మన దేశంలో క్రికెట్ అంటే గేమ్ మాత్రమే కాదు అదో ఎమోషన్. క్రికెటర్లని దేవుళ్ల కంటే ఎక్కువగా అభిమానిస్తుంటారు. అందుకు తగ్గట్లే ఆయా ఆటగాళ్లు కూడా ప్రతిరోజూ టీమిండియాని గెలిపించాలనే ఉద్దేశంతోనే కష్టపడుతుంటారు. ఈ క్రమంలోనే స్టార్ క్రికెటర్లుగా పేరు తెచ్చుకుంటూ ఉంటారు. ఆర్థికంగానూ స్థిరపడతారు. ఇక ఐపీఎల్ మొదలైన చిన్న చిన్న క్రికెటర్ల టాలెంట్ ని బయటపెట్టుకున్నారు. అలానే కోట్ల ఆస్తిని సంపాదించారు. అలాంటివారిలో హార్దిక్ పాండ్య, బుమ్రా ముందు వరసలో ఉంటారు. వీళ్లిద్దరూ కూడా భారత జట్టులో పెర్మినెంట్ ప్లేస్ సంపాదించడమే కాదు ఆస్తులు కూడా బాగానే కూడబెట్టుకున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. టీమిండియాకు ఆడే క్రికెటర్లు ఆటపై ఎంత శ్రద్ధ పెడతారో.. కుటుంబం, లైఫ్ ని ఎంజాయ్ చేసే విషయంలోనూ అస్సలు మొహమాటపడరు. ఇందుకోసం కార్స్, బైక్స్, బంగ్లాలు లాంటివి కొంటూ ఉంటారు. ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ లో కారు నిత్యవసరమైపోయింది. మనం అంటే బడ్జెట్ లో దొరికే కార్స్ యూజ్ చేస్తుంటాం. మరి ప్రతి ఏడాది కోట్లకు కోట్లు అర్జించే క్రికెటర్లు.. కాస్ట్ లీ కార్స్ ని సొంతం చేసుకుంటూ ఉంటారు. అలా పలువురు టీమిండియా క్రికెటర్ల దగ్గర ఖరీదైన కార్లు ఉన్నాయి. ఇంతకీ వాటి లిస్ట్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం.
టీమిండియా ఓపెనర్ అనగానే చాలామందికి గుర్తొచ్చేది సెహ్వాగ్ మాత్రమే. ప్రత్యర్థి బౌలర్ ఎవరైనా సరే చాలాసార్లు ఇన్నింగ్స్ తొలి బంతికే బౌండరీ కొడుతుండేవాడు. వన్డేల్లో డబుల్ సెంచరీ, టెస్టుల్లో త్రిబుల్ సెంచరీలు చేసిన ఘనత కూడా సెహ్వాగ్ కే చెందుతుంది. ఇక 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్టులోనూ సభ్యుడిగా ఉన్న సెహ్వాగ్ క్రికెటర్ గా సూపర్ సక్సెస్ అయ్యాడు. ఇక రియల్ లైఫ్ లోనూ లగ్జరీగా బతుకుతున్నాడు. ప్రస్తుతం సెహ్వాగ్ దగ్గర బెంట్లీ కాంటినెంటల్ ఫ్లయింగ్ స్పర్ అనే కాస్ట్ లీ కారు ఉంది. రూ.3.74 కోట్లు విలువ చేసే ఈ కారు.. కేవలం 5.2 సెకన్లలోనే 100 కిలోమీటర్ల స్పీడ్ అందుకుంటుంది. అది దీని స్పెషాలిటీ
టీమిండియా దొరికిన మరో ఆణిముత్యం లాంటి క్రికెటర్ యువరాజ్ సింగ్. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే వరల్డ్ కప్ ని టీమిండియా గెలుచుకోవడంలో యువీ కీ రోల్ ప్లే చేశాడు. మైదానంలో దూకుడుగా ఉండే యువరాజ్.. బయట కూడా అంతే జాలీగా ఉండేవాడు. ఇక మనోడి దగ్గర ఆరెంజ్ కలర్ లాంబోర్గోని మర్షిలాగో అనే ఖరీదైన కారు ఉంది. గంటకు 342 కిలో మీటర్ల వేగంతో వెళ్లడం దీని స్పెషాలిటీ. ధర వచ్చేసి రూ.3.6 కోట్లు.
