అడవిలో పెరిగే చెట్లలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. సుగంధ ద్రవ్యాలు, వన మూలికలు మనకు లభ్యమవుతాయి. అయితే కొన్నిచెట్లు నీడనిస్తాయి.. కొన్ని చెట్లు పూలను, పండ్లనిస్తాయి. కొబ్బరి చెట్లు కొబ్బరి బొండాలను ఇస్తాయి.
ప్రకృతిలో చాలా అద్భుతాలు జరుగుతుంటాయి. అందులో కొన్ని మనకు తెలియకుండా విచిత్రంగా జరుగుతుంటాయి. అడవిలో పెరిగే చెట్లలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. సుగంధ ద్రవ్యాలు, వన మూలికలు మనకు లభ్యమవుతాయి. అయితే కొన్నిచెట్లు నీడనిస్తాయి.. కొన్ని చెట్లు పూలను, పండ్లనిస్తాయి. కొబ్బరి చెట్లు కొబ్బరి బొండాలను ఇస్తాయి. అంటే కొబ్బరి నీళ్లను ఇస్తాయి. వాటిని సేవించడం వల్ల ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. తాటి చెట్ల నుండి ద్రవాన్ని సేకరిస్తాం. దీనిని కల్లు అంటాం. దీనిని సేవిస్తారు. అయితే ఓ చెట్టును నరుకుతుండగా ఏకంగా కాండం నుండి నీటిని చిమ్ముతుంది. ఈ దృశ్యాన్ని చూడడానికి ప్రజలు క్యూ కట్టారు. అది ఎక్కడో.. ఎందుకు వస్తున్నాయో తెలుసుకుందాం..
ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం పోతురాజులూరు అనే గ్రామంలో వింత ఘటన చోటు చేసుకుంది. కొందరు చెట్టును నరికేందుకు ప్రయత్నించారు. చెట్టును సగం నరికిన తర్వాత చెట్టు మధ్యలోంచి నీరు బయటికి ఎగచిమ్ముతున్నాయి. ఈ సీన్ చూడడానికి గ్రామస్తులంతా వస్తున్నారు. చెట్టునుండి వచ్చిన ఆ నీటిని తాగుతున్నారు. చెట్టునుండి గంటల తరబడి వస్తున్న ఈ నీళ్లు చాలా స్వచ్ఛంగా ఉన్నాయి. ఈ దృశ్యాన్ని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం అది వైరల్ అవుతోంది.