విరాట్ కోహ్లీ…… ఈ పేరు వింటేనే ప్రత్యర్థి బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి అనడంలో అతిశయోక్తిలేదు. అందుకే అభిమానులు కోహ్లీని ముద్దుగా ‘రన్ మెషిన్’ అని పిలుచుకుంటారు. రికార్డులు అతనికి దాసోహం అవుతాయి. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు అందరి చూపూ అతని వైపే. చాలా మ్యాచుల్లో అతను కీ రోల్ పోషించి జట్టుకు విజయాల్ని అందించాడు. ఇదంతా ఒకప్పటి కోహ్లీ. కానీ.. గత కొంత కాలంగా అతని ఆట చూస్తే నిజంగా ఇతను మునుపటి కోహ్లీనేనా అనే సందేహాం కలగక మానదు.
ఇంగ్లాండ్ తో జరిగిన రీషెడ్యూల్డ్ టెస్ట్ మ్యాచ్ లో దారుణంగా విఫలమైయ్యాడు. రెండు ఇన్నింగ్సుల్లో కలిపి కేవలం 31 పరుగులే చేశాడు. ఇటివల జరిగిన టీ20ల్లో సైతం విఫలం అయ్యి విమర్శలు ఎదుర్కొంటున్నాడు. కపిల్ దేవ్ సైతం విరాట్ ని టీ20ల్లో నుంచి తప్పించాలని సూచించాడు. తాజాగా దీనిపై కెప్టెన్ రోహిత్ శర్మ ఘాటుగా స్పందించాడు. కోహ్లీకి అండగా నిలిచాడు.
Rohit Sharma “We will back Virat Kohli. He has been consistent for a long time. We believe in his quality” pic.twitter.com/7pmunk9QBM
— Subhayan Chakraborty (@CricSubhayan) July 10, 2022
మూడో టి20లో 17 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ గెలిచింది. తర్వాత జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో రోహిత్ మాట్లాడుతూ.. ” కోహ్లీ ఫామ్ పై మాకు పూర్తి నమ్మకం ఉంది, అతని గురించి బయటివారికి ఏం తెలుసు… అసలు జట్టులో ఏం జరుగుతుందో బయటి వారికి ఎలా తెలుస్తుంది, మేం ప్రపంచ కప్ లక్ష్యంగా ఒక జట్టును తయారుచేస్తున్నాం. నాకు క్రికెట్ ఎక్స్ పర్ట్స్ అంటే ఎవరో తెలియదు” అని కపిల్ వ్యాఖ్యలను ఉద్దేశిస్తు రోహిత్ స్పందించాడు.
‘If Ashwin can be dropped from Test, why can’t Virat be dropped from T20Is’, says Kapil Devhttps://t.co/laPG4AXUp2@imVkohli #INDvsENG #indvsengt20 pic.twitter.com/y45KeNh0eR
— Sports Tak (@sports_tak) July 8, 2022
ఒక ఆటగాడు ఫామ్ కోల్పోవడం, మళ్లి తిరిగి ఫామ్ లోకి రావడం సహజంగానే జరుగుతూఉంటుంది. ప్రతీ ఆటగాడి జీవితంలో అది సహజమే. అలాంటప్పుడు మనమందరం అతనికి అండగా నిలవాలి గానీ.. ఇలా విమర్శలు చేయడం తగదని రోహిత్ శర్మ సూచించాడు. జట్టు ప్రణాళికల్లో భాగంగానే కోహ్లీ దూకుడుగా ఆడాడని ఓ విలేకరి ప్రశ్నకు బదులిచ్చాడు. ప్రణాళికలో భాగంగానే జట్టు సభ్యులు దూకుడుగా ఆడుతున్నారని.. భవిష్యత్ లోనూ ఇదే విధంగా ఆడుతామంటూ రోహిత్ వ్యాఖ్యానించాడు.
అలాగే కోహ్లీ ఒక లెజెండ్ అని, మళ్లీ తన దూకుడు కొనసాగిస్తాడని ఆశా భావం వ్యక్తం చేశాడు. అయితే.. రోహిత్ శర్మ చేసిన ఈ వ్యాఖ్యలు కపిల్ దేవ్ ను ఉద్దేశించే అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీ20ల నుంచి విరాట్ ను తప్పించాలంటూ కపిల్ చేసిన వ్యాఖ్యలకు ఇది కౌంటర్ అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. మరి.. రోహిత్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Rohit Sharma opens up about Virat Kohli’s continuous failure with the bat.@ImRo45 @imVkohli #ViratKohli #RohitSharma𓃵 #ENGvIND
[T60] pic.twitter.com/BkAgcEhsWn
— RevSportz (@RevSportz) July 10, 2022