ప్రస్తుత జనరేషన్ లో బెస్ట్ బ్యాటర్ ఎవరూ అంటే ప్రతి ఒక్కరూ తడుముకోకుండా చెప్పే ఒకే ఒక్క పేరు విరాట్ కోహ్లీ. దశాబ్దానికి పైగానే టీమిండియాకు ఆడుతున్న మనోడు బ్యాటర్, కెప్టెన్ గా ఎన్నో అద్భుతమైన విజయాల్ని అందించాడు. ఎవరికీ సాధ్యం కానీ ఎన్నో రికార్డులను సెట్ చేసి పెట్టాడు. క్రికెటర్ ఎంత సూపర్ సక్సెసో.. బ్రాండ్లని ప్రమోట్ చేయడంలో మనోడు అందరి కంటే టాప్. ఇక కోహ్లీ ఆస్తి విలువ రూ.1600 కోట్ల పైమాటే. దిల్లీలో ఓ రెస్టారెంట్ కూడా ఉంది. ఇక కోహ్లీ ఆడీ R8 V10 LMX అనే లగ్జరీ కారు ఉంది. దీని ధర దాదాపు రూ.3 కోట్లు. ఇకపోతే ఇదే కార్ల కంపెనీకి కోహ్లీ బ్రాండ్ అంబాసిడర్ గానూ ఉండటం విశేషం.
ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన అద్భుతమైన ఆల్ రౌండర్లలో హార్దిక్ పాండ్య టాప్ లో ఉంటాడు. ప్రస్తుతం టీ20 ఫార్మాట్ లో టీమిండియాకు కెప్టెన్ గానూ వ్యవహరిస్తున్నాడు. మధ్య తరగతి కుటుంబం నుంచి స్టార్ క్రికెటర్ స్థాయికి వచ్చిన పాండ్య.. ప్రస్తుతం చాలా లగ్జరీ వస్తువుల్ని కొన్నాడు. వాటిలో కోట్లు విలువ చేసే వాచ్, కార్స్, ఓ ఫ్లైట్ కూడా ఉన్నాయి. ఇకపోతే పాండ్య దగ్గర లాంబోర్గిని హరికేన్ ఈవో అనే లగ్జరీ కారు ఉంది. దీని కాస్ట్ రూ.3.73 కోట్లు. 2.9 సెకన్లలోనే ఈ కారు.. 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇక హార్దిక్ దగ్గర రేంజ్ రోవర్ కారు కూడా ఉంది. దీని ఖరీదు రూ.1.82 కోట్లు. ఇది 8.3 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.
క్రికెట్ కి దేవుడు అనేవాడు ఉంటే అందరూ చెప్పే వన్ అండ్ ఓన్లీ నేమ్ సచిన్ టెండుల్కర్. దాదాపు 24 ఏళ్లపాటు భారత జట్టుకు ఆడిన సచిన్.. ఎవరికీ ఎప్పటికీ సాధ్యం కానీ రికార్డులను సాధించారు. అవి ఇప్పటికీ చాలా వరకు అలానే ఉన్నాయి. ప్రస్తుతం రిటైర్మెంట్ తీసుకున్నప్పటికీ పలు బ్రాండ్స్ కు ప్రమోషన్స్ చేస్తూ బాగానే సంపాదిస్తున్నారు. లగ్జరీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక సచిన్ దగ్గర BMW i8 కారు ఉంది. దీని ఖరీదు రూ.2.62 కోట్లు. ఈ కంపెనీకి ఇండియాలో సచినే బ్రాండ్ అంబాసిడర్ కూడా. ఇకపోతే ఇదొక్కటే కాదు BMW కంపెనీకి చెందిన చాలా మోడల్స్ కార్లు సచిన్ దగ్గర ఉన్నాయి.
