ఉపఖండపు పిచ్ ల మీద ఆసియా కప్ జరుగుతున్నా.. టీమిండియా లెగ్ స్పిన్నర్ చాహల్ కి 17 మందిలో చోటు లభించలేదు. ఈ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ.. చాహల్ వరల్డ్ కప్ ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయని చెప్పుకొచ్చాడు.
ఆసియా కప్ కోసం కొన్ని గంటల క్రితం భారత జట్టుని ప్రకటించిన సంగతి తెలిసిందే. సోమవరం ఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో ఈ జట్టుని ఖరారు చేశారు. ఈ మీటింగ్ లో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు .. కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా పాల్గొన్నాడు. 17 మందిని సెలక్ట్ చేసిన ఈ స్క్వాడ్ లో తొలిసారి తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు చోటు దక్కడం విశేషం. ఇదిలా ఉంటే లెగ్ స్పిన్నర్ చాహల్ కి స్థానం లభించకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఉపఖండపు పిచ్ ల మీద ఈ టోర్నీ జరుగుతున్న చాహల్ కి 17 మంది ప్రాబబుల్స్ లో చోటు దక్కకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఈ విషయంపై తాజాగా సెలక్టర్ అజిత్ అగార్కర్ క్లారిటీ ఇవ్వగా.. రోహిత్ శర్మ మాత్రం చాహల్ వరల్డ్ ఆశలు ఇంకా సజీవంగా ఉన్నాయని చెప్పుకొచ్చాడు.
ఆసియా కప్ కి ఎంపికైన వారే దాదాపు ప్రపంచ కప్ ఆడటం ఖాయం. ఈ విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో ఎప్పటిలాగే ఈ సారి చాహల్ కి నిరాశే ఎదురైంది అనుకున్నారు. అయితే ఆసియా కప్ లో సెలక్ట్ కాకపోయినా వరల్డ్ కప్ లో ఇంకా ఆశలు సజీవంగానే ఉంటాయని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ తో మాట్లాడిన హిట్ మ్యాన్.. అశ్విన్, సుందర్ అవకాశాలు కూడా అలాగే ఉన్నాయని తెలియజేశాడు. ” 17 మందికి మాత్రమే జట్టులో చోటు ఉంది. అందుకే చాహల్ ని జట్టులోకి సెలక్ట్ చేయలేదు. చాహల్, అశ్విన్, సుందర్ లతో పాటు ఏ ఒక్కరికీ దారులు మూసుకుపోలేదు” అని అందరికి వరల్డ్ కప్ కి ఇంకా అవకాశం ఉందని పేర్కొన్నాడు.
ప్రస్తుతం చాహల్ ఏమంత గొప్ప ఫామ్ లో లేడు. ఇటీవలే జరిగిన విండీస్ సిరీస్ లో చాహల్ విఫలం కాగా.. మరోవైపు సహచర స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అంచనాలకు మించి రాణించాడు. దీంతో ఆసియా కప్ లో కుల్దీప్ కి స్థానం దక్కగా చాహల్ పై వేటు పడింది. కొన్ని నెలలుగా గాయాలతో ఇబ్బంది ఎదుర్కొంటున్న శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ తిరిగి టీమిండియాలో స్థానం సంపాదించుకోగా.. ప్రసిద్ కృష్ణ కూడా రీ ఎంట్రీ ఇచ్చాడు. మొత్తానికి ఆసియా కప్ కి సెలక్ట్ కానీ చాహల్ వరల్డ్ కప్ లో స్థానం ఆశించడం అత్యాశే అవుతుంది. అదే జరిగితే ఈ లెగ్ స్పిన్నర్ కి మరోసారి అన్యాయం చేసినట్టే అవుతుంది. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.