టెక్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నథింగ్ ఫోన్ 1 లాంచ్ కు సమయం దగ్గర పడుతోంది. ఈ నెల 12న ఈ మొబైల్ మార్కెట్‌లోకి రానుంది. వన్‌ప్లస్ మాజీ సీఈవో కార్ల్ పీ స్థాపించిన నథింగ్ కంపెనీ నుంచి డిఫరెంట్ డిజైన్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ వస్తోంది. ఇప్పటికే డిజైన్‌కు సంబంధించిన వివరాలన్నీ బయటికి రాగా, స్పెసిఫికేషన్లు కూడా చాలా వరకు లీకయ్యాయి. ఇప్పటికే నథింగ్ ఫోన్ 1పై ఉండనున్న ఆఫర్ వివరాలను ఫ్లిప్‌కార్ట్ అఫీషియల్‌గా లిస్ట్ చేసింది. ఈ తరుణంలో నథింగ్ ఫోన్ 1 గురించి ఇప్పటి వరకు వెల్లడైన ముఖ్యమైన విషయాల రౌండప్ చూసేయండి.
నథింగ్ ఫోన్ 1 స్మార్ట్ ఫోన్‌తో.. చార్జర్‌ను కంపెనీ అందించడం లేదని తెలుస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ప్యాకేజింగ్‌కు సంబంధించిన యూట్యూబ్ వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతుంది. ప్రముఖ రివ్యూయర్ గౌరవ్ చౌదరి.. అందుకు సంబంధించిన వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియో ప్రకారం ఫోన్ రిటైల్ బాక్స్ చాలా సన్నగా ఉంది. రీసైకిల్ చేసిన వెదురుతో దీన్ని రూపొందించినట్లు చెబుతున్నారు. బాక్స్, బయట కానీ, లోపల కానీ అసలు ప్లాస్టిక్‌ను ఉపయోగించలేదని సమాచారం.
Enough talk. Meet Phone (1) in 24 hours.#nothingevent.
12 July, 16:00 BST.
Watch online at https://t.co/pLWW07l8G7 pic.twitter.com/OznuriCP5K— Nothing (@nothing) July 11, 2022
నథింగ్ ఫోన్ 1 ఆఫర్, ప్రీ-ఆర్డర్ పాస్
జులై 12న రాత్రి 9 గంటల నుంచి ఈ ఫోన్‌ను ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చు. అయితే ముందుగా ప్రీ-ఆర్డర్ పాస్ తీసుకోవాల్సి ఉంటుంది. రూ.2,000 చెల్లించి ఫ్లిప్ కార్టులో ప్రీ-ఆర్డర్ పాస్ తీసుకోవచ్చు. దీన్ని తీసుకుంటే ఫోన్ లాంచ్ అయ్యాక ప్రీ-బుకింగ్ చేస్తే ఫైనల్ ధరలో ఈ రూ.2,000 తగ్గుతుంది. ఒకవేళ క్యాన్సల్ చేసుకుంటే రూ.2,000 రీఫండ్ అవుతుంది.హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC Bank) క్రెడిట్ కార్డుతో ఈ ఫోన్‌ను కొంటే రూ.2,000 అదనపు డిస్కౌంట్ లభించనుంది..
Nothing Phone 1 Unboxing image leaked with transparent case.#NothingPhone1 #Flipkart #Nothingevent pic.twitter.com/pEXglBTdCi
— Mehran Pathan (@itsMehran333) July 11, 2022
ధర (అంచనా)
ఆన్‌లైన్ కథనాల ప్రకారం 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 469.99 యూరోలుగా (సుమారు రూ.38,750) ఉండనుంది. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 499.99 యూరోలుగానూ (సుమారు రూ.41,250), 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 549.99 యూరోలుగానూ (సుమారు రూ.45,350) నిర్ణయించనున్నారని తెలుస్తోంది.
స్పెసిఫికేషన్స్(అంచనా)
నథింగ్ ఫోన్ 1 ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనుంది. ఇందులో 6.55 అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉండనుంది. గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఈ ఫోన్‌లో అందించనున్నారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ+ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఫోన్ వెనకవైపు 50 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుందని సమాచారం. ఎల్ఈడీ నోటిఫికేషన్ సిస్టం కూడా ఫోన్ వెనకవైపు ఉంది. నథింగ్ ఫోన్ 1పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
New animation of Nothing Phone (1) via @Flipkart. HDFC Bank offers to be made available.#NothingPhone1 pic.twitter.com/EcL2XPr1w5
— Akshat jain (@aksshatjainn) July 8, 2022
ఇది కూడా చదవండి: Samsung : భారీ ఆఫర్.. శాంసంగ్ 5జీ ఫోన్‌పై ఏకంగా రూ.9 వేలకు పైగా తగ్గింపు!
ఇది కూడా చదవండి: OnePlus: మీ పాత మొబైల్ ఎక్స్‌ఛేంజ్ చేస్తే.. సగం ధరకే OnePlus స్మార్ట్‌ఫోన్