‘ఇంతింతై వటుడింతై’ అన్న మాదిరిగా అంతర్జాతీయ క్రికెట్ లో ఓ వెలుగు వెలిగిన పరుగుల యంత్రం విరాట్ కోహ్లి ప్రభంజనం నెమ్మదిగా మసకబారుతోంది. ఫామ్ కోల్పోయి సుమారు గత మూడేండ్లలో ఒక్క సెంచరీ కూడా చేయని విరాట్.. తాజాగా ఐసీసీ విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్ లో దారుణంగా పడిపోయాడు. టాప్-10 నుంచి నిష్క్రమించాడు.
స్వదేశంలో జరిగిన ఐపీఎల్ టోర్నీలో దారుణంగా విఫలమైన విరాట్ కోహ్లీ.. విశ్రాంతి అనంతరం బ్యాట్ ఝులిపిస్తాడని ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండుతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 11 పరుగులు చేసిన కోహ్లి.. రెండో ఇన్నింగ్స్‌లో 20 పరుగులకు అవుట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో కోహ్లి ర్యాంకు నాలుగు స్థానాలు దిగజారింది. దీంతో అతడు టాప్-10లో కూడా చోటు దక్కించుకోలేకపోయాడు. ఈ క్రమంలో కోహ్లి 714 పాయింట్లతో 13వ స్థానంలో నిలిచాడు. కాగా గత ఆరేళ్లలో కోహ్లి టాప్-10 ర్యాంకు కూడా సాధించలేకపోవడం ఇదే తొలిసారి. 2016 నవంబర్ నుంచి కోహ్లి టాప్-10 లో భాగమయ్యాడు. ఈ జాబితాలో అతడు ఏకంగా 2,053 రోజులున్నాడు.
Virat Kohli’s latest ICC rankings:
ODIs – 3rd
Tests – 13th
T20Is – 21stHigh time for ICC cricketer of the decade to make a strong comeback.#ViratKohli #ENGvIND pic.twitter.com/IQT2ioln4l
— CricTracker (@Cricketracker) July 6, 2022
ఇది కూడా చదవండి: Rahul Dravid: ఇంగ్లండ్ గెలుపు మంత్రంగా చెబుతున్న ‘Bazball’ క్రికెట్‌పై ద్రవిడ్ రియాక్షన్ వైరల్!
ఇలా ‘రన్‌మెషీన్’ స్థాయి రోజురోజుకూ పడిపోవడంపై టీమిండియా అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘కోహ్లి.. నీకే ఎందుకిలా జరుగుతోంది. ఇకనైనా బ్యాట్ ఝులిపించు’ అని విజ్ఞప్తి చేస్తున్నారు.
Bring Back the old Monster @imVkohli pic.twitter.com/r9YvgcMIJB
— V I P E R™ (@VIPERoffl) July 6, 2022
ఇక ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో సెంచరీ (146), హాఫ్ సెంచరీ (57) తో ఆకట్టుకున్న టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఈ జాబితాలో ఐదు స్థానాలు ఎగబాకి 801 పాయింట్లతో 5వ స్థానంలో నిలిచాడు. టాప్-10లో భారత రెగ్యులర్ సారథి రోహిత్ శర్మ ఒకస్థానం దిగజారి తొమ్మిదో స్థానానికి పడిపోయాడు.
New updates in ICC Test rankings:
Joe Root stays at the top, Rishabh Pant jumps to No. 5, Jonny Bairstow breaks into top 10.
Virat Kohli out of top 10 rankings for the first time after six years. #JoeRoot #RishabhPant #ViratKohli #ICC pic.twitter.com/DZua8JT63P
— CricTracker (@Cricketracker) July 6, 2022
ఇక బౌలర్లలో ఆసీస్ టెస్టు సారథి పాట్ కమిన్స్ 900 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. అశ్విన్ (842 పాయింట్లు) రెండో స్థానంలో నిలవగా మిగిలిన భారత బౌలర్లెవరూ టాప్-10లో లేరు. ఆల్ రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా (384), అశ్విన్ (335) తొలి రెండు స్థానాల్లో నిలిచారు. మునుపటిలా కోహ్లీ మళ్లీ ఘర్జించాలంటే ఏం చేయాలో.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: వెస్టిండీస్ టూర్ కి మరో కొత్త కెప్టెన్! ద్రవిడ్, గంగూలీపై పై ఫ్యాన్స్ ఫైర్!