సెహ్వాగ్ తర్వాత టీమిండియాకు దొరికిన మరో అద్భుతమైన ఓపెనర్ అనగానే చాలామంది రోహిత్ శర్మ పేరు చెబుతారు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీతో ఓపెనర్ గా మారిన రోహిత్ శర్మ.. ప్రస్తుతం టీమిండియా పరిమిత ఓవర్ల ఫార్మాట్ కు కెప్టెన్ గానూ వ్యవహరిస్తున్నాడు. ఐపీఎల్ లో ముంబయి జట్టు కెప్టెన్ గా ఉన్నాడు. బ్యాటర్ గా ఎన్నో అద్భుతమైన రికార్డులు సృష్టించిన రోహిత్ శర్మ.. ఫ్యామిలీ, లగ్జరీ లైఫ్ కి అంతే ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాడు. అందుకే మ్యాచ్ లు లేని టైంలో భార్య రితిక, కూతురు సమీరతో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు. ఇక రోహిత్ దగ్గర BMW M5 కారు ఉంది. దీని ఖరీదు రూ.1.5 కోటలు. ఇది మాత్రమే కాదు BMW X3, స్కోడా లారాతోపాటు పలు కాస్ట్ లీ కార్స్ ఉన్నాయి.
టీమిండియాకు ఆడిన స్టైలిష్ బ్యాటర్లలో సురేశ్ రైనా కచ్చితంగా ఉంటాడు. ధోనీ కెప్టెన్ గా ఉన్నప్పుడు అన్ని ఫార్మాట్లలోనూ కనిపించిన రైనా.. ధోనీతోపాటు రిటైర్మెంట్ కూడా ప్రకటించాడు. ఐపీఎల్ లోనూ ధోనీ కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఆడి, ఈ టోర్నీ చరిత్రలోనే గ్రేటెస్ట్ బ్యాటర్ గా పేరు సంపాదించాడు. క్రికెట్ గురించి పక్కనబెడితే.. భారత రిచెస్ట్ క్రికెటర్లలో రైనా ఉంటాడు. ప్రస్తుతం ఇతడి దగ్గర పోర్స్ బాక్స్ టర్ ఎస్ అనే మోడల్ ఖరీదైన కారు ఉంది. ఇది కేవలం 4.7 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇక తనకు అచ్చొచ్చిన పసుపు రంగు కారుని కొన్నాడు. దీని ఖరీదు రూ.94 లక్షలు.
దినేశ్ కార్తిక్.. ధోనీలానే వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ అయినప్పటికీ పెద్దగా గుర్తింపు అయితే తెచ్చుకోలేకపోయాడు. టీమిండియాకు రెగ్యులర్ వికెట్ కీపర్ గా ధోనీ పర్మినెంట్ అయిపోవడంతో దినేశ్ కార్తిక్ కి పెద్దగా అవకాశాలు రాలేదు. ఇక అంతా అయిపోయింది అనుకునే స్టేజీలో అంటే గత రెండు మూడేళ్ల నుంచి ఐపీఎల్ లో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ మధ్య టీమిండియాలోకి కూడా రీఎంట్రీ ఇచ్చాడు. కానీ ప్లేస్ మాత్రం పర్మినెంట్ చేసుకోలేకపోయాడు. ఇక దినేశ్ కార్తి దగ్గర పోర్స్ కైమన్ S అనే కాస్ట్ లీ కారు ఉంది. 4.9 సెకన్లలోనే ఇది 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. కార్తిక్ దగ్గర సిల్వర్ కలర్ మోడల్ ఉంది. దీని ఖరీదు రూ.81 లక్షలు.
వన్డేల్లో టీమిండియాకు ఆడిన మంచి ఓపెనర్లలో శిఖర్ ధావన్ ఉంటాడు. రోహిత్ శర్మతో కలిసి ఇతడు ఆడిన ఎన్నో ఇన్నింగ్సులు, అభిమానుల గుండెల్లో ఇప్పటికీ పదిలంగా ఉంటాయి. ఇక ఐసీసీ టోర్నీల్లో అయితే ధావన్ ని అస్సలు ఆపలేం. అంత అద్భుతంగా ఆడతాడు. ప్రస్తుతం ఐపీఎల్ లో పంజాబ్ జట్టుకు ఆడుతున్న ధావన్.. లైఫ్ ని కూడా చాలా లగ్జరీగా గడుపుతుంటాడు. ఖరీదైన కార్లు కూడా మనోడి దగ్గర ఉన్నాయి. ఇంకా ఇంకా కొంటూనే ఉన్నాడు కూడా. ప్రస్తుతం ధావన్ దగ్గర మెర్సిడెజ్ GL 350 CDI అనే ఖరీదైన SUV కారు ఉంది. దీని ధర రూ.80 లక్షలు. ఇది గరిష్ఠంగా 220 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.