Bihari Bride Sister Slaps Bride Groom On Stage: ఈ మధ్య కాలంలో పెళ్లి మంటపాలు.. వైరల్ న్యూస్‌కి వేదికలుగా మారుతున్నాయి. కావాలనే చేస్తున్నారో.. లేక నిజంగా జరుగుతున్నాయో తెలియదు కానీ.. ఈ మధ్య కాలంలో పెళ్లి పందిళ్లు వింత సంఘటనలకు వేదికలు అవుతున్నాయి. అంతేకాక ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు కూడా బాగానే వైరలవుతున్నాయి. తాజాగా ఈ కోవకు చెందిన వీడియో ఒకటి ప్రస్తుతం తెగ వైరలవుతోంది. తప్పతాగి పెళ్లి మంటమానికి వచ్చాడు పెళ్లి కొడుకు. ఆ మత్తులో అతగాడు చేసిన పనికి.. పెళ్లి కుమార్తె చెల్లి.. వరుడు చెంప చెళ్లుమనిపించింది. ఆ వివరాలు..
పెళ్లి కొడుకు వివాహం రోజున కూడా తప్పతాగాడు. మత్తులో తూలుతూ వచ్చిన అతగాడిని స్నేహితులు అతి కష్టం మీద స్టేజీ మీద నిల్చోపెట్టారు. పెళ్లి తంతు జరుగుతుంది. మనోడు మాత్రం మత్తులో తూలుతూనే ఉన్నాడు. ఎదురుగా ఎవరు ఉన్నారో కూడా గుర్తు పట్టలేని స్టేజ్‌లో ఉన్నాడు. ఇక వధువరులిద్దరూ దండలు మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇంతలో వధువు సోదరి.. అక్షింతల పళ్లెం తీసుకుని స్టేజీ మీదకు వస్తుంది. అయితే అప్పటికే తాగిన మైకంలో తూగుతున్న వరుడు.. పెళ్లి కుమార్తెకు బదులు.. ఆమె సోదరి అనగా మరదలి మెడలో వరమాల వేస్తాడు. దాంతో చిర్రెత్తుకొచ్చిన సదరు యువతి.. అతగాడి చెంప చెళ్లుమనిపిస్తుంది.
ఇది కూడా చదవండి: Vijayawada: తన కోరికను భర్త నెరవేర్చడం లేదు అనుకుంది.. ఇద్దరు పిల్లలు పుట్టినా కూడా!
ఈ వీడియో కొత్తదా.. పాతదా.. లేక ఏదైనా షార్ట్ ఫిల్మ్‌లో భాగమా అసలు ఎక్కడ జరిగింది.. కావాలనే తీశారా.. లేక నిజంగా జరిగిందా.. అనే విషయాలపై ఎక్కడా క్లారిటీ లేదు. కేవలం వాళ్ల సంభాషణల ఆధారంగా అది బిహార్‌లో జరిగింది అని స్పష్టం అవుతోంది. వధువు చెల్లి పెళ్లి కొడుకును వీర బాదుడు బాదుతుంటే.. అక్కడ ఉన్నవారు ఎవరు అడ్డుకునే ప్రయత్నం చేసినట్లు కనిపించడం లేదు. పైగా తాగుబోతులా తూలే విధానం చూస్తూంటే.. ఇది అంతా డ్రామానేమో అనిపిస్తుంది. ఇక నెటిజనులు కూడా నీ తాగుబోతు నటన కూడా అంత బాగాలేదని కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా.. ప్రస్తుతం ఈ వీడియో ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ రీల్స్‌లో మాత్రం తెగ వైరల్ అవుతూ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది.మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
बिहार में शराबबंदी बा … 🤔😅🤣😂🥃 pic.twitter.com/MiWYfF2N2T
— Vikki1975 (@Vikki19751) June 21, 2022
ఇది కూడా చదవండి: Video:మనుషుల్ని చంపి.. మామిడి చెట్టు ఎక్కి నిద్రిస్తున్న చిరుత..! వీడియో వైరల్