స్మార్ట్ వాచ్ లను ఇష్టపడే వారికి.. స్మార్ట్ వాచ్ కొనుగోలు చేయాలి అనుకునే వారికి ఇది చాలా పెద్ద సర్ ప్రైజ్ అనే చెప్పచ్చు. ఎందుకంటే ఏకంగా రూ.10 వేల విలువైన స్మార్ట్ వాచ్ ఇప్పుడు కేవలం రూ.1,499కే అందిస్తున్నారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు, ఆఫర్ డీటెయిల్స్ ఇవే.
ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా అందరూ స్మార్ట్ వాచ్ లు వాడుతున్నారు. అందుకే స్మార్ట్ వాచ్ లకు మార్కెట్ లో విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. పైగా ఇప్పుడు అందరూ హెల్త్ విషయంలో శ్రద్ధగా ఉండటం ప్రారంభించారు. స్మార్ట్ వాచ్ ల ద్వారా మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. సగం మంది హెల్త్ కేర్ కోసం కూడా స్మార్ట్ వాచెస్ ని కొనుగోలు చేస్తున్నారు. అయితే మంచి స్పోర్ట్స్ మోడ్స్, హెల్త్ మానిటరింగ్ అన్నీ ఉండాలి అంటే కాస్త ఖరీదుగానే ఉంటుంది. కానీ, ఇప్పుడు మీకోసం ఒక బెస్ట్ డీల్ తీసుకొచ్చాం. ఇందులో మీకు రూ.10 వేల విలువైన స్మార్ట్ వాచ్ ని కేవలం రూ.1,499కే అందిస్తున్నారు.
ఇప్పుడు చెప్పుకోబోయేది ఫైర్ బోల్ట్ కంపెనీకి చెందిన స్మార్ట్ వాచ్ గురించి. ఫైర్ బోల్ట్ కంపెనీకి చెందిన స్మార్ట్ వాచెస్ కి మంచి డిమాండ్ పెరిగింది. ఎందుకంటే చాలా మంచి ఫీచర్స్ ఉన్న స్మార్ట్ వాచెస్ ని చాలా తక్కువ ధరకే, మంచి డిస్కౌంట్స్, ఆఫర్స్ తో అందిస్తున్నారు. ఇప్పుడు ఫైర్ బోల్ట్ నుంచి రింగ్ 3 స్మార్ట్ వాచ్ పై క్రేజీ ఆఫర్ నడుస్తోంది. రూ.10 వేల ఎమ్మార్పీ కలిగిన రింగ్ 3 స్మార్ట్ వాచ్ ని ఇప్పుడు ప్రముఖ ఇ-కామర్స్ సైట్ లో మీరు కేవలం రూ.1,499కే పొందవచ్చు. అయితే ఇది పరిమితకాల ఆఫర్ అని చెబుతున్నారు. ఎప్పటివరకు ఈ ఆఫర్ కొనసాగుతుంది అనే దానిపై స్పష్టత లేదు. మీరు మంచి ఫీచర్స్ తో స్మార్ట్ వాచ్ కొనాలి అనుకుంటే ఇది బెస్ట్ డీల్ అని చెప్పచ్చు.
ఇంక ఈ ఫైర్ బోల్ట్ రింగ్ 3 స్మార్ట్ వాచ్ ఫీచర్స్ విషయానికి వస్తే.. 1.8 ఇంచెస్ టీఎఫ్టీ ఎల్సీడీ ఫుల్ టచ్ డిస్ ప్లేతో వస్తోంది. ఇది చాలా పెద్ద డిస్ ప్లే అని చెప్పచ్చు. అలాగే ఇందులో బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ కూడా ఉంది. మీరు నేరుగా స్మార్ట్ వాచ్ లో డైల్ పాడ్ ద్వారా కాల్ చేయచ్చు. కాల్ లిఫ్ట్ చేయడం, కట్ చేయడం చేచ్చు. కాంటాక్ట్స్ ని సేవ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఇందులో 118 స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి. ఇందులో వాయిస్ అసిస్టెంట్ కూడా ఉంది. దీని ద్వారా మీరు కాల్ చేయడం, మ్యూజిక్ కంట్రోల్ కూడా చేయచ్చు. హార్ట్ రేట్ ట్రాక్, స్టెప్ కౌంట్ ఫీచర్ కూడా ఉంటుంది. 90 నిమిషాలు ఛార్జ్ చేస్తే 3 రోజుల వరకు మీరు స్మార్ట్ వాచ్ ని వాడుకోవచ్చు. 1 మీటర్ వరకు వాచ్ నీళ్లలో పడినా ఏం కాదు. ఈ ఫైర్ బోల్ట్ రింగ్ 3 స్మార్ట్ వాచ్ ని కొనుగోలు చేయాలంటే క్లిక్ చేయండి.