శివజ్యోతి దంపతుల మీద కొంతమంది చిల్లర కామెంట్స్ చేస్తున్నారు. అక్కా అంటూ ఆమెపై చీప్ కామెంట్స్ చేస్తున్నారు.
తెలంగాణ యాసతో.. గలగలమని మాట్లాడుతూ అందరినీ అలరించే యాంకర్ శివజ్యోతి సావిత్రక్కగా బాగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బిగ్ బాస్ షో ద్వారా మరింత పాపులర్ అయ్యింది. ఆ తర్వాత వరుస అవకాశాలతో బుల్లితెర షోస్ లో సందడి చేస్తూ వచ్చింది. ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్ ను నిర్వహిస్తుంది. యూట్యూబ్ లో వ్లాగ్స్ చేస్తూ సందడి చేస్తుంటుంది. హోమ్ టూర్ విదెఒళుమ్ పండుగలు వచ్చినప్పుడు పూజలకు సంబంధించిన వీడియోలు, ట్రిప్ లు వెళ్ళినప్పుడు ఇలా రకరకాల వీడియోలతో వినోదాన్ని పంచుతుంటారు. ఈ క్రమంలోనే ఆమె బోనాల పండుగ సందర్భంగా యూట్యూబ్ లో ఒక వీడియో చేసి అప్లోడ్ చేశారు. చాలా వరకూ అందరూ పాజిటివ్ కామెంట్స్ చేయగా.. కొంతమంది మాత్రం నెగిటివ్ కామెంట్స్ చేశారు.
మామూలుగా ఫ్యాన్స్ ఆమెను అక్కా అని సంబోధిస్తుంటారు. కొంతమంది ఆమె బాగుండాలని కోరుకుంటారు. కొంతమంది ఆమెను విమర్శిస్తారు. ఆమె వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూస్తారు. కొంతమంది అయితే అవసరం లేకపోయినా మీ ఆయన ఏం చేస్తాడేంటి అని అడిగేస్తారు. దానికి మరొకరు సెటైరికల్ కామెంట్ చేస్తారు. ఇలా ఆమె పర్సనల్ లైఫ్ గురించి హేళన చేస్తూ మాట్లాడేవారు ఉంటారు. ప్రతీ పండుగకి శివజ్యోతి తన వీడియోలో బంగారం కొంటున్నట్టు చెప్పుకొస్తుంది. అయితే ఒక నెటిజన్.. ‘ఎన్నిసార్లు బంగారం కొంటావ్.. పాప, బాబు ఏదో ఒక గుడ్ న్యూస్ చెప్పు’ అంటూ కామెంట్ చేశారు. మరొకరు ఐతే.. ‘ఇంక పిల్లల్ని ఎప్పుడు కంటారు’ అంటూ కామెంట్ చేశారు.
మరొకరు.. ‘మళ్ళీ బోనాలకు మహాలక్ష్మి పుడతాది’ అంటూ కామెంట్ చేయగా.. దానికి సమాధానంగా ఒక నెటిజన్ వీళ్లకు ఇప్పుడే పిల్లలు అవసరం లేదంటూ కామెంట్ చేశారు. ‘శివజ్యోతి ఎప్పుడు పిల్లలు కనాలో కూడా మీరే డిసైడ్ చేస్తారా? ఎవరికైనా వారి పిల్లల విషయంలో ఒక క్లారిటీ ఉంటుంది. కొన్ని లక్ష్యాలు నెరవేరాక పిల్లలకు స్వాగతం పలుకుతారు. తెలివితక్కువ వారిలా లక్ష్యం లేకున్నా.. ఆర్థిక వైకల్యం ఉన్నా సరే బాధ్యత లేకుండా పెళ్లిళ్లు చేసుకుని పిల్లల్ని కనేసి భవిష్యత్తు ఇవ్వలేకపోయామని బాధపడేకంటే పిల్లల్ని కనకపోవడమే మంచిది. సెలబ్రిటీలు.. సామాన్యుల కంటే ఎక్కువ ఆలోచిస్తారు కానట్టి ఎప్పుడు పిల్లల్ని కనాలో వారికి క్లారిటీ ఉంటుంది’ అంటూ శివజ్యోతికి సపోర్ట్ గా కామెంట్స్ చేస్తున్నారు.
పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వగలిగితేనే జన్మనివ్వాలి. లేదంటే ఈ బతుకెందుకు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. శివజ్యోతి దంపతులకు కూడా కొన్ని లక్ష్యాలు ఉండి ఉండచ్చు. పిల్లల విషయంలో, భవిష్యత్తుకు బంగారు బాట వేయడం కోసం సమయం తీసుకుని ఉండచ్చు. అంతమాత్రాన పిల్లలు లేకపోతే నేరమా? అంటూ ప్రశ్నిస్తున్నారు. మరొకరు అయితే.. ‘ఎంత ఫేమ్ వచ్చినా పిల్లలు లేకపోతే వేస్ట్ అక్క’ అంటూ కామెంట్ చేశారు. పిల్లలు లేకపోతే వేస్ట్ ఆ? అక్కా అంటున్నారు.. మీ ఇంట్లో అక్కని ఇలానే అడుగుతారా? తప్పు కదా.. అడిగే పద్ధతి ఇది కాదు. చాలా సాఫ్ట్ గా అడగాలి. అంతేగానీ మనసు బాధపడేలా మాట్లాడకూడదు అని ఆమెకు మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు.
ఆమె నుంచి జెన్యూన్ ఫ్యాన్స్ పాపనో, బాబునో కోరుకుంటున్నారు. కానీ మిగతా వాళ్ళు కోరుకునేది ఇదే అయినా.. కటువుగా మాట్లాడుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. శివజ్యోతి ఆల్రెడీ గతంలో తన ప్రెగ్నెన్సీ గురించి చెప్పింది. ‘మాకు పెళ్ళై చాలా ఏళ్ళు అయ్యింది. మా పిల్లల కోసం కుటుంబమంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. నేను కూడా ఎదురుచూస్తున్నాను. ప్రెగ్నెన్సీ అనేది నా జీవితంలో చాలా పెద్ద విషయం. పర్సనల్ గా, ప్రొఫెషనల్ గా తప్పుడు ప్రచారం చేయకండి. అది నాపై చాలా ప్రభావం చూపిస్తుంది’ అంటూ చెప్పింది. కానీ అది అర్థం చేసుకోకుండా కొంతమంది నెటిజన్స్ ఆమెపై విమర్శలు చేస్తున్నారు. ఎవరి ఇష్టాలు వారివి. ఎవరి జీవితం వారిది. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతుకుతారు. మరి సెలబ్రిటీల లైఫ్ ఎలా ఉండాలో డిసైడ్ చేసే వారిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.