ఈ మద్య అడవుల్లో ఉండాల్సిన క్రూర మృగాలు పల్లెలు, పట్టణాల్లోకి చొరబడుతున్నాయి. ఎక్కువగా చిరుత పులులు, ఎలుగు బంట్లు ప్రజలపై దాడులు చేసి గాయపరుస్తున్నాయి.. చంపుతున్నాయి. అంతేకాదు జనావాసాల్లో ఉండే సాధుజంతువులపైన దాడి చేసి ఎత్తుకెళ్తున్నాయి. ఇలాంటి సంఘటనలు సీసీ టీవీ ఫుటేజ్ లో రికార్డు అయి వెలుగులోకి వచ్చాయి. చిరుత పులుల సంచారంతో పట్టణ, గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఓ చిరుత నివాస ప్రాంతాల్లో సంచరిస్తూ.. మామిడి చెట్టుపై నిద్రిస్తుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటన పశ్చిమబెంగాల్‌లోని అలీపుర్‌ద్వార్ జిల్లా షిల్బరీహట్ ఘాట్‌పడ్ ప్రాంతంలో జరిగింది. వివరాల్లోకి వెళితే..
పశ్చిమబెంగాల్‌లోని అలీపుర్‌ద్వార్ జిల్లా షిల్బరీహట్ ఘాట్‌పడ్ పరిసర ప్రాంతంలో గత కొంత కాలంగా చిరుత హల్ చల్ చేస్తుంది. కొద్దిరోజులుగా చిరుత ప్రజల్ని వేటాడుతోందని.. ఇప్పటికే పలువురిని తీవ్రంగా గాయ పర్చడమే కాదు.. చంపి తింటుందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం.. రబియుల్ మియాన్ అనే వ్యక్తి ఇంటిపక్కన మామిడి చెట్టుపై చిరుత నిద్రిస్తుండడాన్ని చూసిన స్థానికులు వెంటనే.. అధికారులకు సమాచారం అందించారు. అటవీ, అగ్నిమాపక, పోలీసు సిబ్బంది రంగంలోకి దిగారు. దానికి మత్తు కలిగించేందుకు రెండు ట్రాంక్వలైజర్ షాట్స్ ఇచ్చి అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక చికిత్స అనంతరం.. చిరుతను మళ్లీ అడవిలో వదిలిపెడతామని ఈ సందర్భంగా అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.