సాధారణంగా మనకు ఒకరోజు అంటే పగలు రాత్రి ఏర్పడతాయి. అంటే 24 గంటల సమయంలో పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు అనుకుంటాం. కానీ కాలాల మార్పును బట్టి రాత్రి, పగలులో గంటల తేడా ఏర్పడుతుంది. వేసవికాలంలో పగలు ఎక్కువగా ఉంటుంది.
ఆకాశంలో ఎన్నో అద్భుతాలు ఆవిష్కృతమౌతూ ఉంటాయి. ఇప్పటికే మనం ఎన్నో అద్భుతాలను చూశాం. మంగళవారం ఆకాశంలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. 5 గ్రహాలు 50 డిగ్రీల కోణంలో ఒకే కక్షలోకి వచ్చాయి.
ఈ విశ్వంలో ఎన్నో వింతలూ విశేషాలు దాగి ఉన్నాయి. అప్పుడప్పుడు ఆకాశంలో చిత్ర విచిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయి. వింతైన ఆకారాలు.. ఆకాశం ఒక్కసారిగా రంగుమారిపోవడం.. పట్టపగలే దట్టమైన మేఘాలు అల్లుకొని చిమ్మచీకటి కావడం.. ఆకాశంలో కాంతిపుంజాలు మెరవడం లాంటి జరుగుతుంటాయి.
ఈ విశ్వంలో అద్భుతాలకు కొదవే లేదు. ఇప్పుడు ఆకాశంలో మరో అద్భుతం చోటుచేసుకోబోతోంది. మీకు తోక చుక్కలు తెలుసా? సాధారణంగా నక్షత్రాల మాదిరిగానే కనిపిస్తాయి. కాకపోతే కాస్త ఎక్కువ వెలుతురు, వేగంగా ప్రయాణిస్తూ ఉండటం చూసుంటారు. అయితే ఇప్పుడు ఆకాశంలో ఓ ఆకుపచ్చ తోకచుక్క దర్శనమివ్వనుంది. దీనిని గ్రీన్ కామెట్ అని పిలుస్తారు. ఈ తోకచుక్క భూమికి బాగా చేరువగా రాబోతోంది. అదికూడా రాతియుగం తర్వాత మళ్లీ ఇప్పుడే ఇలా జరగుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తోకచుక్క అంటే […]
విశాల విశ్వంలో ఎన్నో వింతలు.. అద్భుతాలు.. విశేషాలు. ఇందులో మన తెలివితేటలకు అందేవి కొన్నే.. అందని వింతలు కోకొల్లలు. ఈ అనంత విశ్వం గురించి మనకు తెలిసింది గోరంత.. తెలియాల్సింది కొండంత. ఇక ఆకాశంలో అప్పుడప్పుడు వింత వింత సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈ కోవలోకి చెందిన ఓ అద్భుత దృశ్యం ఈ రోజు ఆకాశంలో ఆవిష్కృతం కానుంది. అదే స్ట్రాబెర్రీ మూన్. మంగళవారం సాయంత్రం 5 గంటల తర్వాత ఈ దృశ్యం కనిపించనుందని ఖగోళ శాస్త్రవేత్తలు […]
ఈ భూమ్మీద అప్పుడప్పుడు చోటు చేసుకునే కొన్ని వింతలు అస్సలు అంతుబట్టవు. ఇక అంతరిక్షంలో చోటు చేసుకునే వింతల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఈ కోవకు చెందిన అబ్బురం ఒకటి ఆకాశంలో ఆవిష్కృతమయ్యింది. మళ్లీ వెయ్యేళ్ల తర్వాత చోటు చేసుకునే ఈ వింత సంఘటన 2022, ఏప్రిల్ 26, 27న చోటు చేసుకుంది. అదేంటంటే.. నాలుగు ఉపగ్రహాలు ఒకే సరళరేఖపైకి వచ్చాయి. అది కూడా సూర్యోదయానికి ముందే. శుక్రుడు, కుజుడు, బృహస్పతి, శని గ్రహాలు ఒకే […]
పారా చుట్ లేకుండా సరదాగా విమానం నుంచి దూకితే ఎలా ఉంటుంది? అలా దూకితే ఇంకేమన్నా ఉందా? కిందకు పడిన మనిషి నుజ్జునుజ్జుకావడం ఖాయం. అయినా ఇలాంటి సాహసం చేసే వాళ్లు ఎవరైనా ఉంటారా అనుకుంటున్నారా? అలాంటి వాడు ఒకడు ఉన్నాడు అతనే ప్రపంచంలో మోస్ట్ డేరింగ్ స్కైడైవర్ లూక్ ఐకిన్స్. 2016 లో పారాచూట్ లేకుండా విమానం నుండి దూకి గిన్నిస్ వరల్డ్ రికార్డును బద్దలుకొట్టాడు. కనీసం కలలో కూడా చేయడానికి భయపడే ఇలాంటి సాహసాన్ని […]