మారుతున్న సాంకేతికతతో మనిషి జీవనం కూడా ఎంతో సులభతరంగా మారిపోయింది. ఒకప్పుడు సెల్ ఫోన్ ఉంటేనే ఎంతో గొప్పగా చూసేవారు. ఇప్పుడు చేతి వాచ్ నుంచే ఫోన్ చేసి మాట్లాడే దాకా టెక్నాలజీ అభివృద్ధి చెందింది. ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ వాచ్ అనేది లగ్జరీ నుంచి అవసరం దాకా వచ్చేసింది. హెల్త్, డైలీ యాక్టివిటీస్ మానిటరింగ్ కు తప్పనిసరిగా మారిపోయాయి.
ఎంతో మందికి స్మార్ వాచ్ కొనుక్కోవాలి అని ఉంటుంది. కానీ, వాళ్లకు ఏ కంపెనీ స్మార్ట్ వాచ్ మంచిదో తెలియకపోవచ్చు. ఒకవేళ వాళ్లు అనుకున్న బడ్జెట్‌లో ఏ వాచెస్ లభిస్తున్నాయో వారికి వివరాలు తెలియకపోవచ్చు. అలాంటి వారి కోసం ఈ ఆర్టికల్ లో రూ.5 వేలలోపు లభించే టాప్ 10 స్మార్ట్ వాచెస్ గురించి తెలుసుకుందాం.
రియల్మీ వాచ్ 2 ప్రో:
రూ.5 వేలలోపు లభించే స్మార్ట్ వాచ్ కేటగిరీలో రియల్మీ వాచ్ 2 ప్రో ముందు వరుసలో ఉంటుంది. రూ.4,999కి అందుబాటులో ఉన్న ఈ రియల్మీ వాచ్ నుంచి వచ్చిన స్మార్ట్ వాచెస్ లో వాచ్ 2 ప్రో ఎంతో మన్నికైనదని చెప్పొచ్చు. ఈ అప్ డేట్ వర్షన్ ద్వారా అక్యురేట్ జీపీఎస్ ట్రాకింగ్, హెల్త్ మానిటరింగ్ సాధ్యమవుతుంది. దీని బ్యాటరీ లైఫ్, కంపానియన్ యాప్ కూడా యూజర్స్ కు బాగా నచ్చుతాయి.
రెడ్ మీ వాచ్:
రెడ్ మీ నుంచి లభిస్తున్న ఈ స్మార్ట్ వాచ్ ప్రముఖ ఈ కామర్స్ సైట్స్ లో రూ.3,999కు లభిస్తోంది. దీనిలో ఉన్న ఇన్ బిల్ట్ జీపీఎస్ సిస్టమ్ అక్యురేట్ ఫలితాలు అందిస్తోంది. బ్లాక్, బ్లూ, వైట్ వంటి 3 డిఫరెంట్ వాచ్ స్ట్రాప్ కలర్స్ తో లభిస్తోంది. ఈ వాచ్ 5 ఏటీఎం వాటర్ రెసిస్టెన్స్, 50 మీటర్స్ వాటర్ డెప్త్ రెసిస్టెన్స్ తో అందుబాలో ఉంది. ఆండ్రాయిడ్, ఐవోఎస్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది.
ఫాస్ట్రాక్ రీఫ్లెక్స్ వోక్స్:
ప్రముఖ వాచ్ కంపెనీ ఫాస్ట్రాక్ నుంచి వస్తున్న ఈ స్మార్ట్ వాచ్ రూ.4,995కు లభిస్తోంది. సిలికాన్ స్ట్రాప్ తో రెక్టాంగిల్ షేప్ తో ఈ వాచ్ అందుబాటులో ఉంది. ఈ వాచ్ లో హార్ట్ రేట్ తో పాటు, spo2 మానిటరింగ్ కూడా అందుబాటులో ఉంది. స్ట్రెస్ ట్రాకర్ తో పాటు ఆడవారికి నెలసరి ట్రాక్ చేసే ఫీచర్ కూడా ఈ వాచ్ లో అందుబాటులో ఉంది.
నాయిస్ కలర్ ఫిట్ నావ్:
నాయిస్ స్మార్ట్ వాచెస్ కు మార్కెట్లో మంచి ఆదరణ లభిస్తోంది. ఈ స్మార్ట్ వాచ్ రూ.3,499కే లభిస్తోంది. ఇందులో బ్లాక్, మిస్ట్ గ్రే, టీల్ గ్రీన్ ఇంకా స్పెషల్ ఎడిషన్ అంటూ 4 రకాల కలర్స్, లిసికాన్ స్ట్రాప్‌తో లభిస్తోంది. ఇందులో రౌండ్, స్క్వేర్ రెండు షేప్ లు లభిస్తున్నాయి. గుడ్ బిల్డ్ క్వాలిటీ, కంపానియన్ యాప్, బిల్ట్ ఇన్ జీపీఎస్ ఆకట్టుకునే అంశాలు.
అమేజ్ ఫిట్ బిప్ లైట్:
ఈ అమేజ్ ఫిట్ స్మార్ట్ వాచ్ రూ.3,499కే లభిస్తోంది. దీని సిలికాన్ స్ట్రాప్ ఏంతో ఈజీగా, క్వాలిటీగా ఉంటుంది. ధరించేందుకు కూడా ఎంతో సులువుగా ఉంటుంది. రౌండ్ అండ్ స్క్వేర్ షేప్ లో అందుబాటులో ఉంది. డిస్ ప్లే పరంగా ఈ వాచ్ కు చాలా మంచి మార్కులు వేయచ్చు. జీపీఎస్, అక్యురేట్ స్టెప్ ట్రాకింగ్ వంటి ఆకట్టుకునే అంశాలు ఉన్నాయి.
