హైదరాబాదీ క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ కు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) గుడ్ న్యూస్ చెప్పింది. టెస్ట్‌లతో పాటు.. పరిమిత ఓవర్ల సిరీస్‌ల్లోనూ నిలకడగా రాణిస్తున్నందున ప్రమోషన్ ఇచ్చింది. ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్టుల్లో ఇప్పటివరకు ‘సీ’ గ్రేడ్‌లో కొనసాగుతోన్న సిరాజ్‌ను ‘బీ’ గ్రేడ్‌కు మార్చింది. ఇక సీనియర్లకు కష్టాలు ఇప్పట్లో వదిలేలాలేవు. జట్టులో స్థానం కోల్పోయి.. పరుగులు చేయడానికి కష్టాలు పడుతుంటే బీసీసీఐ మాత్రం మరోవైపు చర్యలకు ఉపక్రమిస్తోంది. ఎంత సీనియర్లయినా ఫామ్ కోల్పోతే ఉపేక్షించేది లేదని ఇటీవల జట్టు ఎంపికలోనే సంకేతాలు ఇచ్చిన బీసీసీఐ.. కాంట్రాక్టుల విషయంలోనూ ఇదే విషయాన్ని స్పష్టం చేసింది.
జట్టులో మీ స్థానాలు పదిలం.. సీనియర్ల విషయంలో బీసీసీఐ బయటకి చెప్పే మాట. మరి లోపల.. ఆశించినంతగా రాణించకుంటే చర్యలు తప్పవు.. యువ ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు.. మిమ్మల్ని భరించలేం. ఇలా ఉంది బీసీసీఐ తీరు. ఫామ్ కోల్పోయి పరుగుల చేయడంలో అష్టకష్టాలు పడుతున్న సీనియర్ల విషయంలో భరోసాగా ఇవ్వాల్సిన బీసీసీఐ పెద్దలు చర్యలు చేపట్టారు. శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు జట్టులో చోటు కోల్పోయిన సీనియర్ ఆటగాళ్లు చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, ఇషాంత్ శర్మలను సెంట్రల్ కాంట్రాక్టులో ‘ఎ’ గ్రేడ్ నుంచి ‘బి’ గ్రేడ్‌కు డీమోట్ చేసింది. ఈ మేరకు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులకు బోర్డు అపెక్స్ కౌన్సిల్ బుధవారం (ఫిబ్రవరి 2) ఆమోదం తెలిపింది.
‘ఏ’ కేటగిరిలో ఐదుగురే..
గతేడాది వరకు ‘ఎ’ గ్రేడ్‌లో కొనసాగిన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, ఓపెనర్ శిఖర్ ధావన్ ఏకంగా ‘సి’ గ్రేడ్‌కి పడిపోయారు. గతేడాది ‘ఎ’ గ్రేడ్‌లో పదిమంది చోటు దక్కించుకోగా.. ఈసారి ఐదుగురికి పరిమితయ్యారు. కేఎల్ రాహుల్ రాహుల్, మహమ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, రిషభ్ పంత్ మాత్రమే అందులో కొనసాగుతున్నారు. వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ వృద్ధిమాన్ సాహాకు ‘సి’ కాంట్రాక్టు ఇచ్చారు. నిలకడగా రాణించలేకపోతున్న మయాంక్ అగర్వాల్ ‘బి’ గ్రేడ్ నుంచి ‘సి’ గ్రేడ్‌కి డిమోట్ అయ్యాడు.
రూ.7 కోట్ల వార్షిక వేతనం పొందే ‘ఎ+’ విభాగంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా కొనసాగుతున్నారు. మహిళా క్రికెటర్ల కాంట్రాక్టులను సైతం బీసీసీఐ ఖరారు చేసింది. ఇప్పటికే హర్మన్‌ప్రీత్, స్మృతి మంధాన, పూనమ్ యాదవ్ ఉన్న గ్రూప్ ‘ఎ’లోకి కొత్తగా దీప్తి శర్మ, రాజేశ్వరి గైక్వాడ్‌లను చేర్చారు. వీరికి వార్షిక వేతనం రూ.50 లక్షలు. రూ.30 లక్షల ‘బి’ విభాగంలో మిథాలి రాజ్, జులన్ గోస్వామి కొనసాగుతున్నారు. జెమీమా రోడ్రిగ్స్ ‘బి’ గ్రేడ్ నుంచి ‘సి’ గ్రేడ్ (రూ.10 లక్షలు)కి డిమోట్ అయింది.
గ్రేడ్ A+: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా
గ్రేడ్ A: రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, రిషబ్ పంత్, KL రాహుల్, మహ్మద్ షమీ
గ్రేడ్ B: చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, శ్రేయాస్ అయ్యర్, మహ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మ.
గ్రేడ్ C: సూర్యకుమార్ యాదవ్, ఉమేష్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, హనుమ విహారి, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, శుభ్‌మన్ గిల్, శిఖర్ ధావన్, యుజ్వేంద్ర చాహల్, వృద్ధిమాన్ సాహా, మయాంక్ అగర్వాల్.
@BCCI is set to announce central contracts for 2022-23 season.
According to reports, 🚨#KLRahul remains in the Grade A list.I think KL deserves to be in Grade A+ contract because he’s one of the best batsman in current time & he’s the permanent VC of India in all formats. 😕 pic.twitter.com/eszVWBsgUX
— Juman (@cool_rahulfan) March 2, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App ని డౌన్లోడ్ చేసుకోండి.