ఏ రంగంలోనైనా ఒక లక్ష్యాన్ని సెట్ చేసుకున్నప్పుడు దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. అలాగే ఇండస్ట్రీలో సెలబ్రిటీ హోదా అనేది ఎవరికీ అంత ఈజీగా రాదు. ఎంతో కష్టపడి.. తాము ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. టాలీవుడ్ లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా జీరో నుండి కెరీర్ స్టార్ట్ చేసి.. సెలబ్రిటీ హోదా పొందిన వారిలో యాంకర్ శివజ్యోతి ఒకరు.
ఏ రంగంలోనైనా ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే ఖచ్చితంగా కష్టపడక తప్పదు. ఒక లక్ష్యాన్ని సెట్ చేసుకున్నప్పుడు దాని కోసం ఎన్నో ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. అలాగే ఇండస్ట్రీలో సెలబ్రిటీ హోదా అనేది ఎవరికీ అంత ఈజీగా రాదు. ఎంతో కష్టపడి.. తాము ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. టాలీవుడ్ లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా జీరో నుండి కెరీర్ స్టార్ట్ చేసి.. సెలబ్రిటీ హోదా పొందిన వారిలో యాంకర్ శివజ్యోతి ఒకరు. ఈమె తీన్మార్ సావిత్రిగా జనాలకు బాగా తెలుసు. తీన్మార్ ప్రోగ్రాంలో.. అచ్చమైన తెలంగాణ భాషను, యాసను రిప్రెజెంట్ చేస్తూ.. పాపులర్ అయిన సావిత్రి.. తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.
తెలంగాణ భాషను, యాసను టీవీ స్క్రీన్ పై పూర్తి స్థాయిలో రిప్రెజెంట్ చేసిన క్రెడిట్ సావిత్రికే దక్కుతుందని చెప్పవచ్చు. తీన్మార్ తర్వాత ప్రముఖ న్యూస్ ఛానల్ లో న్యూస్ ప్రెజెంటర్ గా.. అక్కడి నుండి బిగ్ బాస్ రియాలిటీ షోలో కంటెస్టెంట్ గా చేరి.. అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గరైంది. ఓవైపు న్యూస్ ప్రెజెంటర్ గా రాణిస్తూనే.. మరోవైపు సొంతంగా యూట్యూబ్ ఛానల్స్ పెట్టి.. ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేస్తోంది. అయితే.. సెలబ్రిటీ హోదా రాకముందు.. కెరీర్ ఆరంభంలో యాంకర్ శివజ్యోతి ఏం చేసేది? అనంటే.. ‘ఆర్వీఎస్’ అనే శాటిలైట్ ఛానల్ లో ‘మాయదారి మైసమ్మ’ అనే ప్రోగ్రామ్ లో యాంకరింగ్ చేసేది. ఈ ప్రోగ్రామ్ కి అనిల్ కుమార్ పసనిబిల్లి డైరెక్టర్ గా వ్యవహరించారు. ప్రస్తుతం శివజ్యోతికి సంబంధించి ఆ ఓల్డ్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
దాదాపు పదేళ్ల క్రితం ‘మాయదారి మైసమ్మ’ అనే ప్రోగ్రాంలో యాంకర్ గా చేసిన శివజ్యోతి.. తన కెరీర్ ఆరంభం నుండే తెలంగాణ భాష, యాసలను పాపులర్ చేయడానికి తన వంతు కృషి చేసింది. ఇప్పటిదాకా తెలంగాణ యాసను ఈ స్థాయిలో పాపులర్ చేసిన తెలుగు యాంకర్స్ లేరనే చెప్పాలి. సొంతంగా తనంతట తాను ఎంతో కష్టపడి.. సెలబ్రిటీగా ఎదిగిన శివజ్యోతి.. సోషల్ మీడియాలో మిలియన్స్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం శివజ్యోతి కెరీర్ ఆరంభంలో చేసిన ఈ మాయదారి మైసమ్మ ప్రోగ్రాం వీడియో చూస్తే.. ఆమె ఇప్పుడున్న స్థాయికి చేరుకోవడానికి ఎంతలా కష్టపడిందో అర్థం చేసుకోవచ్చు.
అయితే ప్రస్తుతం ఇంతటి స్టార్ స్టేటస్ అనుభవిస్తున్న శివజ్యోతికి.. కెరీర్ తొలినాళ్లలో ఆమె చేసిన ‘మాయదారి మైసమ్మ’ ప్రోగ్రాం తన ఎదుగుదలలో కీలక పాత్ర పోషించింది. ఈ ప్రోగ్రాం ద్వారా తెలంగాణ భాషను, యాసను రిప్రజెంట్ చేస్తూ వచ్చిన శివజ్యోతికి.. ఆ తర్వాత కాలంలో అదే తెలంగాణ యాస మీద కార్యక్రమాలు, షోలు చేసే విధంగా అవకాశాలు వచ్చాయి. ఏది ఏమైనా గానీ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ స్థాయికి రావడం అనేది గొప్ప విషయం. మరి యాంకర్ శివజ్యోతి అలియాస్ తీన్మార్ సావిత్రి సెలబ్రిటీగా.. తెలంగాణ భాష, యాసలను ముందుకు తీసుకెళ్తున్న తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.