ఇప్పుడు ఇయర్ బడ్స్ వాడకం సర్వ సాధారణం అయిపోయింది. వాడకం పెరిగిన విధంగానే తయారీ కూడా ఎక్కువగానే ఉంది. దానివల్ల ఇయర్ బడ్స్ ధరలు కూడా బాగా తగ్గుతున్నాయి. కానీ, సరైన ఫీచర్లు ఉన్న ఇయర్ బడ్స్ మాత్రం అంత తక్కువ ధరకు దొరకడం లేదు. కానీ, ఇప్పుడు వింగ్స్ కంపెనీ నుంచి ప్రీమియం ఫీచర్లతో ఉన్న ఇయర్ బడ్స్ బడ్జెట్ ధరలో రిలీజ్ అయ్యాయి.
సాధారణంగా ఇయర్ బడ్స్ వాడకం బాగానే పెరిగింది. పెరిగిన డిమాండ్ కి తగ్గట్లు కొత్త కొత్త మోడల్స్ వస్తున్నాయి. అలా తయారీ కూడా పెరగడం వల్ల ఇయర్ బడ్స్ చాలా తక్కువ ధరలకే దొరుకుతున్నాయి. సాధారణ ఫీచర్స్ తో ఇయర్ బడ్స్ అంటే ఇప్పుడు రూ.1000కి కూడా లభిస్తున్నాయి. కానీ మంచి ఫీచర్స్, బెస్ట్ లుక్స్ లో మీకు ఇయర్ బడ్స్ కావాలి అంటే కాస్త ధర ఎక్కువ పెట్టాల్సి వస్తుందనే చెప్పాలి. ఇప్పుడు మాత్రం వింగ్స్ కంపెనీ నుంచి సూపర్ స్టైలిష్ లుక్స్ లో ప్రీమియం ఫీచర్స్ తో ఇయర్ బడ్స్ కేవలం రూ.1,299కే లభిస్తున్నాయి. అయితే వీటిని ఎందుకు కొనాలి అంటే అందుకు చాలానే కారణాలు ఉన్నాయి.
వింగ్స్ కంపెనీ పేరు చాలా మంది విని ఉండకపోవచ్చు. ఈ కంపెనీ ప్రొడక్టులకు శుభ్ మన్ గిల్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ కంపెనీ ఇప్పుడు బడ్జెట్ లో మంచి ఇయర్ బడ్స్ ని రిలీజ్ చేసింది. ఫాంటమ్ సిరీస్ లో వింగ్స్ ఫాంటమ్ 345 టీడబ్ల్యూఎస్ అని విడుదల చేసింది. ఈ మోడల్ బడ్స్ గురించి ఇప్పుడు బజ్ ఏర్పడింది. ఎందుకంటే అందులో ఉండే ఫీచర్స్ అంతలా కస్టమర్స్ ని ఆకట్టుకుంటున్నాయి. ఈ ఇయర్ బడ్స్ నథింగ్ తరహాలోనే ట్రాన్స్ పరెంట్ కేస్ తో వస్తున్నాయి. ఇవి కేస్ లో పెట్టినా కూడా బయటకు క్లియర్ గా కనిపిస్తూ ఉంటాయి. పైగా ఇందులో ఛార్జింగ్ చూపించేందుకు డిజిటల్ డిస్ ప్లే ఉంది.
ఇంక ఫీచర్స్ విషయానికి వస్తే.. దీని కేస్ కార్బన్ ఫైబర్ తో తయారు చేశారు. ఇందులో బెటర్ ఈఎన్ సీ టెక్నాలజీ ఉంది. మీ వాయిస్ ని గుర్తించి.. ఇతర శబ్ధాలను తగ్గిస్తుంది. మీ వాయిస్ అవతలి వారికి క్రిస్టల్ క్లియర్ గా వినిపిస్తుంది. ఇందులో 13 ఎంఎం హై ఫిడెలిటీ డ్రైవర్స్ ఉన్నాయి. ఇందులో మీరు టచ్ కంట్రోల్స్ ని కస్టమైజ్ చేసుకోవచ్చు. మ్యూజిక్, కాల్స్, గేమ్ మోడ్, వాల్యూమ్ కంట్రోల్ చేయచ్చు. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 50 గంటల వరకు ప్లే టైమ్ లభిస్తుంది. 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే.. 100 నిమిషాల వరకు బ్యాకప్ లభిస్తుంది. ఇందులో వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా ఉంది. ఐపీఎక్స్5 వాటర్ రెసిస్టెన్స్ కూడా ఉంది. దీని ఎమ్మార్పీ రూ.2,999 కాగా లాంఛింగ్ ఆఫర్ కింద రూ.1,299కే అందిస్తున్నారు. ఈ వింగ్స్ ఫాంటమ్ 345 టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్ ఫ్లిప్ కార్టులో అందుబాటులో ఉన్నాయి.