టీమిండియా టూర్ ఆఫ్ ఇంగ్లాండ్-2022లో భాగంగా జరిగిన టీ20 సిరీస్ ను భారత్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. సిరీస్ వైట్ వాష్ చేద్దామని ఉర్రూతలూగిన భారత్ జోరుకు మూడో టీ20లో ఇంగ్లాండ్ కళ్లెం వేసింది. ఆఖరి మ్యాచ్ ని గెలిచి వైట్ వాష్ నుంచి తప్పించుకుని ఇంగ్లాండ్ జట్టు పరువు కాపాడుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. డేవిడ్ మలాన్(39 బంతుల్లో 77), లివింగ్ స్టోన్(29 బంతుల్లో 42) చెలరేగడంతో ఇంగ్లాండ్ 215 పరుగులు చేయగలిగింది. రవి భిష్ణోయ్, హర్షల్ పటేల్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఉమ్రాన్ మాలిక్ మాత్రం చాలా ఎక్స్ పెన్సివ్ గా మారాడు. 4 ఓవర్లలో 1 వికెట్ పడగొట్టి 56 పరుగులు కన్సీడ్ చేశాడు. జడేజా 4 ఓవర్లు వేసి వికెట్ లేకుండా 45 పరుగులు ఇచ్చాడు. . . . . . . . . ! Winners of the #ENGvIND T20I series. Congratulations #TeamIndia! pic.twitter.com/idKTT3gfdO — BCCI (@BCCI) July 10, 2022 బ్యాటింగ్ విషయానికి వస్తే.. రోహిత్(12 బంతుల్లో 11), విరాట్ కోహ్లీ(6 బంతుల్లో 11) మరోసారి అభిమానులను నిరాశకు గురి చేశారు. శ్రేయాస్ అయ్యర్(28) పర్వాలేదనిపించాడు. పంత్(5 బంతుల్లో 1 పరుగు) కూడా విఫలమయ్యాడు. మూడో టీ20లో ఒక్క సూర్య కుమార్ యాదవ్ మాత్రమే అద్భుతంగా రాణించాడు. 55 బంతుల్లో 14 ఫోర్లు, 6 సిక్సుల సాయంతో 117 పరుగులు చేశాడు. GET IN We win a thriller in Nottingham! Scorecard/clips: https://t.co/AlPm6qpMEL #ENGvIND pic.twitter.com/nvwmpSXqlV — England Cricket (@englandcricket) July 10, 2022 ఈ ఒక్క మ్యాచ్ లోనే కాదు.. జట్టుకు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు సూర్యకుమార్ యాదవ్ నేనున్నానే భరోసాను కల్పిస్తూనే ఉన్నాడు. ప్రతి మ్యాచ్ లో తన బెస్ట్ ఇచ్చేందుకు కృషి చేస్తున్నాడు. జట్టులో సూర్య కుమార్ యాదవ్ మిడల్ ఆర్డర్ బెర్త్ కన్ఫామ్ చేసుకున్నాడే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా రానున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ తుది జట్టులో స్కై ఉంటాడనే వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. సూర్య కుమార్ యాదవ్ ప్రదర్శనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. Suryakumar Yadav 100 Moment!! The 5th Indian Batsman to Score 100 in T20Is for India ! What an outstanding inning this is, deserved to get that 100! ♥️ @surya_14kumar Exceptional Talent! #TeamIndia #suryakumaryadav pic.twitter.com/XYf94A930P — Bunny (@Bunny_sidh) July 10, 2022 Whatta Innings.... SAVIOUR ❤️SKY @surya_14kumar #SuryaKumarYadav #INDvENG #HallyuPopFest #HallyuPopFest2022 #ENGvsIND pic.twitter.com/CVzxp5yqDb — Nikita jamwal (@Nikitajamwal22) July 11, 2022 ఇదీ చదవండి: న్యూజిల్యాండ్ ఓటమి ఖాయం అనుకున్న వేళ చివరి ఓవర్ లో అద్భుతం! ఇదీ చదవండి: బౌలర్ కు చుక్కలు..ఒకే ఓవర్లో ఐదు సిక్సులు,ఒక ఫోర్ తో విధ్వంసం!