హాస్యనటుడు బ్రహ్మానందం ఇంట పెళ్ళి సందడి ఘనంగా జరిగింది. ఇంతకి ఎవరు అనుకుంటున్నారా? ఎవరో కాదు బ్రహ్మానంద చిన్న కొడుకు. తాజాగా పెద్దల సమక్షంలో అంగరంగవైభవంగా జరిగింది. ఆయన పెద్ద కొడుకు గౌతమ్ నటుడిగా అందరికీ తెలసిందే.
హాస్యనటుడు బ్రహ్మానందం ఇంట పెళ్ళి సందడి ఘనంగా జరిగింది. ఇంతకి ఎవరు అనుకుంటున్నారా? ఎవరో కాదు బ్రహ్మానంద చిన్న కొడుకు. తాజాగా పెద్దల సమక్షంలో అంగరంగవైభవంగా జరిగింది. ఆయన పెద్ద కొడుకు గౌతమ్ నటుడిగా అందరికీ తెలసిందే. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు చిన్న కొడుకు కూడా తెరపైకొచ్చాడు. బ్రహ్మానందం చిన్న కొడుకు పేరు సిద్ధార్థ్. పెళ్లి కుదిరింది. ఐశ్వర్యతో సిద్దార్థ్ ఎంగేజ్ మెంట్ పూర్తయింది. ఐశ్వర్యగా వృత్తిరీత్యా డాక్టర్ . ఇక సిద్దార్థ్ విషయానికి వస్తే, అతడు విదేశాల్లోనే చదువుకొని, అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. అయితే ప్రస్తుతం వీరి నిశ్చితార్థం ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సీఎం కేసీఆర్, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథులుగా కనిపించారు. సినీ పరిశ్రమ నుంచి మెగా, నందమూరి, మంచు ఫ్యామిలీలు కనువిందు చేశాయి. ఇక ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, సీఎం కేసీఆర్, సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్ సహా పలువురు రాజకీయ ప్రముఖులతో పాటుగా… తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి నందమూరి, మెగా, మంచు ఫ్యామిలీ నుంచి తారలు వచ్చారు.
మంచు ఫ్యామిలీ నుంచి మోహన్ బాబు, విష్ణు, మనోజ్‌లు సతీసమేతంగా కనిపించారు. నందమూరి బాలయ్య బాబు సందడి చేశాడు. మెగా ఫ్యామిలీ నుంచి రామ్ చరణ్ సతీసమేతంగా వచ్చాడు. ఇక పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్‌లు కలిసి పెళ్లికి వచ్చినట్టున్నారు. చిరంజీవి తన మోకాలి సర్జరీ వల్ల పెళ్లికి రాలేకపోయినట్టున్నాడు. చిరు రాలేకపోయినా సురేఖ, సుష్మిత వచ్చారు.మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్, కోట శ్రీనివాస రావు, రాజశేఖర్ జీవిత దంపతులు, శ్రీకాంత్ ఫ్యామిలీ, సాయి కుమార్ ఫ్యామిలీ, దర్శకులు కోదండరామిరెడ్డి, శేఖర్ కమ్ముల, రావు రమేష్, ఆలీ ఫ్యామిలీ ఇలా టాలీవుడ్ అంతా కలిసి వచ్చి నూతన దంపతులను ఆశీర్వదించారు. ఇక బ్రహ్మానందం సినిమాలకు వస్తే.. బ్రో సినిమాలో మెరిసిన బ్రహ్మానందం, ఆ తరువాత ఏ సినిమాలోను కనపడలేదు. వయసు మీద పడుతుండడంతో చిన్న పాత్రలు చేస్తూ.. వస్తున్నాడు.