వన్ ప్లస్ ఫోన్లకు ఇండియన్ మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. అయితే వీటిలో కొన్ని మోడల్స్ ధర ఎక్కువగా ఉంటుందని కొనుగోలు చేయరు. కానీ, ఇప్పుడు సమ్మర్ సేల్ లో కొన్ని మోడల్స్ పై మంచి ఆఫర్స్ ఉన్నాయి.
స్మార్ట్ ఫోన్ ని ఎప్పుడుపడితో అప్పుడు కొనుగోలు చేస్తే మీరు కచ్చితంగా నష్టపోతారు. అదే సేల్ ఉన్న సమయంలో అయితే మీకు డిస్కౌంట్, ఆఫర్స్ వంటివి లభిస్తాయి. ప్రస్తుతం ప్రముఖ ఇ-కామర్స్ సంస్థల్లో సమ్మర్ సేల్ నడుస్తోంది. ఆ సేల్ లో వన్ ప్లస్ ఫోన్లపై మంచి ఆఫర్స్ ఉన్నాయి. భారత్ మార్కెట్ వో వన్ ప్లస్ ఫోన్లకు మంచి డిమాండ్ ఉంది. మీరు వన్ ప్లస్ ఫోన్ కొనాలి అనుకుని.. అవి కాస్త ధర ఎక్కువగా ఉన్నాయని వెనక్కి తగ్గితే ఇదే మంచి సమయం. మళ్లీ ఇంత తగ్గింపు దొరకదనే చెప్పాలి. వన్ ప్లస్ మోడల్స్ పై ఎంత తగ్గింపు ఉంది? మీరు ఏ మోడల్ కొనుగోలు చేస్తే మంచిదో చూద్దాం.
వన్ ప్లస్ నార్డ్ సిరీస్ కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. నార్డ్ సీఈ2 లైట్ 5జీ ఫీచర్స్ చూస్తే.. 6.59 ఇంచెస్ డిస్ ప్లే, 120 హెట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తోంది. ఇందులో ఈఐఎస్ టెక్నాలజీతో 64 ఎంపీ మెయిన్ కెమెరా, 16ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్ తో వస్తోంది. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఉంది. 6 జీబీ ర్యామ్+ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఎమ్మార్పీ రూ.19,999 కాగా.. రూ.18,499కే అందిస్తున్నారు. దీనిపై అదనంగా ఐసీసీఐ, కోటక్ బ్యాంక్ కార్డ్స్ ఉంటే 10 శాతం తగ్గింపు లభిస్తుంది. ఈ నార్డ్ సీఈ2 లైట్ 5జీ ఫోన్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఇటీవల రిలీజ్ అయిన నార్డ్ సీఈ3 లైట్ 5జీ స్మార్ట్ ఫోన్ కు మంచి రెస్పాన్స్ లభించింది. ఈ ఫోన్ లో 8 జీబీ ర్యామ్+ 128జీబీ/256 జీబీ స్టోరేజ్ ఆప్షన్స్ ఉన్నాయి. 6.72 ఇంచెస్ ఎల్సీడీ డిస్ ప్లే, 120 హెట్జ్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. 108 ఎంపీ మెయిన్ కెమెరా ఉంది. ఈ మెడల్ లో 3x జూమ్ ఉంది. ఇంక 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. ఆండ్రాయిడ్ 13, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్ ఉంటుంది. ఈ మోడల్ 128 జీబీ వర్షన్ ను రూ.19,999కి 256 జీబీ వర్షన్ ను రూ.21,998కి అందిస్తున్నారు. దీనిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ లభిస్తాయి. ఎక్స్ ఛేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఈ ధరలో ఈ మోడల్ మొబైల్ అందరికీ అనుకూలంగా ఉంటుంది. గేమర్స్ కి మాత్రం ఇది సెట్ కాదు. ఈ నార్డ్ సీఈ3 లైట్ 5జీ ఫోన్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఈ ఫోన్ 6.43 ఇంచెస్ ఆమోలెడ్ డిస్ ప్లేతో వస్తోంది. 90 హెట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 50 ఎంపీ మెయిన్ కెమెరా విత్ సోనీ ఐఎంఎక్స్ 766- ఓఐఎస్ టెక్నాలజీ, 8 ఎంపీ అల్ట్రా వైడ్, 2 ఎంపీ మోనో లెన్స్, 32 ఎంపీ సెల్ఫీ కెమెరాతో వస్తోంది. మీడియాటెక్ డైమెన్సిటీ 1300 ప్రాసెసర్ తో వస్తోంది. ఇందులో యాంబియంట్ డిస్ ప్లే, ఏఐ కలర్ ఎన్హాన్స్ మెంట్, డార్క్ మోడ్ ఫీచర్స్ ఉన్నాయి. ఈ ఫోన్ ని రూ.28,999కే అందిస్తున్నారు. దీనికి బ్యాంక్ ఆఫర్లు అదనం. మీ పాత ఫోన్ ని ఎక్స్ ఛేంజ్ చేస్తే.. రూ.25 వేల వరకు ఎక్స్ ఛేంజ్ బోనస్ ఇస్తున్నారు. ఈ వన్ ప్లస్ నార్డ్ 2టీ 5జీ ఫోన్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
వన్ ప్లస్ 10ఆర్ ఫోన్ 8 జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజ్, 12జీబీ ర్యామ్/256 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో వస్తోంది. 6.7 ఇంచెస్ డిస్ ప్లే, 120 హెట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తోంది. 50 ఎంపీ మెయిన్ కెమెరా, 2 ఎంపీ మ్యాక్రో, 16 ఎంపీ సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఈ ఫోన్ ఎమ్మార్పీ రూ.38,999 కాగా రూ.30,999కే అందిస్తున్నారు. దీనిపై అదనంగా బ్యాంక్ ఆఫర్లు, రూ.25 వేల వరకు ఎక్స్ ఛేంజ్ బోనస్ లు ఉన్నాయి. ఈ వన్ ప్లస్ 10ఆర్ ఫోన్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.