క్రికెట్ ప్రపంచంలో అందులోనూ పొట్టి క్రికెట్ లో సురేశ్ రైనాకు ప్రత్యేక స్థానం ఉంది. టీ20 క్రికెట్ చరిత్రలో సురేశ్ రైనా టీమిండియా విజయాల్లో ఎంతో కీలక పాత్ర పోషించాడు. అటు ఐపీఎల్ గురించి తీసుకున్నా రైనాకు ఎన్నో అద్భుతమైన రికార్డులు ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున రైనా ఐపీఎల్ లో కురిపించిన పరుగుల వర్షం అభిమానులు ఇప్పటికీ మర్చిపోలేరు. ధోనీ ఇండియన్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన కాసేపటికే ఈ చిన్న తలా కూడా క్రికెట్ కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. కానీ, సురేశ్ రైనా క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని చెప్పే ఘటన ఒకటి జరిగింది.
విషయం ఏంటంటే.. సురేశ్ రైనా క్రికెట్ కు దూరమైనా కూడా అతని ఫ్యాన్ బేస్ నానాటికీ పెరుగుతూనే ఉంది తప్ప తగ్గలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో సురేశ్ రైనా ఓ ఘనత సాధించాడు. అదేంటంటే ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ ఖాతాల్లో 20 మిలియన్ కు పైగా ఫాలోవర్లు కలిగిన క్రికెటర్ గా సురేశ్ రికార్డు సృష్టించాడు. అంతేనా అని అనకండి.. ఆ విషయంలో ఎంఎస్ ధోనీకంటే సురేశ్ రైనానే ముందున్నాడు మరి.
Can’t believe we have reached #20Million 💥, it is so overwhelming to see all the love you all have been showering on me. I want to thank each one of you for your continuous support.
Lots of Love ❤️— Suresh Raina🇮🇳 (@ImRaina) May 30, 2022
ధోనీకి ఇన్ స్టాగ్రామ్ లో 38.5 మిలియన్ ఫాలోవర్లు ఉండగా.. ట్విట్టర్ లో మాత్రం కేవలం 8.4 మిలియన్ ఫాలోవర్లు మాత్రమే ఉన్నారు. సురేశ్ రైనాకి మాత్రం అటు ఇన్ స్టాగ్రామ్, ఇటు ట్విట్టర్ రెండు ఖాతాల్లో 20 మిలియన్ కు పైగా ఫాలోవర్లు ఉన్నారనమాట. 20 మిలియన్ కు పైగా ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్లు కలిగిన లిస్ట్ లో విరాట్ కోహ్లీ, సచిన్ టెండుల్కర్, రోహిత్ శర్మ తర్వాతి స్థానంలో సురేశ్ రైనానే ఉన్నాడు.
ఇంక క్రికెట్ విషయానికి వస్తే.. ఐపీఎల్ 2022 సీజన్లో సురేశ్ రైనాకు ఎంత ఘోర అవమానం జరిగిందో అందరికీ తెలిసిందే. రైనా చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ చేసుకోకపోగా వేలంలోనూ కొనుగోలు చేయలేదు. అంతేకాకుండా మెగా వేలంలో అమ్ముడబోని అటగాడిగా సురేశ్ రైనా మిగలడం అభిమానులను ఎంతో బాధకు గురిచేసింది. చెన్నై సూపర్ కింగ్స్ సురేశ్ రైనాను పక్కన పెట్టినా కూడా చెన్నై మ్యాచ్ రోజు సురేశ్ రైనా సపోర్ట్ చేస్తూ సందడి చేయండ చూశాం.
— Suresh Raina🇮🇳 (@ImRaina) June 1, 2022
ఆ తర్వాత వ్యాఖ్యతగా మారి సురేష్ రైనా సీజన్ ను కొనాసాగించాడు. మ్యాచ్ లు లేకపోయినా సురేశ్ రైనా ఫిట్ గా ఉండేందుకు కసరత్తులు చేస్తున్నాడు. సురేశ్ రైనా వర్కౌట్స్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి, వచ్చే సీజన్లో అయినా సురేశ్ రైనా కంబ్యాక్ చేస్తాడేమో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. సురేశ్ రైనా సాధించిన ఘనతపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.