కేఏ పాల్.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయలపై అవగాహన ఉన్న వారికి ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదని పేరు. ప్రజాశాంతి పార్టీని స్థాపించి రాజకీయాల్లో యాక్టీవ్ గా ఉన్నారు. తనదైన రాజకీయాలతో నిత్యం నవ్వుల పువ్వులు పూయిస్తుంటాడని కొందరి అభిప్రాయం. ఎన్నికల ప్రచారం కూడా కేఏ పాల్ అందరికి భిన్నంగా చేస్తుంటారు. ఇటీవల జరిగిన మునుగోడు ఉపఎన్నికలే అందుకు నిదర్శనం. సైకిల్ తొక్కుతూ, పొలంలో పత్తిని తీస్తూ, పిల్లలతో డ్యాన్స్ లు చేస్తూ తనదైన శైలిలో ఎన్నిక […]
మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆసుపత్రిలో చేరారు. గత కొన్ని నెలలుగా కిడ్నీలో రాళ్లతో బాధపడుతున్న ఆయన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చేరారు. తాజాగా, కిడ్నీలో రాళ్లకు సంబంధించి శస్త్ర చికిత్స పూర్తయింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. రెండు, మూడు రోజుల్లో ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. రెండు వారాలపాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు కొడాలి నానికి సూచించినట్లు తెలుస్తోంది. […]
కొడాలి నాని గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాజకీయ ప్రత్యర్థులను విమర్శించడంలో ఆయన తర్వాతే ఎవరైనా. ప్రతర్థుల మీద ఘాటు వ్యాఖ్యలు చేస్తూ విరుచుకుపడతారు కొడాలి నాని. గుడివాడ నియోజక వర్గం నుంచి గెలుపొంది… వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో పౌర సరఫరాలు, వినియోగదారులు వ్యవహారాల మంత్రిగా పని చేశారు. కొడాలి నాని తొలుత తెలుగుదేశంలో ఉన్నప్పటికి.. తర్వాత వైఎస్సార్‌సీపీ పార్టీలో చేరాడు. నిర్మోహమాటంగా.. కుండ బద్దలు కొట్టినట్లుగా మాట్లాడటం […]
ఏపీ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాల మద్య మాటల యుద్ద నడుస్తుంది. ప్రస్తుతం ఏపీలో అమరావతి ఇష్యూపై రగడ కొనసాగుతుంది. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు పై మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియర్ యన్టీఆర్ చేసిన తప్పు ఒక్కటే గుడ్డిగా చంద్రబాబు ని నమ్మడం. చంద్రబాబు కి ఏ మాత్రం విశ్వాసం లేకుండా ప్రవర్తించాడు.. ఇప్పుడు వచ్చి నీతి మాటలు మాట్లాడుతున్నాడు. పనికి రాని మాటలు మాట్లాడుతూ చంద్రబాబు కాలం […]
బాలకృష్ణ వ్యాఖ్యతగా వ్యవహరిస్తోన్న అన్‌స్టాపబుల్ సీజన్ 2 త్వరలోనే ప్రారంభం కానుంది. అక్టోబర్ 14న తొలి ఎపిసోడ్ స్ట్రీమ్ కానుంది. ఇక తొలి ఎపిసోడ్‌కే ఎవరు ఊహించని సెలబ్రిటీని గెస్ట్‌గా తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు, లోకేష తొలి ఎపిసోడ్‌కు గెస్ట్‌లుగా వచ్చారు. ఇందుకు సంబంధించిన ప్రోమో.. మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతుంది. ఇక ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కోసం జనాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక షోలో బాలయ్య.. తన బావకు అన్ని రకాల ప్రశ్నలు సంధించారు. మరీ […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు నిత్యం వాడీవేడీగా ఉంటున్నాయి. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈక్రమంలో టీడీపీ నేతలపై వైసీపీ నాయకులు ఓ రేంజ్ లో విరుచు కుపడుతున్నారు. ముఖ్యంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని టీడీపీ నాయకులపై మరోసారి ఫైర్ అయ్యారు. ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అస్తమించిన వ్యవస్థ అని..అందులోని కొంతమంది బ్రోకర్లు విశాఖపై విషం కక్కుతున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. […]
గురువారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షకాల సమావేశాలు మొదలయ్యాయి. సమవేశాలు మొదలైన నిమిషాల వ్యవధిలోనే ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సభను అడ్డుకునే యత్నం చేసింది. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీలో రాజధాని వికేంద్రీకరణపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈసందర్భంగా మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే పరిపాల వికేంద్రీకరణ జరగాలనే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చారని అన్నారు. ఈక్రమంలోనే నిర్మాత అశ్వనీదత్, […]
వైసీపీ ఫైర్ బ్రాండ్, మినిస్టర్ రోజా మరోసారి టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్‌లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. లోకేష్ ఒక పిల్లి పిత్రే అని.. అలాంటి వాడు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని వాడు, వీడు అంటే పళ్లు రాలగొడతానని హెచ్చరించారు. తాను, కొడాలి నాని టీడీపీ నుంచి ఎందుకు బయటకు వచ్చామో తెలిపారు. తొలి రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం రోజా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె […]
కొంత కాలంగా సైలెంట్‌గా ఉన్న వైసీపీ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తాజాగా దూకుడు పెంచారు. విపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పి కొడుతూ తనదైన స్టైల్లో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో నాని వ్యాఖ్యలపై తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏకంగా చంపేస్తామంటూ బహిరంగంగా హెచ్చరించాడు. అంతేకాక కొడాలి నానిపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ.. ఓ రేంజ్‌లో ఫైరయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోని తన […]
వైసీపీ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని జగన్ టీమ్‌లో ట్రబుల్ షూటర్‌గా పేరు తెచ్చుకున్నారు. తమ అధినేత మీద, పార్టీ మీద ప్రతి పక్షాలు చేసే విమర్శలును తిప్పికొట్టడంలో కొడాలి నాని దూకుడుగా వ్యవహరిస్తారు. ఇక వైసీపీ స్థాపించిన నాటి నుంచి సీఎం జగన్ వెన్నంటి ఉన్న కొడాలి నానికి.. అధినేత మంచి ప్రాధాన్యం ఇచ్చారు. 2019 ఎన్నికల తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కొడాలి నానికి మంత్రి పదవి ఇచ్చారు. ఆ తరువాత జరిగిన […]