వన్ ప్లస్ కంపెనీకి స్మార్ట్ ఫోన్, ఇయర్ బడ్స్, స్మార్ట్ టీవీల కేటగిరీలో భారత్ లో మంచి మార్కెట్ ఉంది. తాజాగా వన్ ప్లస్ పాడ్ లను కూడా తయారు చేయడం ప్రారంభించింది. ఇటీవల వన్ ప్లస్ నుంచి పాడ్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అయితే అసలు ఆ పాడ్ ఎలా ఉంది? కొనటం మంచిదేనా? ఆ ధరలో వన్ ప్లస్ పాడ్ అవసరమా? అనే విషయాలు తెలుసుకుందాం.
సాధారణంగా స్మార్ట్ ఫోన్లు, స్మార్డ్ గ్యాడ్జెట్లే కాదు.. పాడ్ లకు కూడా మంచి మార్కెట్ ఏర్పడింది. అయితే చాలా మంది యాపిల్ ఐపాడ్ గురించే ఎక్కువగా మాట్లాడుకుంటారు. కానీ, అది కొనాలి అంటే సాధారణంగానే ధర ఎక్కువగా ఉంటుంది. బడ్జెట్ లో పాడ్ కావాలి అనుకుంటే మాత్రం మిగిలిన కంపెనీలకు చెందినవి కొనుగోలు చేస్తుంటారు. ఇప్పుడు ఈ పాడ్ మార్టెక్ లోకి వన్ ప్లస్ కూడా అడుగుపెట్టింది. తమ మొట్టమొదటి ప్యాడ్ ని వన్ ప్లస్ సంస్థ రిలీజ్ చేసింది. దాని ఫీచర్స్, లుక్స్ గురించి ఇప్పటికే నెట్టింట తెగ ప్రచారం జరుగుతోంది. అసలు ఈ వన్ ప్లస్ పాడ్ ని కొనుగోలు చేయచ్చా? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోండి.
వన్ ప్లస్ పాడ్ ఫీచర్స్ విషయానికి వస్తే.. 11.61 ఇంచెస్ 2.8కే ఎల్సీడీ డిస్ ప్లే, 500 నిట్స్ బ్రైట్ నెస్ తో వస్తోంది. మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ప్రాసెసర్, 144 హెట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంది. ఇందులో డాల్బీ విజన్ టెక్నాలజీ ఉంది. 4 క్వాడ్ స్పీకర్స్ ఉన్నాయి. ఇది ఎల్పీడీడీఆర్5 ర్యామ్ తో వస్తోంది. ఇందులో 8జీబీ, 12 జీబీ వేరియంట్స్ ఉన్నాయి. మెమోరీ విషయానికి వస్తే.. 128 జీబీ, 256 జీబీ ఆప్షన్స్ ఉన్నాయి. 13 ఎంపీ రేర్ కెమెరా, 8ఎంపీ ఫ్రంట్ కెమెరాతో వస్తోంది. 9510 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 67 వాట్స్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో వస్తోంది. 50 శాతం ఛార్జింగ్ అయ్యేందుకు కేవలం 30 నిమిషాలు మాత్రమే పడుతుంది. 0 నుంచి 100 ఛార్జ్ అయ్యేందుకు మాత్రం గంటన్నర సమయం పడుతుంది.
ఈ పాడ్ లుక్స్ పరంగా అందరినీ ఆకట్టుకుంటోంది. ఇంక ఈ వన్ ప్లస్ పాడ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. ఎల్సీడీ డిస్ ప్లే అయినా కూడా మంచి విజువల్ ఎక్స్ పీరియన్స్ లభిస్తుంది. 500 నిట్స్ డిస్ ప్లే వల్ల సన్ లైట్ లో కూడా మీకు పాడ్ బాగా కనపిస్తుంది. డాల్బీ టెక్నాలజీ- 4 క్వాడ్ స్పీకర్స్ వల్ల మీకు మంచి సౌండ్ ఎక్స్ పీరియన్స్ లభిస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ప్రాసెసర్ వల్ల మీరు చక్కగా గేమ్స్ ఆడుకోవచ్చు. పాడ్ త్వరగా హీట్ కూడా కాదు. అయితే గేమ్స్ ఆడే సమయంలో కాస్త పిక్సలౌట్ అయిన ఫీలింగ్ కలుగుతోందని చెబుతున్నారు. కెమెరా చూస్తే 13 ఎంపీ రేర్ కెమెరా, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా వస్తుంది. కెమెరాపై మరీ ఎక్కువ అంచనాలు అవసరం లేదంటున్నారు. వీడియో కాల్స్ పరంగా మాత్రం దీనికి మంచి మార్కులే పడుతున్నాయ. బ్యాక్ కెమెరాతో 4కేలో వీడియో రికార్డ్ చేయచ్చు.
8జీబీ/128జీబీ వేరియంట్(రూ.37,999), 12 జీబీ/256 జీబీ(రూ.39,999) వేరియంట్స్ ఉన్నాయి. వీటికి అదనంగా మీకు కీ బోర్డ్ కావాలంటే రూ.8 వేలు ఖర్చు చేయాలి. పాడ్ కి పెన్(స్టైలో) కావాలి అంటే రూ.4,999 వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ వన్ పాడ్ లో కీబోర్డు, పెన్ పరంగా కడా చాలా మంచి ఫీచర్స్ ఇచ్చారు. వాటికి కూడా మంచి రివ్యూస్ లభిస్తున్నాయి. అయితే వన్ ప్లస్ పాడ్ పర్ఫార్మెన్స్ కు మంచి మార్కులు పడుతున్నా కూడా.. ధర విషయంలో మాత్రం చాలా మంది వెనక్కి తగ్గుతున్నారు. ఆ ధరకు పాడ్ కూడా ఇచ్చుంటే చాలా మంచి డీల్ అయ్యేది. దాదాపు రూ.38,000 ధర పెట్టి కీప్యాడ్ విడిగా కొనుగోలు చేయాల్సిందిగా చెప్పడంపై కస్టమర్స్ పెదవి విరుస్తున్నారు. వన్ ప్లస్ పాడ్(8/128 వేరియంట్), కీప్యాడ్, స్టైలో అన్నీ కలపి తీసుకోవాలంటే దాదాపు రూ.51 వేలు అవుతోంది. మంచి ఆఫ్రర్స్ ఉన్న సమయంలో అయితే ఈ ధరలో మంచి యాపిల్ ఐపాడ్ లభిస్తుందని కామెంట్ చేస్తున్నారు. పర్ఫార్మెన్స్ విషయంలో మెప్పించినా.. ధరకు సంబంధించి మాత్రమే వన్ ప్లస్ పాడ్ కొనుగోలు విషయంలో వినియోగదారులు వెనక్కి తగ్గుతున్నారు. వన్ ప్లస్ పాడ్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.