తన అందంతో, నటనతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసుకుంది రష్మిక మందన్న. వరుస సినిమాలతో దూసుకుపోతోంది. రష్మిక అందానికి కుర్రకారు ఫిదా కావాల్సిందే. కాగా ఆమె తన ప్రేమ విషయంపై క్లారిటీ ఇచ్చింది.
రష్మిక మందన్న.. “పుష్ప” సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్. ఈమెని తెలుగు ప్రేక్షకులు ముద్దుగా క్రష్మిక అంటారు. అయితే.. గత కొంత కాలంగా ఆమె చేసిన సినిమాలు అనుకున్న స్థాయిలో ఆడకపోయినా.. తన ఇమెజ్ ఏ మాత్రం చెక్కు చెదరలేదు. సోషల్ మీడియాలో ఈమె ఫోటోస్, వీడియేస్ నెట్టింట ఎప్పటికప్పుడు వైరల్ అవుతూ ఉంటాయి. ఈ మధ్య విజయ్ దేవరకొండతో ఎక్కువ కనిపించడంతో వీరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని పలువురు నెటిజన్లు అనుకుంటున్నారు. వీరిద్దరూ చేసినవి రెండు సినిమాలే అయినా వీరి కాంబినేషన్‌కి మంచి గుర్తింపు దక్కింది. ఇక ఈ మధ్య కాలంలో తన ప్రేమ, పెళ్లి గురించి ఎవరు ఎన్ని కామెంట్స్ చేసిన స్పందించని రష్మిక, తాజాగా ఓ సంచలన విషయాన్ని వెల్లడించింది.
రీసెంట్‌గా ఓ కార్యక్రమంలో పాల్గొన్న రష్మిక తన పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ కార్యక్రమంలో యాంకర్.. రష్మికను మీరు ఎవరితో ప్రేమలో ఉన్నారు? ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు అని ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు రష్మిక దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది. “ఇప్పటికే నాకు పెళ్లి అయ్యింది. ప్రస్తుతం నా మనసులో అతనే ఉన్నాడు అని చెప్పింది. అతనెవరో కాదు ‘నరుటో’ అని ఫన్నీగా సమాధానం చెప్పింది”. ఇంతకీ ఈ నరుటో ఎవరు? అని ఫ్యాన్స్ గందరగొళంలో పడిపోయారు. అయితే పూర్తిగా వివరిస్తూ.. “ఇది జపాన్ ఫేమస్ సిరీస్ ఇందులో ప్రధాన పాత్ర పేరు ‘నరుటో’. ఈ క్యారెక్టర్‌కి నేను పెద్ద ఫ్యాన్ నాలాగే ఎంతో మంది వీరాభిమానులు ఉన్నారు. అందులో నేను ఒకరు” అని నవ్వుతూ చెప్పుకొచ్చింది.
ఇక రష్మిక సినిమాల విషయాలకు వస్తే అల్లు అర్జున్‌తో పుష్ప-2 లో నటిస్తుంది. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కిస్తున్నారు దర్శకుడు సుకుమార్. మొదటి భాగం బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో రెండో పార్ట్ పైన మరింత క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమాను మరింత భారీగా రూపొందించే ప్రయత్నంలో ఉన్నారు డైరెక్టర్ సుకుమార్. రష్మిక మరో చిత్రం ‘యానిమల్’. సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే నితిన్‌తో ఒక మూవీ చేస్తుంది. ప్రస్తుతం ఫ్లాప్‌లతో నెట్టుకొస్తున్న ఈ కన్నడ భామ రాబోయే సినిమాలతో అయినా సక్సెస్ ట్రాక్ ఎక్కుతుందా? లేదా అనేది చూడాలి.