శివజ్యోతికి కష్టాలా? మంచి ఫేమస్ సెలబ్రిటీ కదా. ఆమెకు కష్టాలు ఏంటి? మొన్ననే బీఎండబ్ల్యూ కారు కూడా కొన్నది. అలాంటి ఆమెకు ఇల్లు అమ్ముకోవాల్సిన అవసరం ఏముంది?
ఇంటితో ఎంతోమందికి ఎమోషనల్ అటాచ్ మెంట్ ఉంటుంది. అందులోనూ మొదట కట్టుకున్న ఇల్లు అంటే సెంటిమెంట్ ఉంటుంది. కొంతమందికి కొత్తగా కట్టుకున్న ఇల్లు బాగా కలిసి వస్తుంది. అదృష్టం వరిస్తుందని నమ్ముతారు. ఇల్లు కట్టిన తర్వాత చాలా రకాలుగా కలిసి వచ్చిందని చెబుతారు. ఇది కేవలం సామాన్యులకు మాత్రమే కాదు.. సెలబ్రిటీలకు కూడా వర్తిస్తుంది. సెలబ్రిటీలు సైతం ఇంటిని ఒక సెంటిమెంట్ గా భావిస్తారు. అయితే అమ్మవలసి వచ్చినప్పుడు చాలా బాధపడిపోతుంటారు. ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లు.. ఎంతో శ్రమించి పైసా పైసా కూడబెట్టి కొనుక్కున్న ఇల్లు అమ్ముకోవాలా అని బాధపడుతుంటారు. తాజాగా శివజ్యోతి కూడా ఇల్లు అమ్మేస్తున్న విషయాన్ని చెబుతూ ఎమోషనల్ అయ్యింది.
శివజ్యోతికేం బానే ఉంది కదా. సెలబ్రిటీ అయిపోయింది. యూట్యూబ్ ఛానల్స్ మెయింటెయిన్ చేస్తుంది. కమర్షియల్ యాడ్స్ చేస్తుంది. ఆ మధ్య ఖరీదైన బీఎండబ్ల్యూ కారు కూడా కొన్నది. ఇంత హ్యాపీగా ఉన్న శివజ్యోతికి ఇల్లు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందనేగా మీ డౌటు. పైకి నవ్వుతూ కనబడిన ఆమెకి కూడా కష్టాలు ఉన్నాయి. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా వెల్లడించింది. తాజాగా శివజ్యోతి హోమ్ టూర్ వీడియోని అప్లోడ్ చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యింది. ఈ ఇంటి వల్ల తనకు ఎంతో లాభం చేకూరిందని.. ఆ ఇంట్లో అడుగుపెట్టిన తర్వాతే తనకు కలిసి వచ్చిందని చెప్పుకొచ్చింది. చాలా మంది ఇండస్ట్రీలో తనకు ఫ్రెండ్స్ అయ్యారని.. అవకాశాలు కూడా బాగా వచ్చాయని చెప్పుకొచ్చింది.
ఇల్లు కొనే సమయంలో ఓ ప్రముఖ ఛానల్ లో 50 ఈవెంట్లు, అప్పటికే యాంకర్ గా జీతం.. ఇవన్నీ ఉన్నాయన్న ధైర్యంతో ఇల్లు కొన్నానని ఆమె చెప్పుకొచ్చింది. తమ దగ్గరున్న డబ్బుతో పాటు.. బ్యాంకు లోన్, వేరొకరి దగ్గర రెండు లక్షలు అప్పు చేసి మరీ ఇల్లు కొన్నామని చెప్పుకొచ్చింది. అయితే ఇంట్లోకి వెళ్లిన ఒక నెలకే లాక్ డౌన్ వచ్చిందని.. ఈఎంఐ ఎలా కట్టాలి? ఎలా బతకాలా? అని అనుకున్నానని.. ఒకానొక సందర్భంలో డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని వెల్లడించింది. ఎన్ని సమస్యలు ఉన్నా తనకు ఈ ఇల్లు ఎంతో ఇష్టమని.. బాగా కలిసి వచ్చిందని చెప్పుకొచ్చింది.
ఒక న్యూస్ ఛానల్ పెట్టి 3 నెలలు రన్ చేసి నష్టపోయానని.. ఇప్పుడు అమ్మేద్దామనుకుంటున్నా అని వెల్లడించింది. కొత్త ఇంట్లోకి వెళ్లిన తర్వాత ఇంకో ఇల్లు అవసరమా అని అనిపించిందని.. ఆ ఇల్లు ఈఎంఐ, ఈ ఇల్లు ఈఎంఐ.. రెండు ఈఎంఐలు కట్టడం భారంగా ఉందని.. అందుకే ఇల్లు అమ్మేస్తున్నా అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. తనకు బాగా కలిసొచ్చిన ఇంటిని అమ్మడం బాధగా ఉందంటూ ఏడ్చేసింది. మరి శివజ్యోతి ఇల్లు అమ్ముకుంటుండడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.