మారుమూల ప్రాంతాల నుండి మహా నగరాలకు వచ్చి తమ టాలెంట్‌తో అలరిస్తున్నారు యాంకరమ్మలు. అటువంటి వారిలో ఒకరు శివ జ్యోతి. ఈ పేరు ఎవ్వరికీ తెలియదు కానీ తీన్మార్ సావిత్రి అంటే ఇట్టే గుర్తు పట్టేస్తారు. చ్చమైన తెలంగాణ భాషలో మాట్లాడుతూ మంచి పేరు తెచ్చుకుంది జ్యోతి.
మారుమూల ప్రాంతాల నుండి మహా నగరాలకు వచ్చి తమ టాలెంట్‌తో అలరిస్తున్నారు యాంకరమ్మలు. అటువంటి వారిలో ఒకరు శివ జ్యోతి. ఈ పేరు ఎవ్వరికీ తెలియదు కానీ తీన్మార్ సావిత్రి అంటే ఇట్టే గుర్తు పట్టేస్తారు. తీన్మార్ సావిత్రిలో అచ్చమైన తెలంగాణ భాషలో మాట్లాడుతూ మంచి పేరు తెచ్చుకుంది జ్యోతి. ఇది కాస్త ఫేమస్ అవ్వడంతో ఆమెకు బిగ్ బాస్‌లో అవకాశం వచ్చింది. సీజన్ 3లో పాల్గొన్న ఆమె ఇంటి సభ్యులందరికీ అక్కగా మారిపోయింది. 14 వారాల పాటు హౌస్‌లో ఉండి వైదొలిగింది. ఆ తర్వాత బయటకు వచ్చాక టీవీ 9లో ఇస్మార్ట్ న్యూస్ యాంకర్‌గా మారింది. బిత్తిరి సత్తితో పాటు ఫన్ పండించింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధించిన వీడియోలను పోస్టు చేస్తుంది.
సొంత యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకుని వీడియోలు చేస్తూ.. అభిమానుల్ని అలరిస్తుంది. గతంతో పోల్చితే.. కాస్త ట్రెండీగా మారినప్పటికీ.. అందంగా కనిపిస్తుంది. భర్త గంగూలీ, స్నేహితులతో కలిసి టూర్లు, ట్రిప్పులు వేస్తూ ఆ ఫోటోలను ఇన్ స్టాలో పంచుకుంటూ ఉంటుంది. ఆమె ప్రతి వీడియోలో భర్త కనిపిస్తూ ఉంటారు. అయితే ఇటీవల ఆమె బోనాల సందర్భంగా ఓ వీడియోను యూట్యూబ్‌లో పోస్టు చేసింది. మా ఆయన బంగారం కొనిచ్చాడు అంటూ ఓ వీడియో చేయడంతో జ్యోతి భర్త గంగూలీపై దారుణమైన కామెంట్సు చేస్తున్నారు నెటిజన్లు. అక్క మీ ఆయన ఏం జాబ్ చేస్తారు అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. దానికి మరో నెటిజన్.. ఏం చేయాలో ఆలోచిస్తాడు ఉంటాడు. తొందరపడి ఏదో ఒకటి చేసేయడం అతనికి ఇష్టం ఉండదంటూ.. జ్యోతి గురించి, ఆమె భర్తపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి జ్యోతి, గంగూలీది ప్రేమ వివాహం. పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఈ విషయంలో ఆమె అనేక సందర్భాల్లో చెప్పి ఏడ్చింది కూడా.
తన భర్తే తనకు అన్నీ అని, తనను బాగా అర్థం చేసుకుంటాడని చెప్పింది. పలు సందర్భాల్లో వీళిద్దరూ కలిసి షోల్లో కూడా పాల్గొన్నారు. అప్పుడు కూడా భర్త గొప్పతనం గురించి చెప్పి ఎమోషనల్ అయ్యింది. భర్తపై తనకున్న ప్రేమను ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంటుంది. అయితే ఆమె ఈ కెరీర్ ఎంచుకున్నప్పుడు భర్త గంగూలీ ఆమెను బాగా ప్రోత్సహించాడు. భార్యను బయటకు పంపిస్తే చెడిపోతారని మగవాళ్లు ఆలోచిస్తున్న ఈ రోజుల్లో ఆమెకు స్వేచ్ఛనిచ్చి.. వెనకుండి నడిపించాడు. ఆ సమయంలో గంగూలీ కూడా ఉద్యోగం చేసేవారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా మారడంతో భార్య జ్యోతికి వెన్నుదన్నుగా నిలిచేందుకు ఉద్యోగానికి స్వస్థి చెప్పి.. వీడియో ఎడిటింగ్, ఇతర పనులతో బిజీగా గడుపుతున్నాడు. ఇది తెలియని కొంత మంది వీరిపై ట్రోలింగ్స్ చేస్తూ శునకానందాన్ని పొందుతున్నారు. వాస్తవం తెలియకుండా ఏవేవో కామెంట్లు పెట్టి వారిని బాధపెట్టడం సరైన చర్యకాదని నెటిజన్లు తెలుసుకుంటే మంచిదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.