వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో కాల్ వ్యవహారం ఏపీలో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ వీడియో ఒరిజినల్ కాదని.. పోలీసులు వెల్లడించారు. కానీ దీనిపై విపక్షాలు మాత్రం విమర్శలు చేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై మాజీ మంత్రి కొడాలి నాని విరుచుకుపడ్డారు. వీడియో ఫేక్ అని చెప్పినా.. టీడీపీ రాద్ధాంతం చేయడం సిగ్గు చేటు అన్నారు. వీడియోలో ఉన్నది తాను కాదని మాధవ్ చెబుతున్నా.. అది ఆయనదే అని టీడీపీ, ఎల్లో మీడియా ఆరోపిస్తోంది.. మాధవ్‌ది పట్టుకుని వేలాడుతున్నారు ఎందుకు అని ప్రశ్నించాడు. లింగ పరిశోధనలో నిష్ణాతులైన టీడీపీ వాళ్లు.. రాష్ట్రంలో ఏది ఎవరిదో కూడా తేల్చి ఐడీ కార్డులు ముద్రిస్తారా అని విరుచుకుపడ్డారు.
ఈ వీడియోలో కనిపిస్తోంది వైసీపీ నేతల ముఖాలు మాత్రమే.. మిగతా శరీరంఅంతా టీడీపీ నేతలదే అన్నారు నాని. ఫేక్ వీడియో తయారు చేసి దాన్ని అప్‌లోడ్ చేసే ధైర్యం చంద్రబాబు, లోకేష్‌లకు లేదని ఎద్దేవా చేశారు. తెలుగు మహిళలు, తెలుగు యువత,తెలుగు వృద్ధులంతా కలిసి వచ్చిన వైసీపీని ఏం చేయలేరని కొడాలి నాని స్పష్టం చేశారు. వీడియోలో ఉన్నది తాను కాదని మాధవ్ చెప్తున్నా.. సిగ్గులేని టీడీపీ నేతలు ఇంకా వాదిస్తున్నారని.. వీడియోలో ఉన్నది, మాధవ్‌కి ఉన్నది ఒకటేనా కాదా అని డిబెట్లు పెడుతున్నారని నాని ఎద్దేవా చేశారు. ప్రజల సమస్యలు గాలికి వదిలేసి.. ఏది ఎవరిదో అన్న విషయంపైనే టీడీపీ నేతలు దృష్టి పెట్టడం సిగ్గుచేటు అని కొడాలి నాని ఘాటు విమర్శలు చేశారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.