పెబల్ కాస్మోస్ ల్యూక్స్:
ఈ పెబల్ కాస్మోస్ ల్యూక్స్ స్మార్ట్ వాచ్ రూ.3,999కే లభిస్తోంది. దీనిలో ముఖ్యంగా బిల్ట్ ఇన్ స్పీకర్, మైక్ ఉన్నాయి. ఈ ధరలో బిల్టిన్ స్పీకర్, మైక్ రావడం గొప్పనే చెప్పాలి. ఈ వాచ్ ఆండ్రాయిడ్, ఓవోఎస్ రెండు ఫోన్లకు సూట్ అవుతుంది. అమోలెడ్ డిస్ ప్లే, మంచి బ్యాటరీ బ్యాకప్ తో ఈ వాచ్ లభిస్తోంది. నోటిఫయర్ గానే కాకుండా.. ఫిట్ నెస్ ట్రాకింగ్ కు ఎంతో ఉపయోగపడుతుంది.
ఫైర్ బోల్ట్ థండర్:
ఈ ఫైర్ బోల్ట్ థండర్ స్మార్ట్ వాచ్ రూ.4,999కి అన్ని ప్రముఖ ఈ-కామర్స్ వెబ్ సైట్స్ లో లభిస్తోంది. ఇది సిలికాన్ స్ట్రాప్ తో బ్లాక్, గోల్డ్, గ్రే కలర్స్ లో అందుబాటులో ఉంది. ఇది 33 ఎంఎం రౌండ్ డిస్ ప్లే, అమోలెడ్ స్క్రీన్ తో అందుబాటులో ఉంది. బ్యాటరీ లైఫ్ 10 రోజులు వరకు ఉంటుందని చెబుతున్నారు. ఈ వాచ్ కు రెండు బటన్స్ కూడా ఉంటాయి. బ్లూ టూత్ కాలింగ్ కూడా అందుబాటులో ఉంది.
నాయిస్ ఫిట్ ఇవాల్వ్ 2:
నాయిస్ నుంచి అందుబాటులో ఉన్న మరో స్మార్ట్ వాచ్ నాయిస్ ఫిట్ ఇవాల్వ్ 2 రూ.3,499కి లభిస్తోంది. ఇది రౌండ్ షేప్, 42ఎంఎం అమోలెడ్ డిస్ ప్లే, సిలికాన్ స్ట్రాప్ తో అందుబాటులో ఉంది. ఇందులో చార్కోల్ బ్లాక్, క్లౌడ్ గ్రే, రోజ్ పింక్ కలర్స్ లో అందుబాటులో ఉంది. దీనిలో ఫిట్ నెస్ ట్రాకింగ్ తో పాటుగా స్ట్రెస్ మానిటర్ కూడా ఉంది. 5 ఏటీఎం వాటర్ రెసిస్టెన్సీతో లభిస్తోంది.
టైమెక్స్ ఫిట్ 2.0:
టైమెక్స్ ఫిట్ 2.0 స్మార్ట్ వాచ్ అన్ని ఈ-కామర్స్ వెబ్ సైట్స్ లో రూ.4,499 ధరలో అందుబాటులో ఉంది. దీనిలో బాగా చెప్పుకోవాల్సిన విషయం.. ఈ స్మార్ట్ వాచ్ డైల్ మెటీరియల్ మెటల్ కావడం విశేషం. ఈ వాచ్ బ్లాక్ స్ట్రాప్, 45ఎంఎం బ్లాక్ డయల్ లో అందుబాటులో ఉంది. వాచ్ బ్యాటరీ విషయానికి వస్తే.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 7 రోజులు వస్తుంది. ఈ వాచ్ లో ఇన్ బిల్డ్ మైక్రో ఫోన్ కూడా ఉంది.
ఫైర్ బోల్ట్ రింగ్ 3:
ఫైర్ బోల్ట్ రింగ్ 3 స్మార్ట్ వాచ్ రూ.3,499 ధరలో అందుబాటులో ఉంది. ఇది ఆండ్రాయిట్, ఐవోఎస్ ఫోన్లకు సూట్ అవుతుంది. ఇది బ్లాక్, గ్రే, గోల్డ్, నేవీ బ్లూ, రోజ్ గోల్డ్, సిల్వర్ కలర్ స్ట్రాప్ తో అందుబాటులో ఉంది. ఇది 45 ఎంఎం బిగ్ డిస్ ప్లేతో లభిస్తోంది. ఫిట్ నెస్ ట్రాకింగ్ తో పాటు హార్ట్ రేట్ మోనిటర్ కూడా అందుబాటులో ఉంది.
ఇదండి.. ప్రస్తుతం మార్కెట్ లో అందుబాటులో ఉన్న స్మార్ట్ వాచెస్ లో రూ.5 వేలలోపు లభించే కొన్ని స్మార్ట్ వాచెస్ వివరాలు ఈ ఆర్టికల్ మీకు అందించాం. వీటిలో మీకు బాగా నచ్చిన, మీరు కొనాలనుకుంటున్న వాచ్ ఉంటే ఆ పేరును కామెంట్ చేయండి. మీకు ఇంకా ఏదైనా స్మార్ట్ వాచ్, స్మార్ట్ ఫోన్, డాడ్జెట్ గురించి తెలుసుకోవాలని ఉంటే దాని పేరును కామెంట్ చేయండి.