న్యూజిలాండ్ టూర్ ఆఫ్ ఐర్లాండ్-2022లో భాగంగా జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ చావు తప్పి కన్ను లొట్టపోయిన చందాన మ్యాచ్ లో గెలుపొందింది. ఒకానొక సమయంలో న్యూజిలాండ్ కి ఐర్లాండ్ ప్లేయర్లు ఓటమి భయాన్ని చూపించారు. తాము ఎల్లకాలం పసికూనలు కాదనే సందేశాన్ని యావత్ క్రికెట్ ప్రపంచానికి చేరవేశారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్.. ఐర్లాండ్ బ్యాటర్లను కట్టడి చేయడంలో విఫలమైందనే చెప్పాలి. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేశారు. హ్యారీ టెక్టర్(117 బంతుల్లో 113 పరుగులు), కర్టిస్(47 బంతుల్లో 43 పరుగులు) రాణించారు. 301 విజయలక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ బ్యాటర్లకు టార్గెట్ రీచ్ కావడం అంత తేలిక కాలేదు. ఓపెనర్లలో గప్టిల్(61 బంతుల్లో 51 పరుగులు) మాత్రమే ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన ఐదుగురు బ్యాటర్లు నిరాశ పరిచారు. Take a bow @braceyourself10! Guiding the team home in Malahide with his maiden international century! 127* from just 82 balls. Scorecard | https://t.co/n2gYsV2FnT #IREvNZ pic.twitter.com/YeBtFXiB4l — BLACKCAPS (@BLACKCAPS) July 10, 2022 మైకేల్ బ్రేస్ వెల్ విజృంభించడంతో న్యూజిలాండ్ విజయం సాధించింది. అతను టెయిలెండర్లను అడ్డుపెట్టుకుని స్ట్రైకింగ్ తీసుకుంటూ ఆఖరి వర్ వరకు మ్యాచ్ ని లాక్కొచ్చాడు. ఆఖరి ఓవర్లో మైకేల్ ఆడిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. లాస్ట్ ఓవర్లో మైకేల్ 24 పరుగులు చేసి న్యూజిలాండ్ కు విజయాన్ని కట్టబెట్టాడు. Heartbreak at the death, but what a game of cricket Congratulations to New Zealand, who take the first ODI by one wicket, and Michael Bracewell for his unbeaten century. SCORE: https://t.co/iHiY0U5y7J#BackingGreen | #Exchange22 | #ABDIndiaSterlingReserve ☘️ pic.twitter.com/DZ8SocwH72 — Cricket Ireland (@cricketireland) July 10, 2022 ఆఖరి ఓవర్ వేసేందుకు వచ్చిన క్రైగ్ యంగ్ కు మైకేల్ చుక్కలు చూపించాడు. తొలి బంతి నుంచి బౌండిరీలు బాది ఔరా అనిపించాడు. వరుస 5 బంతుల్లో 4, 4, 6, 4, 6 కొట్టి టీమ్ గెలిపించాడు. వన్డే హిస్టరీలో మైకేల్ ఓ అద్భుతమైన ఇన్నింగ్స్ ని నమోదు చేశాడంటూ ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం మైకేల్ ఆడిన ఆఖరి ఓవర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మైకేల్ ఇన్నింగ్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. View this post on Instagram A post shared by Spark Sport (@sparknzsport) ఇదీ చదవండి: బౌలర్ కు చుక్కలు..ఒకే ఓవర్లో ఐదు సిక్సులు,ఒక ఫోర్ తో విధ్వంసం! ఇదీ చదవండి: విరాట్ కోహ్లీకి మరో ఎదురుదెబ్బ.. యాడ్స్ నిలిపివేత!