజలు బీజేపీకి ఓటు వేయకపోతే బుల్డోజర్లను ఉపయోగిస్తానని అన్న రాజా సింగ్, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినందుకు, ఓటర్లను భయబ్రాంతులకు గురి చేయడం.. ఎన్నికలపై ప్రభావం చూపుతుందని.. ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో ఈసీ వివరణ కోరింది. 24 గంటల్లో వివరణ ఇవ్వాలని రాజాసింగ్ కి ఎన్నికల సంఘం ఆదేశించింది. కాగా, నిన్న యూపీలో ఉండాలంటే.. యోగీకి జైకోట్టాల్సిందే […]
న్యూ ఢిల్లీ- ఎన్నికల సంస్కరణల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చాలా కాలంగా డిమాండ్ ఉన్న ఓటర్ ఐడీని ఆధార్ కార్డుతో అనుసంధానానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2022లో పలు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలకు ముందు ఎన్నికల సంఘం సిఫారసుల ఆధారంగా ఎన్నికల ప్రక్రియను సంస్కరించేందుకు మోదీ సర్కార్ నడుం బిగించింది. ఈ మేరకు ఓటర్ ఐడీతో ఆధార్‌ను అనుసంధానం చేయడంతోపాటు, పలు కీలక సంస్కరణలు తీసుకొస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం […]
న్యూ ఢిల్లీ- భారత దేశంలో ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతోంది. ప్రధానంగా విరాళల విషయంలో ప్రాంతీయ పార్టీలు ముందంజలో దుసుకుపోతున్నాయి. ఈమేరకు ప్రాంతీయ పార్టీల రాబడి, ఖర్చుల విషయంలో ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం ఏడీఆర్ అధ్యయణంలో పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా 2019-20లో 42 ప్రాంతీయ పార్టీలకు వచ్చిన రాబడిలో తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ అగ్రస్థానం దక్కించుకోవడం విశేషం. ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం 2019-20 సంవత్సరానికి విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలు […]
దేశంలో ఖాళీగాఉన్నన పార్లమెంట్, శాసనసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 3 పార్లమెంట్, 30 శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లోని ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణలోని హుజూరాబాద్, ఏపీలోని బద్వేల్ శాసనసభ స్థానాలకు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. హుజూరాబాద్, బద్వేల్ శాసనసభ స్థానాలకు అక్టోబర్ 30న ఎన్నికల పోలింగ్.. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు. […]