భారత్-ఇంగ్లండ్ మధ్య బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన రీషడ్యూల్డ్ టెస్టులో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌ను 2-2తో సమం చేసింది. తొలి మూడు రోజులు పైచేయి సాధించిన భారత్.. విజయం సాధించేలా కనిపించింది. కానీ.. నాలుగురోజు ఇంగ్లండ్ మ్యాచ్ మొత్తాన్ని తమవైపు తిప్పుకుంది. జో రూట్, జానీ బెయిర్‌స్టో అద్భుత బ్యాటింగ్‌తో ఇంగ్లండ్ ఏకంగా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఓటమి తప్పదనుకున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలుపుకు వారి ఫియర్లెస్ బ్యాటింగ్ కారణమని క్రికెట్ నిపుణులు అంటున్నారు. ఈ అభిప్రాయాన్ని బలపరుస్తూ.. టెస్టుల్లో వేగంగా ఆడాలనే ఒక కొత్త వ్యూహాన్ని నమ్మినట్లు ఇంగ్లండ్ ఆటగాళ్లు సైతం చెబుతున్నారు. భారత్‌తో టెస్టు కంటే ముందు ఇంగ్లండ్, న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్ ఆడింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ న్యూజిలాండ్‌ను ఆ సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఈ సిరీస్‌తోనే ఇంగ్లండ్‌కు కొత్త కోచ్‌గా బ్రాండెన్ మెకల్లమ్, కొత్త కెప్టెన్‌గా బెన్‌స్టోక్స్ నియమితులయ్యారు. ఈ ఇద్దరిది దూకుడు స్వభావమే కావడంతో ఆటలో కూడా అలాంటి ఎటాకింగ్ స్ట్రాటజీలనే అమలు చేసి సక్సెస్ అయ్యారు. దానికి వారు బేస్‌బాల్ క్రికెట్ స్ట్రాటజీని పేరుపెట్టుకున్నారు. భారత్‌పై కూడా ఇదే స్ట్రాటజీని అమలు చేస్తామని ఇంగ్లండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్ టెస్టు మ్యాచ్ కంటే ముందే ప్రకటించాడు. అనుకున్నట్లుగానే బెయిర్‌స్టో టెస్టు వన్డే తరహాలో ఆడి ఇంగ్లండ్‌ను గెలిపించాడు. కాగా.. ఇంగ్లండ్ అనుసరించిన ఈ Bazball(బ్రాండెన్ మెకల్లమ్ స్ట్రాటజీ) స్ట్రాటజీపై మ్యాచ్ అనంతరం భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌ను విలేకర్లు ప్రశ్నించగా.. ‘నిజంగా నాకు దాని గురించి తెలియదు’ అని సమాధానం ఇచ్చాడు. దీనికి అక్కడున్న వారంత నవ్వుకున్నారు. ఇంగ్లండ్‌ను సక్సెస్ బాటలో నడిపిస్తున్న స్ట్రాటజీని ద్రవిడ్ నవ్వులాటగా తీసుకున్నాడంటూ సోషల్ మీడియాలో ద్రవిడ్ వీడియో వైరల్‌గా మారింది. ఇంగ్లండ్ అనుసరించిన Bazball వ్యూహాన్ని ద్రవిడ్ అంత సీరియస్‌గా తీసుకున్నట్లు కనిపించడం లేదని క్రికెట్ అభిమానులు పేర్కొంటున్నారు. మరి ఈ విషయం ద్రవిడ్‌కు నిజంగానే తెలియదా? లేక ఇదో వేస్ట్ స్ట్రాటజీ అని కొట్టిపారేసేలా అలా మాట్లాడి ఉంటడా? అనేది అతనికే తెలియాలి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. pic.twitter.com/CopF6Bqks0 — Guess Karo (@KuchNahiUkhada) July 5, 2022