సాధారణంగా మనకు ఒకరోజు అంటే పగలు రాత్రి ఏర్పడతాయి. అంటే 24 గంటల సమయంలో పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు అనుకుంటాం. కానీ కాలాల మార్పును బట్టి రాత్రి, పగలులో గంటల తేడా ఏర్పడుతుంది. వేసవికాలంలో పగలు ఎక్కువగా ఉంటుంది.
అనంతమైన రహస్యాలెన్నో ఖగోళంలో చోటు చేసుకున్నాయి. భూమి పుట్టుక నుండి సమస్త ప్రపంచానికి సంబంధించిన ఎన్నో విషయాలను అంతరిక్షంలో చోటుచేసుకుంటాయి. గ్రహాలు, వాటి పరిభ్రమణం మొదలైన విషయాలలో వింతలు చోటుచేసుకుంటాయి. వాటిని చూసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతుంటారు.
ఖగోళంలో అప్పుడప్పుడు అద్భుతాలు కూడా జరుగుతాయి. రాజస్తాన్ లోని ఘర్సానాలో సూర్యగ్రహణం సమయంలో ఒక నిమిషం పాటు రింగ్ ఆఫ్ ఫైర్ కనిపించి అందరిని అబ్బురపరిచింది. అలాగే తాజాగా ఈరోజు కూడా ఓ అద్భుతం జరుగబోతోంది. ఆ అద్భుతానికి ఏపీలోని కృష్ణాజిల్లాకు సంబంధం ఉంది. ఏంటా అద్భుతం? కృష్ణాజిల్లాలోనే కాకుండా మరెక్కడైనా జరుగుతుందా? దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..
సాధారణంగా మనకు ఒకరోజు అంటే పగలు రాత్రి ఏర్పడతాయి. అంటే 24 గంటల సమయంలో పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు అనుకుంటాం. కానీ కాలాల మార్పును బట్టి రాత్రి, పగలులో గంటల తేడా ఏర్పడుతుంది. వేసవికాలంలో పగలు ఎక్కువగా ఉంటుంది. ఉదయం 5.30 గంటలకే తెల్లవారుతుంది. మరలా సాయంత్రం 7 గంటల వరకు పగలు ఉంటుంది. చలికాలంలో పగలు తక్కువ గంటల సమయం ఉంటుంది. రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది. ఇలా కాలాల మార్పువల్ల రాత్రి పగలు గంటలల్లో తేడా ఏర్పడుతుంది. కృష్ణాజిల్లాలో ఈ రోజు పగలు ఎక్కువ సమయం ఉండడం విశేషం.
అయితే కామన్‌గా పగలు 8 గంటల నుండి 12 గంటల మధ్య ఉంటుంది. ఈరోజు ప్రత్యేకంగా కృష్ణాజిల్లాలో పగలు 13 గంటల 7 నిమిషాలపాటు పగలు ఉండబోతుంది. అదే ఇవాళ జరుగుతున్న అద్భుతం. ఇవాళ భారతదేశం మొత్తంలో రెండుచోట్ల మొట్ట మొదటిసారిగా సూర్యోదయం అవుతుంది. మొదటిది మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని, రెండవది కృష్ణాజిల్లాలో గుడివాడ. ఈ రెండు చోట్ల మాత్రమే సూర్యకిరణాలు అందరికంటే ముందు భూమిని తాకుతాయి. భూ భ్రమణాన్ని బట్టి కొన్ని కొన్నిసార్లు ఇలాంటివి జరుగుతుంటాయి. గుడివాడలో ఈరోజును ఎక్కువ సమయం ఉన్న పగలుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలా 1975 సంవత్సరంలో జరిగిందని.. మళ్లీ ఇటువంటి పగలు రావాలంటే 200 సంవత్సరాలు గడవాలి అంటున్నారు నిపుణులు. దీనివల్ల ఎవరికీ ఏ ఇబ్బందులు ఉండవని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ వార్త వైరల్ అవుతుండడంతో ప్రజలు గుడివాడకు చేరుకుని ఈ పరిస్థితి చూడడానికి ఆసక్తి కనబరుస్తున్నారు.