సాధారణంగా మనకు ఒకరోజు అంటే పగలు రాత్రి ఏర్పడతాయి. అంటే 24 గంటల సమయంలో పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు అనుకుంటాం. కానీ కాలాల మార్పును బట్టి రాత్రి, పగలులో గంటల తేడా ఏర్పడుతుంది. వేసవికాలంలో పగలు ఎక్కువగా ఉంటుంది.
చింత చచ్చినా పులుపు చావలేదు సామెతను వినే ఉంటారు. పులుపు సంగతి ఎలా ఉన్నా చింతను తీసుకోవడం వల్ల మనకు ఆరోగ్యకర ప్రయోజనాలే కలుగుతాయి. విరివిగా లభ్యమయ్యే చింత చిగురుతో ఎన్నో లాభాలు ఉన్నాయి. రుచికరమైన ఆహారంగానే కాక దీన్ని తినడం వల్ల మనకు ఆరోగ్యం కూడా కలుగుతుంది. చింత చిగురులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీంతో ఇది సహజ సిద్ధమైన లాక్సేటివ్గా పనిచేసి విరేచనం సులభంగా అయ్యేలా చేస్తుంది. మలబద్దకం సమస్య తొలగిపోతుంది. పైల్స్ […]
మనిషి జీవితం ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో తెలియదు. పట్టుదలకు అదృష్టం తోడైతే వ్యక్తి ఎదుగుదల ఎంతగా ఉంటుందో చెప్పడానికి రంజిత్ సింగ్ జీవితం ఉదాహరణగా నిలుస్తుంది. చదువు మధ్యలో ఆపేసి ఆటో డ్రైవర్‌గా జీవితం ప్రారంభించిన రంజిత్ సింగ్ ఇప్పుడు స్విట్జర్లాండ్‌లో పాపులర్ యూట్యూబర్‌గా పేరు సంపాదించాడు. రాజస్థాన్‌కు చెందిన రంజిత్ సింగ్ పేదరికం కారణంగా పెద్దగా చదువుకోలేక 16 ఏళ్ల వయసులోనే ఆటో డ్రైవర్‌గా మారాడు. జైపూర్‌లో ఆటో డ్రైవర్లు విదేశీ భాషలు నేర్చుకొని, […]